Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
super star no politics

ఈ సంచికలో >> సినిమా >>

రకుల్‌ ప్రీత్‌సింగ్‌ ఎంపిక సరైనదే!

rakul's selection is right

తెలుగులో స్టార్‌ హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్న ముద్దుగుమ్మ రకుల్‌ ప్రీత్‌సింగ్‌. లేటెస్టుగా తమిళంలో 'ఖాకి' చిత్రంలో నటించింది. కార్తి హీరోగా నటించిన ఈ చిత్రం ద్విభాషా చిత్రం. తమిళంతో పాటు తెలుగులోనూ మంచి విజయం అందుకుంది. కాగా గ్లామరస్‌ పాత్రలతో మెప్పించే ముద్దుగుమ్మ రకుల్‌ ప్రీత్‌సింగ్‌ ఈ సినిమాలో ఇల్లాలి పాత్రలో నటించింది. తొలి సారిగా ఇంత హుందా అయిన పాత్రలో కనిపించింది రకుల్‌ ప్రీత్‌సింగ్‌. అయినా కానీ ఈ సినిమాలో నటించడం తనకెంతో మంచి అనుభూతినిచ్చిందనీ అంటోందీ ముద్దుగుమ్మ. త్వరలోనే రకుల్‌ బాలీవుడ్‌లోనూ సందడి చేయనుంది. 'అయ్యారీ' సినిమాలో నటిస్తోంది బాలీవుడ్‌లో రకుల్‌. నీరజ్‌పాండే ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా ఆఫర్‌ వచ్చినప్పుడు మొదట్లో కొంచెం ఆలోచించిందట.

అయితే స్టోరీ నచ్చి ఈ సినిమాకి సైన్‌ చేశానంటోంది. కథల ఎంపికలో రకుల్‌ది బెస్ట్‌ ఛాయిస్‌ అనే చెప్పాలి. కథ నచ్చితే ఆమెకు స్టార్‌ హీరో, యంగ్‌ హీరో అనే తేడా ఉండదు. వెంటనే ఆ సినిమాకి ఓకే చెబుతుంది. అందే రకుల్‌ ప్రత్యేకత. అదే ఆమెని తక్కువ కాలంలోనే స్టార్‌ హీరోయిన్‌గా నిలబెట్టింది. అంతేకాదు, రకుల్‌తో పని చేసిన హీరో అయినా, డైరెక్టర్‌ అయినా మరోసారి ఆమెనే ఛాయిస్‌గా ఎంచుకుంటారు కూడా. అందుకు ఆమె ఆటిట్యూడే కారణం. చరణ్‌తో రెండు సినిమాల్లో నటించింది. డైరెక్టర్‌గా బోయపాటి శీనుతో రెండు సినిమాలు. 'సరైనోడు', 'జయ జానకి నాయకా'. అలా రకుల్‌ ఆటిట్యూడ్‌ని గౌరవించేవాళ్లు తెలుగు పరిశ్రమలో చాలా మందే ఉన్నారు. అందుకే ఆమెకి టాలీవుడ్‌ అంటే ఎంతో ఇష్టమంటోంది కూడా. ఆ ఇష్టంతోనే తెలుగు భాషని నేర్చుకుంది. నేర్చుకోవడమే కాదు 'నాన్నకు ప్రేమతో' సినిమాలో తన పాత్రకి తానే డబ్బింగ్‌ చెప్పుకుంది కూడా. తాజాగా ఆమె చేతిలో రెండు తెలుగు సినిమాలు, రెండు తమిళ సినిమాలు ఉన్నాయి. తమిళంలో మరోసారి కార్తితో జత కడుతోంది ఈ ముద్దుగుమ్మ. అలాగే సూర్యతో ఓ సినిమా చేస్తోంది. మహేష్‌తో 'స్డైడర్‌'లో నటించింది. మరో ఆఫర్‌ కూడా రెడీగా ఉన్నట్లు రకుల్‌ చెబుతోంది. 

మరిన్ని సినిమా కబుర్లు
nag bacame god for varma