అదేంటీ.? ఎందుకు రిలాక్స్ అవ్వమంటున్నాడు అనుకుంటున్నారా.? రవితేజ నటిస్తున్న తాజా చిత్రం 'అమర్ అక్బర్ ఆంటోనీ' చిత్రంలో రవితేజ చెబుతున్న ఓ డైలాగ్ 'రిలాక్స్'. లేటెస్టుగా ఈ సినిమా టీజర్ విడుదలైంది. టీజర్ వెరీ వెరీ గ్రాండియర్ లుక్‌లో ఉంది. ఇంతవరకూ కాన్సెప్ట్ పోస్టర్స్‌తో స్పెషల్ ఇంట్రెస్ట్ క్రియేట్ చేసిన ఈ సినిమా ఇప్పుడు అంచనాలు పెంచేసింది. టీజర్‌కి వస్తున్న రెస్పాన్స్ అంత బాగుంది మరి. క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో సినిమా తెరకెక్కుతోందని తెలుస్తోంది. మూడు డిఫరెంట్ వేరియేషన్స్‌లో రవితేజ కనిపిస్తున్నాడు. యాక్షన్ బ్యాక్ డ్రాప్ బాగుంది. లొకేషన్స్‌లో రిచ్‌నెస్ అదిరిపోయింది. 'శ్రీమంతుడు', జనతా గ్యారేజ్', 'రంగస్థలం' సినిమాలతో సూపర్ డూపర్ హిట్స్ మీదున్న మైత్రీ మూవీస్ బ్యానర్‌లో ఈ సినిమా రూపొందింది.
బెల్లీ బ్యూటీ ఇలియానా సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది ఈ సినిమాతో. టీజర్‌లో ఇలియానాకీ రెండు మూడు చోట్ల ప్లేస్ దక్కింది. కాస్త బొద్దుగా ముద్దుగా కనిపిస్తోంది. టోటల్‌గా టీజర్‌తో మాస్ రాజా ఆకట్టేసుకున్నాడు. ఇక సినిమాతో ఎలా ఆకట్టుకుంటాడో చూడాలిక. ఈ నెల 16న 'అమర్ అక్బర్ ఆంటోనీ' ప్రేక్షకుల ముందుకు రానుంది. శీను వైట్ల ఈ చిత్రానికి దర్శకుడు. శీను వైట్ల - రవితేజ కాంబోలో చాలా కాలం తర్వాత తెరకెక్కుతోన్న చిత్రమిది. వీరిద్దరి కాంబోలో వచ్చిన గత చిత్రాలకు పూర్తి భిన్నంగా రూపొందుతోన్న కాన్సెప్ట్ ఇది. మాస్ రాజా ఏం చేస్తాడో చూడాలిక. మరోవైపు ఈ సినిమా సెట్స్‌పై ఉండగానే రవితేజ కొత్త చిత్రానికీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. విలక్షణ దర్శకుడు వి.ఐ.ఆనంద్ దర్శకత్వంలో ఆ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో మాస్ రాజా సరసన నభా నటేష్, పాయల్ రాజ్‌పుత్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.
|