Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
Boneless chicken iguru - very easy and tasy chicken curry.

ఈ సంచికలో >> శీర్షికలు >>

నారంశెట్టికి కేంద్ర సాహిత్య పురస్కారం ప్రదానం - ..

sabhaku namaskaram

విజయనగరం జిల్లా పార్వతీపురం పట్టణానికి చెందిన ప్రముఖ బాలసాహితీ వేత్త , ఉత్తరాంధ్ర రచయితల వేదిక అధ్యక్షుడు నారంశెట్టి ఉమామహేశ్వరరావు గారికి   2018 కేంద్ర సాహిత్య బాల సాహిత్య పురస్కారాన్ని నవంబర్ 14 సాయంత్రం  సిక్కిం రాజధాని గేంగ్ టక్ లో  గవర్నమెంటు కాలేజి ఆఫ్ సిక్కిం ఆడిటోరియంలో  ఘనంగా నిర్వహించిన కార్యక్రమంలో ప్రదానం చేసారు.  

నారంశెట్టి రాసిన “ఆనందలోకం “ బాలల నవల తెలుగు భాషలో బాలసాహిత్య పురస్కారానికి ఎంపికైన విషయం ఈ ఏడాది జూన్ 22 నాడు  కేంద్ర సాహిత్య అకాడెమీ ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే.  
ఈ సభకు దేశంలోని 24 భాషల రచయితలు హాజరయ్యారు. 
 
కేంద్ర సాహిత్య పురస్కార ప్రదాన సభకు  ముఖ్య అతిధిగా ప్రసిద్ధ అస్సామీ రచయిత నగెన్ సయికియా హాజరు కాగా,   సాహిత్య అకాడెమి ఉపాద్యక్షుడు మాధవ్ కౌషిక్ ,  సాహిత్య అకాడెమీ కార్యదర్శి కె. శ్రీనివాసరావు గార్లతో కలసి  నారంశెట్టి కి  పురస్కార ప్రదానం చేశారు. పురస్కారం క్రింద తామ్ర లిఖిత జ్ఞాపిక, యాభై వేల రూపాయల చెక్కును బహూకరించి శాలువా, పూలమాలతో సత్కరించి  పురస్కార గ్రహీతకు అందజేశారు. 
 
గత నాలుగు దశాబ్దాలుగా బాల సాహిత్యంలో విశేష కృషి చేసిన నారంశెట్టి  1500 కు పైగా కథలు, గేయాలు, వ్యాసాలు పత్రికలలో ప్రచురించారు. వీరు రాసిన నలభై మూడు పుస్తకాలలో ఇంతవరకు ఇరవైకు పైగా పుస్తకాలు ప్రచురింపబడ్డాయి.వింత జలం కథా సంపుటికి పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వ విద్యాలయం పురస్కారం, గిడుగు మాతృభాషా పురస్కారం, తానా నవలల పోటీలో ఈతరం కుర్రాడు నవలకు బహుమతి , మేలెరిగిన మనిషి కథా సంపుటికి రాష్ట్ర బాల సాహిత్య పరిషత్ ప్రథమ బహుమతి పొందారు.వీరికి బాల సాహితీ రత్న, బాల సాహితీ భూషణ్, బాల బంధువు, బాల నేస్తం బిరుదులు ఉన్నాయి. వీరు నారంశెట్టి బాలసాహిత్య పీఠం స్థాపించి బాల సాహిత్య అభివృద్దికి కృషి చేస్తున్నారు. 
మరిన్ని శీర్షికలు
sogasuchoodatarama