Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
weekly-horoscope23rd november to 29th november

ఈ సంచికలో >> శీర్షికలు >>

శ్రీ సత్యసాయి బాబా వారి జన్మదినం . - ఆదూరి హైమావతి

sri satya sai baba birthday

చావుపుట్టు కేలేనట్టి శాశ్వతుండు 
ఆది మధ్యాంత రహితుడనాది వాడు
తాను చావక పుట్టక చంపబడక
ఆత్మరూపుడై తానదె అలరి యుండు.

భగవంతునికి పుట్టుట అనేదేలేదు. భూమిమీది మానవుల కం తా  మేలుచేయదలచి , సంస్కరింపదలచి  ప్రవేశజనం స్వీక రించీ భూమిమీద ఆయాకాలపు మానవ జీవనశైలికి అనుగు ణం గా రూపం దాల్చుతుం టారు. శ్రీరామునిగా అవతరించి నపుడు ఆకాలమ్నాటి జనుల శైలికి  అనుగుణ్మగానూ, శ్రీకృష్ణ రూపం దాల్చినపుడు ఆకాలపు మాన వులమాదిరిగానూ భగవా నుడు అవతరించారు. నేడు మాన వులమధ్య ఈ శ్రీసత్యసాయి బాబా గా అవతరించినపుడు ఈ నాటి మానవులకు సరిపోయే విధంగా రూపుదాల్చారు. 

ఒకమారు కొందరు భక్తులు బాబావారిని " స్వామీ !మీది ప్రసవ జన్మా పవేశజన్మా? అని సందేహం అడిగి నపుడు స్వామివారు" నాది ప్రవేసజనం 'అనిచెప్పారు. 

తల్లి ఈశ్వరమ్మ ఒక సాయంకాలం  పౌర్ణమి ఆ రోజున నూతి లో  నీరు తోడుతుండగా ఆకాశం నుండీ ఒక వెలుగు గుండ్రం గాఉన్నఆకారంలో ఆమె గర్భం లో ప్రవేశించగా ఆమె స్పృహ తప్పి పడిపోతారు. అలా భగవానుడు ప్రవేశ జన్మగా ఆమెకు జన్మించారు 

పుట్టినట్లెరుగము ఇటువంటి పుణ్యమూర్తి చూసి ఎరుగము శ్రీసత్య సాయి కీర్తి  జదివి ఎరుగము శ్రీసాయి లాంటి వ్యక్తి   తెలిసి ఎరుగము దేదీప్య దైవ్యశక్తి.

బాబావంటి అవతార్మ వెనుక రాలేదు. భగవానుడు సాధార ణంగ ఐఅతరజన్మల్లో రాక్షస సమ్హారం జరిపారు . ఈ అవతా రంలో రక్షసగుణాలను సమ్హరించను వచ్చారు. మానవుల్లో పెరిగిపోతున్న అవలక్షణాల ను, దుర్మార్గాలనూ, దుష్ట గుణా లనూ తమ దివ్యమైన ప్రేమతో మార్చి సన్మార్గ వంతు లుగా చేయనే ఈ అవతారం వచ్చినట్లు స్వామి భక్తులందరికీ విది తమే. 
    ఈశ్వరమ్మ అత్తగారు తెచ్చి ఇచ్చిన సత్యనారాయణ వ్రత ప్రసాదం స్వీకరించాక ఒక మగబిడ్డను ప్రసవించగా ఆబిడ్డకు సత్యనారాయణ అనినామకరణం చేస్తారు. వారిది రాజుల వంశం  కనుక -అంతా సత్యనారాయణ రాజు అనిపిలిచే వారు. దగ్గరివారు రాజు అనీ ఇంట్లో సత్యం అనీపిలిచేవారు.
ప్రేమ తప్పవేరు పెన్నిధి ఎరుగడు
     శాంతి తప్ప సుంత చింతలేదు
     మానవత్వము తప్ప మాలిన్యమేలేని
    సాయిలాంటి వ్యక్తి సముడు లేడు.
సత్యసాయి భగవానుడు కేవలం ప్రేమే ఆయుధంగా మాన వు లమనస్సులను మార్చి సన్మార్గవర్తనులుగానూ త్యాగ శీలు రుగానూ తయారు చేసి మానవసేవకు అంకితమయ్యేలాగా చేసారు. ఎందరో స్వామి ప్రేమకు కరిగి తమ జీవితాలను మానవసేవకు, దీన జనోధ్ధరణకూ అంకిత మయ్యారు.  
ప్రేమను పంచెడు దేవుడు 
ప్రేమయె తమ ఆయుధముగ కలిగినవాడున్ 
ప్రేమతొ మనసులుమార్చెడు  
ప్రేమమయునివేడెద కావగమనలన్  
  బాల్యం ఉండేస్వామి వారు తమస్నేహితులకు కోరినవన్నీ సంచీనుంచీ తీసి ఇవ్వడం, చిత్రావతీ నదీతీరంలోని కొండ మీదగల చింత చెట్టునుంచీ స్నేహితులుకోరిన అన్ని రకాల పండ్లనూకోరి ఇచ్చేవారు. అదేకల్పవృక్షంగా పేరుగాంచింది. చిత్రావతీ నదీప్రాంతపు ఇసుకలో నుండీ ఎన్నో వస్తువులు , విగ్రహాలూ స్వీట్లీ తీసి ఇచ్చేవారు, వేడిపేడి మైసూరుపాకుల వంటివి. 
  ఇది బాబావారు తమ అద్భుత లీలావిశేషాలను చూపి తామూ అవతార మూర్తిగా మానవులు గుర్తించి తమ సూక్తు లను అను సరించి వర్తించనుమాత్రమే ఒక సాధనంగా చేసుకున్నారు.   
బాబావారు విద్య వైద్యము ఆధ్యాత్మికత అనే మూడు విధా నాల ద్వారా మానవ సేవ ఎలాచేయాలో చేసి చూపుతూ తమ భక్తులచేత చేయించి జన్మలు ధన్యపరచుతూ ఉన్నారు. తల్లికోరికమేరకు ఆమె మూడు కోర్కెలను తీర్చారు. 
 మొదటిది తల్లి ఈశ్వరమ్మ అడిగిన ఒక పాఠసాల కట్టించి, కాలక్రమంలో అది సతయ్సాయి డీముడ్    యూనివర్శిటీ గా మార్చి విలువలతోకూడిన ఉచిత విద్యను కేజీ నుండీ పీజీ వరకూ అందిస్తున్నారు. ఈ విశ్వవిద్యాలయంలో చదివిన విద్యార్ధులు విశ్వవ్యాప్తంగా అనేక మంచి ఉన్నత ఉద్యోగాల్లూ ఉంటూ మానవసేవచేస్తూ ఉన్నారు.
 పుట్టపర్తి, ముద్దనహళ్ళి, అనంతపురంలో మహిళాకళాశాల ఆద ర్శం గా నడుస్తున్నాయి.తల్లి రెండవకోర్కె ప్రకారం ఒక చిన్న వైద్య శాల కట్టించి అది కాలక్రమేణా సూపర్ స్పెషాలిటీ హాస్పెటల్ గారూపుదిద్దుకుంది ,ధనిక పేదా అన్న తేడాలేక అందరికీ ఉచిత వైద్యసేవలను అందిస్య్న్నది. పుట్టపర్తి, బెంగుళూరు వంటి తదితర ప్రాంతల్లో ఆదఋసవంతమైన ఉచిత వైద్యాన్ని అందిస్తున్నది.
తల్లి మూడవకోర్కె ప్రకారం ఒకమంచి నీటి బావి త్రవ్వించగా అది  ఆతర్వాత ఉచిత సతయ్సాయి జపధకంగా రూపొంది ఆంద్ర నేటి తెలంగాణాజిల్లాలకేకాక మద్రాసు మంచినీటి సమస్యనూ బాబావారి తీర్చారు. ఇల తల్లికోర్కెలను జనావళికి కానుకలుగా స్వామి అందించారు.
తమ మధురోపన్యాసాల్లో భారతీయ సంస్కృతినీ, వేద పురాణా ల్లోని అద్భుతవిషయాలనూ చిన్న కధల ద్వారా అందించి అందరికీ సులభంగా అర్ధమయ్యేలాగా ఎన్నెన్నో ఉపన్యా సా ల ద్వారా భక్తులకు బోధించారు.
           వేయి తల్లుల ప్రేమల వేల్పు యితడు
          కోర్కె తీర్చును భక్తితో కోరినపుడు 
          కంట తడి రానీయని కరుణమూర్తి
          శరణు కోరిన చేరును చెప్పకుండ.
భక్తులను తల్లిలా దయతో,ప్రేమతో , కరుణతో కాపాడే తత్వం స్వామివారిది. ఎక్కడున్నా ఎవరైనా సాయీ అంటే ఓయీఅని పలికి కాచే దయామయుడు బాబావారు.
ప్రేమ తప్పవేరు పెన్నిధి ఎరుగడు
శాంతి తప్ప సుంత చింతలేదు
మానవత్వము తప్ప మాలిన్యమేలేని
సాయిలాంటి వ్యక్తి సముడు లేడు.
సత్య ,ధర్మ,శాంతి,ప్రేమ,అహింసలను మానవాళికి చాటి చె ప్పి పేదసాదలకు పెను సేవలందించేలా తమ భక్తులను  తయారు చేసిన భగవాన్ ఎంతోమదిని జీవితాలను చక్కది ద్దారు.
         దీనుల కుయ్యాలింపను
        దీనుల రక్షింప మేలు దీవెనలొసగన్
        దీనావన నీకొప్పును
        దీనపరాధీన దేవదేవ మహేశ! 
ఎంతోమందికి ఇళ్ళుకట్టించి, ఆరోగ్యాలను కుదుటబరచి, విద్య నేర్పించి  ఆదుకున్నారు.  
చేతులారంగ సేవలు చేయుటకును
నోరునొవ్వంగ హరికీర్తి నుడువుటకును
దయయూ సత్యంబు లోనుగ దలపుటకును 
ప్రజలకున్నది ప్రశాతి నిలయమేగ!
ప్రశాంతినిలయం తెల్లవారుఝామున ఓంకార సుప్రభాతా లతో,నగరసంకీర్తనలతో,ఉదయ,సాయంకాలాల్లో  వేదపఠ నం, భజన తో పవిత్రవాతావరణం నెలకొని మనస్సులను పవిత్రంగా ప్రశాం తంగా ఉంచి శాంతి లోకాకు తీసుకెళు తుంటుంది. అనేకమంది సాయిసేవకులు ఉచిత సేవలను అందిస్తూ మానవసేవ ద్వారా సాయిని మనస్సులో నిల్పు కుంటూ తమ జీవితాలను ధన్యపరచుకుంటున్నారు.   
స్వామివారి 93 వ పుట్టుపండుగ సందర్భంగా ఈ ఆదివారం నుండీ వారంపాటు అనేకానేక కార్యక్రమాలు నెలకొంటు న్నా యి. భజనలు, ప్రముఖుల ఉపన్యాసాలు, మహిళాదినోత్స వం,. విద్యార్ధులచే నాటకాలూ, సంగీ త విభావరులతోపాటుగా  రెండుపూటలాఉచిత భోజనవసతి అందరికీ ఏర్పాటుచేసి సాయి సేవకులు తమ భక్తి ప్రపత్తులను చాటుకుంటు న్నా రు, ప్రశాంతినిలయమంతా చక్కని విద్యూద్దీప కాంతుల తో మెరిసి పోతూ చూసేవారి కళ్ళకు స్వర్గాన్ని తలపిస్తున్నది . 
దేశ విదేశీభక్తులతో ప్రశాంతినిలయం  కనువిందుగా కళకళ లాడుతున్నది      
పిలిచిన పలికెడు దేవుడు
చిలికించును ప్రేమధార శ్రీకృష్ణుండై 
కలిదోష హరము చేయును
మలిజన్మము లేనిమంచి మార్గము చూపున్. 

 

 

 

 

మరిన్ని శీర్షికలు
tamilnadu