Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
when came out for power star

ఈ సంచికలో >> సినిమా >>

మెంటల్ మదిలో హిందీ పాట!

my hindi song for mental madilo

రాజ్ కందుకూరి గారికి "మెంటల్ మదిలో" లో నా చేత ఒక పాట రాయించాలని ఆలోచన. ఎప్పుడెప్పుడా అని నా ( సిరాశ్రీ ) కోరిక. 

కానీ దర్శకుడు వివేక్ ఆత్రేయ  స్వతహాగా గీతరచయిత. పాటలు రాయడం తనకి ప్యాషన్. 

సంగీత దర్శకుడు ప్రశాంత్ విహారి నుంచి ట్యూన్ కాస్త బాగా వస్తే చాలు వివేక్ లో కవితాప్రవాహం ఆగేది కాదు. ఇంకో గీత రచయితకి ట్యూన్ వెళ్లేది కాదు. 

దర్శకుడి భావస్వేచ్ఛకి అడ్డు రావడం నిర్మాత గారికి ఇష్టం లేదు. మరి ఎలా? వేచి చూడ్డమే. 

వేచి చూసి చూసి నాకు అలుపొచ్చింది. కానీ ఒక రోజు రాజ్ గారి నుంచి పిలుపొచ్చింది. అద్భుతమైన ట్యూన్ వినిపించి ఒక montage సాంగ్ రాయమన్నాడు వివేక్. 

"ఇంత మంచి ట్యూన్..అసలు బయటికి ఇవ్వడే! నాకెలా ఇస్తున్నాడు? పాపం నా మొహం చూసి దయతలచాడు" అనుకున్నాను మనసులో. 

"ఇది Destiny-Love-Devotion మీద నడిచే montage. సూఫీ గీతం లాంటిది సర్" అన్నాడు. 

నేనేదో పదాలు అల్లుకుంటుంటే, అసలు విషయం చెప్పాడు..."పూర్తిగా హిందీలో రాయాలి సర్..సర్కార్-3 లో రాసారు కదా..యూ కెన్" అంటూ ఎంకరేజ్మెంట్ కూడా ఇచ్చాడు. 

అప్పుడు అసలు విషయం బోధపడింది, ఈ ట్యూన్ నాకెందుకిచ్చాడో.  అతనికి హిందీ రాకపోవడం, నాకు వచ్చని అతను అనుకోవడం ఈ అవకాశానికి కారణం. 

"హిందీ ఎందుకు?" అన్నాను.

"ముంబాయి లో జరిగే ఎపిసోడ్ కి తెలుగు పాట బాగుండదు సర్. Atmosphere కి హిందీయే కరెక్ట్" అన్నాడు. 
ఏదైతేనేం!!  తెలుగు సినిమాకి పూర్తి హిందీ పాట! 

ఎప్పుడో "ఏ మేరా జహా.." అంటూ పవన్ కళ్యాణ్ ఖుషీలో విన్నాను తెలుగు సినిమాలో పూర్తి హిందీ పాట. మళ్లీ ఇప్పుడు, అనిపించింది. 

1957 నాటి "దో ఆంఖేన్ బారా హాత్" లో "మాలిక్ తేరే బందే హం" అనే లైన్ ని లీడ్ గా తీసుకుని ఇలా రాయడం జరిగింది. 
నికితా గాంధి అద్భుతంగా పాడిన ఈ పాట నా రెండవ హిందీ సినీగీతం! 

నాకు ఈ హిందీ అవకాశం ఇచ్చిన రాజ్ గారికి, వివేక్ కి... అద్భుతంగా స్వరపరిచిన ప్రశాంత్ విహారికి, పాడిన నికిత గాంధి కి స్వచ్ఛమైన హిందీలో "लाख लाख प्रणाम ". 

https://www.youtube.com/watch?v=ADuKDH0cAOI&feature=youtu.be

- సిరాశ్రీ

మరిన్ని సినిమా కబుర్లు
cheppukondi chooddam