పవన్ కళ్యాన్ - త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం చివరి షెడ్యూల్ షూటింగ్‌కి రెడీ అవుతోంది. ఇంతవరకూ యూరప్‌లో భారీ షెడ్యూల్ షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా ఇప్పుడు వారణాసికి బయలుదేరుతోంది. అక్కడే చివరి షెడ్యూల్ షూటింగ్ జరగనుంది. ఈ షెడ్యూల్‌తో సినిమా షూటింగ్ మొత్తం పూర్తవుతుంది. ఇక నిర్మాణానంతర కార్యక్రమాలే. కాగా షూటింగ్ చివరి దశకు చేరుకున్నప్పటికీ, సినిమా టైటిల్‌పై ఇంకా స్పష్టత రాలేదు. ఇంతవరకూ 'అజ్ఞాతవాసి' అనే టైటిల్ ప్రచారంలో ఉంది. కానీ చిత్ర యూనిట్ మాత్రం దానిపై స్పందించడం లేదు. స్పష్టత ఇవ్వడం లేదు. అయితే ఈ నెల 25న టైటిల్‌పై పక్కాగా స్పష్టత రావచ్చనీ తెలుస్తోంది. పవన్ - త్రివిక్రమ్ కాంబోలో తెరకెక్కిన 'అత్తారింటికి దారేది' సినిమా బాక్సాఫీస్ రికార్డుల్ని కొల్లగొట్టింది. సో ఆ సెంటిమెంట్‌తో ఈ సినిమాకి 'అ' అక్షరంతో మొదలయ్యేలా 'అజ్ఞాతవాసి' టైటిల్‌నే చిత్ర యూనిట్ నిర్ణయిస్తుందనీ అభిమానులు భావిస్తున్నారు. అయితే ఎందుకో టైటిల్‌పై చిత్ర యూనిట్ సస్పెన్స్ మెయింటైన్ చేస్తోంది. ఇకపోతే ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ పాత్రలో క్లాస్ అండ్ స్మార్ట్ లుక్‌లో కనిపించనున్నాడు.
అసలే అమ్మాయిలకు పవన్ అంటే పిచ్చ క్రేజ్. అలాంటిది సాఫ్ట్‌గా హ్యాండ్‌సమ్ లుక్స్‌లో పవన్ కనిపిస్తే ఇంకేముంది. లేడీ ఫ్యాన్స్‌కి కెవ్వుకేకే. అందులోనూ ఇద్దరు భామలతో పవన్ ఆన్‌స్క్రీన్ రొమాన్స్.. అనూ ఇమ్మాన్యుయేల్, కీర్తి సురేష్ ఈ సినిమాలో హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ ఇద్దరితోనూ పవన్ ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ అదరిపోనుందట. ఇప్పటికే యూరప్‌లో షూటింగ్ స్పాట్ నుండి లీకైన స్టిల్స్ ఎట్రాక్ట్ చేస్తున్నాయి. అదలా ఉంచితే, మ్యూజిక్ విషయానికి వస్తే తమిళ యంగ్ డైరెక్టర్ ఈ సినిమాకి సరికొత్త యూత్‌ఫుల్ మ్యూజిక్‌ని అందిస్తున్నాడు. ఆల్రెడీ రిలీజైన ఓ సాంగ్ ఉర్రూతలూగిస్తోంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ ఊహకందని రీతిలో జరుగుతోందని సమాచారమ్. సంక్రాంతికి సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
|