'నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా' సినిమా రిజల్ట్‌తో బాగా డీలా పడిపోయాడు అల్లు అర్జున్. ఎలాంటి కథని ఎంచుకోవాలో తెలియని సందిగ్ధ స్థితిలో తదుపరి సినిమాకి చాలా గ్యాప్ తీసుకున్నాడు. ఎట్టకేలకు పలువురు డైరెక్టర్స్‌ని పరిశీలించి త్రివిక్రమ్‌కి ఫిక్సయ్యాడు. ఎన్టీఆర్‌తో 'అరవింద సమేత..' విజయవంతం కావడంతో త్రివిక్రమ్‌కి ఓటేశాడు బన్నీ. గతంలో త్రివిక్రమ్ దర్శకత్వంలో 'జులాయి', 'సన్నాఫ్ సత్యమూర్తి' వంటి సూపర్ హిట్స్ ఉన్నాయి బన్నీ ఖాతాలో. సో త్రివిక్రమ్‌తో ఈ సారి హ్యాట్రిక్ కొట్టాలనే కసితోనే బన్నీ అలా ఫిక్స్ అయ్యాడట. ఈ విషయమై ఇక అఫీషియల్ ప్రకటన రావాల్సి ఉంది. 'అజ్ఞాతవాసి' ఫెయిల్యూర్ తర్వాత త్రివిక్రమ్‌కి 'అరవింద సమేత' కాస్త రిలీఫ్‌నిచ్చింది. ఆ రీఫ్రెష్‌మెంట్‌తో బన్నీ కోసం పర్‌ఫెక్ట్ స్క్రిప్టు తయారు చేసే పనిలో బిజీ అయిపోయాడట త్రివిక్రమ్. బన్నీతో ఈ సారి పక్కా కమర్షియల్ ఎంటర్‌టైనర్‌ని తీయబోతున్నాడట.
ఈ సినిమా కోసం లక్కీ బ్యూటీ కైరా అద్వానీని ప్రిఫర్ చేస్తున్నాడట బన్నీ. 'భరత్ అనే నేను' సినిమాతో కైరా మంచి హిట్ కొట్టింది. ప్రస్తుతం చరణ్ సినిమాలో నటిస్తోంది. బాలీవుడ్‌లో అర్జున్‌రెడ్డి రీమేక్ 'కబీర్‌సింగ్'లోనూ కైరా నటిస్తోంది. సో కైరా రూపంలో బన్నీ ఈ సారి సూపర్ హిట్ కొట్టేద్దామనుకుంటున్నాడు కాబోలు. ఏదేమైతేనేం, మొత్తానికి బన్నీ నెక్ట్స్ ప్రాజెక్ట్‌ని ఓకే చేసినందుకు ఫ్యాన్స్ కాస్త ఊరట పొందారు. వీలైనంత త్వరలో ఈ ప్రాజెక్ట్‌ని పట్టాలెక్కించేందుకు బన్నీ అండ్ త్రివిక్రమ్ రెడీ అవుతున్నారు.
|