Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
sogasuchoodatarama

ఈ సంచికలో >> శీర్షికలు >>

ఈ చలి కాలంలో కాళ్ళ పగుళ్లు వేధిస్తున్నాయా.. - ..

home remedies for feet cracks

చలి కాలంలో చాలా మందిని ఇబ్బంది పెట్టె విషయం కాళ్ళ పగుళ్లు . చలికాలం మొదలవగానే కాళ్ళ పగుళ్లు మొదలవుతాయి. ఆ పగుళ్ల మంట చాలా బాదిస్తుంటుంది. పల్లెల్లో అయితే ఈ సమయంలో వరి నాట్లు మొదలవుతాయి కాబట్టి వారు ఎక్కువగా బురదలో తిరుగుతుంటారు అందుకే వారికి ఎక్కువగా పగుళ్లు వస్తుంటాయి. ఇక పట్టణంలో ఉన్నవారికి చలి కారణంగా కాళ్ళ పగుళ్లు అవుతాయి. ఇలా కాళ్ళ పగుళ్ళతో బాధపడుతున్న వారు చిన్న చిన్న చిట్కాలు పాటించి విముల్తి పొందవచ్చు. అవేంటో కింద చదవండి.

* కాళ్ళ పగుల నుండి విముక్తి కావాలంటే :

* కాళ్ళ పగుళ్లు తగ్గాలంటే కలబంద జెల్ లో కొద్దిగా పసుపుని కలిపి దానిని పగుళ్ళకు రాస్తే వెంటనే పగుళ్ల భాదనుండి విముక్తి లభిస్తుంది.   

* అరకప్పు కొబ్బరి నూనెలో 10 వేపాకులు, చిటికెడు పసుపు, చిటికెడు కర్పూరం కలిపిన మిశ్రమాన్ని పగుళ్ళకు రాస్తే వెంటనే తగ్గిపోతాయి. 

* బొప్పాయి గుజ్జులో కొన్ని చుక్కల నిమ్మరసం కలిపి మెత్తగా చేసి పగిలిన పాదాలకు రాస్తే మురికి పోవడమే కాకుండా పగుళ్లు కూడా తగ్గుతాయి.

* పావు బకెట్ నీళ్లలో చెంచా కొబ్బరి నూనె, చెంచా వంటసోడా, చెంచా విటమిన్ ఈ నూనె వేసి ఒక పావు గంట సమయం కాళ్ళు అందులో పెట్టి ఉంచండి. ఇలా వారానికి ఒక్కసారి చేసిన పాదాలు మృదువుగా అవుతాయి.

* పల్లెటూరిలో ఉండేవారు గోరువెచ్చటి నీటిలో కాళ్ళు నానబెట్టి కొద్దిగా గరుకుగా ఉండే రాయితో రుద్దితే కాళ్ళ పగుళ్లు తగ్గుతాయి.

మరిన్ని శీర్షికలు