విలక్షణ నటుడు కమల్‌హాసన్‌తో నటించాలనేది ఎంతో మంది హీరోయిన్స్‌కి తీరని కల. ఆ కల నెరవేరే అవకాశం వచ్చిందంటే అది నిజంగా లక్కే కదా. అలాంటి లక్కు తోక తొక్కినట్లుంది చందమామ కాజల్ అగర్వాల్. కమల్‌హాసన్ కెరీర్‌లో వన్ ఆఫ్ ది బ్లాక్ బస్టర్ హిట్ అయిన 'భారతీయుడు' చిత్రానికి ఇప్పుడు సీక్వెల్ తెరకెక్కుతోంది. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలోనే కమల్ సరసన కాజల్ హీరోయిన్‌గా ఎంపికైందనే ప్రచారం జోరుగా వినిపిస్తోంది. 'భారతీయుడు 2' టైటిల్‌తో తెరకెక్కుతోన్న ఈ చిత్రం కోసం కమల్‌హాసన్ సరసన ఇద్దరు ముద్దుగుమ్మల్ని ఎంచుకున్నారు. వారిలో ఒకరు సౌత్ క్వీన్ నయనతార కాగా, రెండో ముద్దుగుమ్మ పేరు కాజల్ అని లేటెస్టుగా వినిపిస్తున్న టాక్. అయితే ప్రస్తుతం కమల్‌హాసన్ రాజకీయాల్లో యాక్టివ్‌గా ఉన్నారు.
ఈ టైంలో ఈ సినిమాని ఎప్పుడు పట్టాలెక్కిస్తారనేది ఇంకా తెలీదు కానీ, దర్శకుడు శంకర్ 'రోబో 2.0' రిలీజ్ తర్వాత ఫ్రీ అయిపోతారు. నవంబర్‌లో 'రోబో 2.0' రిలీజ్ కానుంది. ఆ మూడ్ నుండి బయటికి వచ్చాక శంకర్ కొన్ని రోజులు రెస్ట్ తీసుకుని 'భారతీయుడు 2' స్క్రిప్టు పనులపై దృష్టి పెట్టనున్నారట. ఇక చందమామ విషయానికి వస్తే, ప్రస్తుతం తెలుగు, తమిళ భాషల్లో వరుస సినిమాలతో బిజీగా గడుపుతోంది కాజల్. తెలుగులో యంగ్ హీరో బెల్లంకొండతో రెండు చిత్రాల్లోనూ, తమిళంలో బాలీవుడ్ 'క్వీన్' రీమేక్ 'ప్యారిస్ ప్యారిస్' చిత్రంలోనూ కాజల్ నటిస్తోంది. ఈ తరుణంలో కమల్ సినిమాలో ఛాన్స్ రావడంతో అమ్మడి ఆనందానికి అవధుల్లేవట.
|