అదేమిటి? ఇరవైలు కూడా దాటని నాజూకు అందాల రకుల్ కి నలభై ఏళ్ళేమిటి అనుకుంటున్నారా? అదేం కాదండీ...ఈమధ్య హీరోయిన్లు అందాలకెంత ప్రాముఖ్యత ఇస్తున్నారో, ఫిట్ నెస్ కీ అంతే ఇంపార్టెన్స్ ఇస్తున్నారు...గంటలకొద్దీ జిం లలో కసరత్తులు చేసేస్తూ కండలు పెంచడంలో హీరోలతో పోటీ పడుతున్నారు...
వరుస ప్రాజెక్టులతో బిజీబిజీగా ఉన్న రకుల్ జిం లో కష్టపడిపోతున్న వీడియో ఒకటి ఈమధ్య పోస్ట్ చేసింది...మామూలు వర్కవుట్ అయితే అంత ప్రత్యేకత ఉండేది కాదేమో.. కానీ, ఈ చిన్నది ఏకంగా నడుముకి నలభై కిలోల స్క్వాడ్స్ కట్టుకుని వర్కవుట్ చేస్తుండడమే అభిమానులకు కాస్తంత బాధ కలిగించింది....ఆల్రెడీ నువ్వు ఫిట్ గానే ఉన్నావుగా, ఇంకా ఇంత కష్టపడడమేమిటి అని కొందరూ...సూపరని మరికొందరూ, ఫిట్ నెస్ క్వీన్ అంటూ ఇంకొందరూ ప్రశంసలు కురిపించేస్తున్నారు....అదన్నమాట సంగతి
|