మేష రాశి : (అశ్వని 4 పాదాలు ,భరణి 4 పాదాలు,కృత్తిక 1 వ పాదం )
ఈవారం వ్యాపారపరమైన విషయాల్లో లబ్దిని పొందుతారు. నూతన పనులను మొదలు పెట్టుటకు అవకాశం ఉంది. తలపెట్టిన పనులు అనుకున్న సమయానికి పూర్తిఅవుతాయి. ఆర్థికపరమైన విషయాల్లో సంతృప్తికరమైన ఫలితాలు పొందుతారు. దూరప్రదేశప్రయాణాలు చేయుటకు అవకాశం ఉంది. కుటుంబంలో జీవితభాగస్వామి నుండి నూతన విషయాలు తెలుసుకొనే అవాకాశం ఉంది. మిత్రులతో కలిసి విందులలో పాల్గొంటారు. స్వల్ప ఆరోగ్యపరమైన ఇబ్బందులు తప్పక పోవచ్చును, తగిన జాగ్రత్తలు తీసుకోవడం సూచన. పెద్దలతో చేసిన చర్చల నుండి పూర్తిస్తాయి ఫలితాలు రావడం వలన సంతోషాన్ని పొందుతారు.
వృషభ రాశి : (కృత్తిక 2,3, 4 పాదాలు ,రోహిణి 4 పాదాలు,మృగశిర 1, 2 పాదాలు)
ఈవారం ఎవ్వరితోను మాటపట్టింపులకు పోకండి. అలాగే ధనమునకు సంభందించిన విషయాల్లో మధ్యవర్తిత్వం చేయకపోవడం మంచిది. కుటుంబంలో చిన్న చిన్న విషయాలు మిమ్మల్ని భాధకు గురిచేస్తాయి. ప్రయాణాలు వాయిదాపడే ఆస్కారం కలదు. నచ్చిన వ్యక్తులతో సమయాన్ని గడపాలని కోరుకుంటారు. మీ ఆలోచనలు మిత్రులతో పంచుకుంటారు, కొన్ని ఆలోచనలు మిమ్మల్ని కొంత ఒత్తిడికి గురిచేసే అవకాశం ఉంది. ఉద్యోగంలో బాగుంటుంది. అధికరులనుండి ప్రశంశలు లభించే అవకాశం కలదు. సంతానం మూలాన కొంత ఇబ్బందులు ఎదురైనప్పటికి తోటివారి సహకారంతో వాటిని అదిగమిస్తారు.
మిథున రాశి : (మృగశిర 3,4 పాదాలు ,ఆరుద్ర 4 పాదాలు, పునర్వసు 1,2,3 పాదాలు)
ఈవారం ప్రయాణాలు చేయువిషయంలో బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. పెద్దలతో కలిసి చేపట్టిన పనులు ఒక కొలిక్కి వస్తాయి. కుటుంబంలో సభ్యుల నుండి వచ్చిన సూచనలు పరిగణలోకి తీసుకోండి. పనులకు ప్రాధాన్యం ఇవ్వడం వలన పెండింగ్లో ఉన్న పనులను పూర్తిచేసే అవకాశం కలదు. సంతానం విషయంలో నూతన ఆలోచనలు కలిగి ఉంటారు. స్వల్పఅనారోగ్యసమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టె అవకాశం ఉంది కావున తగిన జాగ్రత్తలు తీసుకోండి. విలువైన వస్తువుల పట్ల మక్కువను కలిగి ఉంటారు. స్త్రీ / పురుష సంభందాల్లో జాగ్రత్తగా వ్యవహరించుట సూచన. దైవపరమైన పూజలకు లేదా యోగాకు కాస్త సమయం ఇవ్వడం చాలావరకు మేలుచేస్తుంది.
కర్కాటక రాశి : (పునర్వసు 4 వ పాదం ,పుష్యమి 4 పాదాలు,ఆశ్లేష 4 పాదాలు)
ఈవారం ఉద్యోగంలో మార్పులకు అవకాశం ఉంది. అధికారులతో చేపట్టిన పనులను విజయవంతంగా పూర్తిచేస్తారు. ప్రయాణాలు చేయునపుడు చిన్న చిన్న జాగ్రత్తలు పాటించుట అవసరం. ఆర్థికపరమైన విషయాల్లో కొంత ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. కుటుంబసభ్యులకు మీ ఆలోచనలు తెలియజేస్తారు. వ్యాపారపరమైన విషయాల్లో నూతన ఆలోచనలు కలిగి ఉంటారు. సంతానం విషయంలో ఊహించని ఖర్చులు ఏర్పడే ఆస్కారం ఉంది. అప్పుల లేదా రుణపరమైన విషయంలో జాగ్రత్తగా లేకపోతే నూతన సమస్యలు ఏర్పడుతాయి. పెద్దలతో నూతన్ చర్చలు చేయుటకు అవకాశం ఉంది, వారితో మీకున్న అనుభందం బలపడుతుంది.
సింహ రాశి : (మఖ 4 పాదాలు ,పుబ్బ (పూర్వఫల్గుణి) 4 పాదాలు, ఉత్తర 1 వ పాదం )
ఈవారం మానసికపరమైన విషయాల్లో కొంత ఒత్తిడిని ఎదుర్కొనే అవకాశం కలదు. విదేశాల నుండి నూతన సమాచారం అందుతుంది. ప్రయాణాలు చేయునపుడు తగిన జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. ఉద్యోగంలో పనిఒత్తిడి ఉంటుంది కాకపోతే తోటివారినుండి ఆశించిన సహకారం ఉండటం వలన పనులను పూర్తిచేస్తారు. అగ్నిపరమైన వస్తువులతో పనిచేసే సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. వ్యాపారపరమైన విషయాల్లో చిన్న చిన్న మార్పులు ఏర్పడే అవకాశం కలదు. అనుకోని ఖర్చులకు అవకాశం ఉంది కావున సాధ్యమైనంత మేర ఖర్చులను తగ్గించుకొనే ప్రయత్నం చేయండి.
కన్యా రాశి : (ఉత్తర 2,3, 4 పాదాలు ,హస్త 4 పాదాలు,చిత్త 1, 2 పాదాలు )
ఈవారం మీరు తీసుకొనే నిర్ణయాల విషయంలో స్పష్టమైన ఆలోచన కలిగి ఉండుట సూచన. ఆర్థికపరమైన విషయాల్లో ఆదాయం బాగానే ఉన్న అదే స్థాయిలో ఖర్చులు కూడా ఉంటాయి. ప్రయాణాలు చేయుటకు అవకాశం ఉంది. చిన్న చిన్న విషయాలకే హైరానా పడే అవకాశం ఉంది. కుటుంబసభ్యులతో కలిసి నూతన పనులను చేపట్టుటకు అవకాశం ఉంది. పనులమూలాన శ్రమ తప్పక పోవచ్చును. స్త్రీ సంభందమైన విషయాల్లో జాగ్రత్తగా లేకపోతే మాటపడవలసి వస్తుంది. ఉద్యోగంలో అధికారుల నుండి ప్రశంశలు పొందుతారు. నూతన ఉద్యోగప్రయత్నాలు కలిసి వస్తాయి. శుభాకార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం ఉంది.
తులా రాశి : (చిత్త 3,4 పాదాలు ,స్వాతి 4 పాదాలు, విశాఖ 1,2,3 పాదాలు )
ఈవారం మిత్రులతో సమయాన్ని సరదాగా గడుపుటకు ఇష్టపడుతారు. ఆర్థికపరమైన విషయాల్లో నూతన ప్రయత్నాలు మొదలుపెడతారు. కుటుంబంలో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారపరమైన విషయాల్లో పెట్టుబడులు పెట్టుటకు ఆస్కారం ఉంది. దూరప్రదేశ ప్రయాణాలు చేయుటకు ఆస్కారం కలదు. గతంలో ఆగిన పనులను మీ మాటతీరుచే పూర్తిచేసుకొనే అవకాశం ఉంది. ఉద్యోగంలో మిశ్రమఫలితాలు ఉంటాయి, నలుగురిని కలుపుకొని వెళ్ళుట సూచన. సంతానం మూలాన ఊహించని ఖర్చులకు అవకాశం ఉంది అలాగే వాహనముల విషయంలో జాగ్రత్తగా ఉండుట అవసరం. చర్చలకు దూరంగా ఉండుట వలన సమస్యలు తగ్గుతాయి.
వృశ్చిక రాశి : (విశాఖ 4 వ పాదం ,అనురాధ 4 పాదాలు,జ్యేష్ఠ 4 పాదాలు )
ఈవారం బంధువులతో కలిసి నూతన పనులను చేపట్టుటకు అవకాశం ఉంది. విలువైన వస్తువులను కొనుగోలు చేసే విషయంలో తొందరపాటు వద్దు. ప్రయాణాలు వాయిదా వేయుట సూచన. ఆర్థికపరమైన విషయాల్లో బాగానే ఉంటుంది. కుటుంబంలో సభ్యులతో కలిసి ముఖ్యమైన ఆలోచనలు చేపట్టుటకు ఆస్కారం ఉంది. ఉద్యోగంలో మార్పులు ఉంటవి, నూతన ఉద్యోగఅవకాశాలు కలవు. వాహనముల మూలాన ఇబ్బందులు పొందుతారు. సోదరుల నుండి విషయాలు తెలుసుకొనే అవకాశం ఉంది. గతకొంతకాలంగా ఎదురుచూస్తున్న ఫలితాలు వెలువడే అవకాశం ఉంది, మిశ్రమఫలితాలు కలుగుతాయి.
ధనస్సు రాశి : (మూల 4 పాదాలు ,పూర్వాషాఢ 4 పాదాలు,ఉత్తరాషాఢ 1 వ పాదం )
ఈవారం పనుల వలన ఒత్తిడిని పొందుటకు అవకాశం ఉంది. చేపట్టిన పనుల విషయంలో కొంత సందిగ్దత ఉంటుంది. దూరప్రదేశప్రయాణాలు చేయుటకు అవకాశం కలదు. ఆర్థికపరమైన విషయాల్లో ఒత్తిడిని కలిగి ఉంటారు. సాధ్యమైనంతవరకు అనవసరమైన ఖర్చులకు దూరంగా ఉండుట వలన మేలుజరుగుతుంది. మీ ఆలోచనలను తోటివారు వ్యతిరేకించే అవకాశం ఉంది, ఈ విషయంలో సర్దుబాటు విధానం అవసరం. ఉద్యోగంలో మిశ్రమఫలితాలు పొందుతారు. పెద్దల సూచనలు పాటించుట వలన లబ్దిని పొందుతారు. వ్యాపారపరమైన విషయాల్లో మీకంటూ ఒక విధానం ఆవలంభించే ప్రయత్నం చేయుట ఉత్తమం.
మకర రాశి : (ఉత్తరాషాఢ 2,3, 4 పాదాలు ,శ్రవణం 4 పాదాలు,ధనిష్ఠ 1, 2 పాదాలు )
ఈవారం ఇష్టమైన వ్యక్తుల నుండి నూతన సమాచరం అందుతుంది. కొంత ఇబ్బందులు తగ్గుముఖం పడుతాయి. నూతన ప్రయత్నాల విషయంలో బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. తలపెట్టిన పనులను కాస్త ఆలస్యంగా పూర్తిచేసే అవకాశం ఉంది. వారం చివరలో బాగానే ఉంటుంది కాకపోతే సరైన ప్రణాళిక అవసరం. ప్రయాణాలు చేయుటకు అవకాశం ఉంది. బంధువుల నుండి వచ్చిన సూచనలు మీకు పెద్దగా నచ్చకపోవచ్చును. ఆర్థికపరమైన విషయాల్లో నూతన అవకశాలు లభించే ఆస్కారం కలదు. కుటుంబంలో చిన్న చిన్న సమస్యలే పెద్దగా మారే అవకాశం కలదు, కావున సర్దుబాటు విధానం చాలావరకు మేలుచేస్తుంది.
కుంభ రాశి : (ధనిష్ఠ 3,4 పాదాలు ,శతభిషం 4 పాదాలు, పూర్వాభాద్ర 1,2,3 పాదాలు )
ఈవారం సమయాన్ని అధికంగా ప్రయాణాలకు కేటాయించే అవకాశం ఉంది. విదేశీప్రయాణాలు అనుకూలిస్తాయి. దూరప్రదేశంలో ఉన్న మిత్రులనుండి నూతన విషయాలు తెలుస్తాయి. ఆర్థికపరమైన విషయాల్లో మిశ్రమఫలితాలు పొందుతారు. సామజికపరమైన విషయాల పట్ల మక్కువను కలిగి ఉంటారు. ఊహించని ఖర్చులకు ఆస్కారం ఉంది. వాహనముల వలన అనుకోని ఖర్చులు ఏర్పడుతాయి. చర్చాపరమైన విషయాల్లో పాల్గొనకపోవడం మంచిది. విభేదాలు రాకుండా జాగ్రత్త పడటం మంచిది. దైవసంభందమైన విషయాల్లో పాల్గొనేప్రయత్నం చేయుట అవసరం. సోదరులతో చేసిన చర్చలు పూర్తిస్థాయి ఫలితాలు ఇవ్వకపోవచ్చును
మీన రాశి : (పూర్వాభాద్ర 4 వ పాదం ,ఉత్తరాభాద్ర 4 పాదాలు,రేవతి 4 పాదాలు )
ఈవారం నూతన ఆలోచనలు కలిగి ఉంటారు. తలపెట్టిన పనులను అనుకున్న సమయానికి పూర్తిచేసే అవకాశం ఉంది. దూరప్రదేశప్రయాణాలు చేయవలసి రావోచ్చును. ఆర్థికపరమైన విషయాల్లో పెద్దలనుండి ఆశించినమేర సహకారం లభిస్తుంది. కుటుంబంలో మీరు తీసుకొనే నిర్ణయాలు నూతన సమస్యలు తెచ్చి పెట్టుటకు అవకాశం ఉంది. ఆరోగ్యం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోండి, సమయానికి భోజనం చేయుట సూచన. ఉద్యోగఅవకాశాలు ఉంటాయి, సరైన పద్దతి కలిగి ఉండుట చేత మేలుజరుగుతుంది. మీ మాటతీరు కొంతమందిని ఇబ్బందికి గురిచేసే అవకాశం కలదు సర్దుబాటు విధానం అవసరం.
డా. టి. శ్రీకాంత్
వాగ్దేవి జ్యోతిషాలయం
|