యంగ్ హీరో సుమంత్ అశ్విన్ 'హ్యాపీ వెడ్డింగ్' చిత్రం తర్వాత కొత్త సినిమా ఓకే చేశాడు. నవంబర్ రెండో వారంలో ఈ సినిమా ప్రారంభం కానుంది. 'దండుపాళ్యం' సిరీస్‌తో పాపులర్ అయిన డైరెక్టర్ శ్రీనివాస్‌రాజు ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. 'గరుడవేగ' సినిమాతో సూపర్ హిట్ కొట్టిన నిర్మాత కోటేశ్వరరాజు నిర్మిస్తున్నారు. ఈ సినిమా కథా కమామిషు ఏంటంటే పూర్తిగా ఇదో హారర్ మూవీ అని తెలుస్తోంది. ఇంతవరకూ ఇలాంటి జోనర్‌ని సుమంత్ అశ్విన్ టచ్ చేసింది లేదు. క్యూట్‌గా చాక్లెట్ బోయ్‌లా కనిపించే మనోడు మంచి నటుడు. ఎలాంటి ఎమోషన్ అయినా ముఖంలో పండించగలడు. ఇంతవరకూ లవ్‌స్టోరీస్‌నే ఎంచుకుని, లవర్ బోయ్ ఇమేజ్ సంపాదించుకున్నాడు. ఏదో కెరీర్ అలా అలా నడిసేస్తున్నాడే కానీ సుమంత్ అశ్విన్‌కి ఇంకా సరైన బ్రేక్ రాలేదనే చెప్పాలి. ఈ తరుణంలో ట్రాక్ పూర్తిగా ఛేంజ్ చేసుకుని హారర్ కథాంశాన్ని ఎంచుకుని షాక్ ఇచ్చాడు సుమంత్ అశ్విన్. ఇంకా ఈ సినిమా గురించి చెప్పాలంటే తొలిసారి కెరీర్‌లో భారీ బడ్జెట్ చిత్రంగా రూపొందుతోంది ఈ చిత్రం.
అలాగే తెలుగుతో పాటు, తమిళ, మలయాళ కన్నడ భాషల్లో ఈ సినిమాని రూపొందిస్తున్నారు. అంతేకాదు ఇన్ని భాషలకు చెందిన ప్రముఖ నటీనటులు ఈ సినిమాలో నటిస్తారట. ఇన్ని ప్రత్యేకతలతో రూపొందుతోందంటే ఇదేదో ఆషామాషీ మూవీ కాదనిపిస్తోంది. చూద్దాం సుమంత్ అశ్విన్ కెరీర్‌లో చెప్పుకోదగ్గ సక్సెస్‌ని ఈ సినిమాతో అందుకుంటాడేమో.!
|