మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ సంక్రాంతి బరిలో అడుగుపెట్టేశాడు. చరణ్ - బోయపాటి కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న తాజా చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోన్న సంగతి తెలిసిందే. మొదట్లో ఈ సినిమాని డిశంబర్‌లో విడుదల చేయాలనుకున్నారు కానీ, అది కుదరడం లేదు. డిశంబర్ తప్పడంతో 'రంగస్థలం' సెంటిమెంట్‌తో మార్చికి స్లాట్ బుక్ చేస్తారేమో అనుకున్నారు. కానీ చరణ్ ప్లానింగే ప్లానింగ్. ఈ సినిమా లేటయితే తండ్రి మెగాస్టార్ చిరంజీవితో చరణ్ నిర్మిస్తున్న 'సైరా' విడుదల విషయంలో ఇబ్బంది కలుగుతుందనే నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లోనూ తన సినిమాని సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే పట్టుదలతో ఉన్నాడట. అదే పట్టుదలతో విశ్రాంతి లేకుండా కష్టడుతున్నాడట. దాదాపు చిత్రీకరణ చివరి దశకు చేరుకుంది.
సంక్రాంతికి ఈ సినిమా రిలీజ్ కావడం పక్కా అని నిర్మాత డివివి దానయ్య ఆల్రెడీ అఫీషియల్‌గా ప్రకటించేశారు. ఇంతవరకూ ఈ సినిమాకి టైటిల్ ఫిక్స్ చేయలేదు. టైటిల్ విషయంలో పలు పేర్లు పరిశీలనలో ఉన్నాయి. ఇదిలా ఉంటే, దీపావళికి మెగా ప్యాన్స్‌కి స్పెషల్ గిఫ్ట్ ఇవ్వనున్నాడట చరణ్. టైటిల్ లోగోతో కూడిన చిన్నపాటి టీజర్‌ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాడట. అదే నిజమైతే మెగా ఫ్యాన్స్‌కిది గుడ్ న్యూసే. ఈ సినిమాలో చరణ్‌కి జోడీగా కైరా అద్వానీ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది 'రంగస్థలం'తో బాక్సాఫీస్‌కి బ్లాక్ బస్టర్ అందించిన రామ్‌చరణ్ వచ్చే ఏడాది కూడా మంచి బోనీతో దూసుకొచ్చేస్తున్నాడన్న మాటే.
|