ఒకప్పుడు తెలుగులో పేరున్న వార్తా పత్రికల్లో ఉదయం కూడా ఒకటి. అప్పట్లో ఆ పత్రికకు చాలామంది అభిమాన పాఠకులుండేవారు. కాలక్రమంలో ఆ పత్రిక మూతపడిరది. ఆ పత్రిక కోసం పనిచేసిన పాత్రికేయులు ఇప్పుడు వేరే వేరే సంస్థలో ఉన్నప్పటికీ, ఉదయం నాటి రోజుల్ని మర్చిపోలేరు. అలాంటివారు ‘ఉదయం’ పత్రికను స్మరించుకునేందుకు ఓ అవకాశమొచ్చింది. అది ‘కాళీచరణ్ ’ సినిమా రూపంలో.
సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ శిశ్యుడైన శ్రీప్రవీణ్ రూపొందిస్తున్న ‘కాళీచరణ్ ’ సినిమా పోస్టర్స్ ని వెరైటీగా డిజైన్ చేశారు. ఈ పోస్టర్ లో ఉదయం పత్రికను బ్యాక్ గ్రౌండ్ లో పొందుపరిచారు. 1980ల నాటి కథాంశంతో ఈ సినిమాని రూపొందిస్తున్నారట. ‘స్నేహగీతం’ సినిమాలో నటించిన చైతన్య ఈ సినిమాలో హీరో.
డిఫరెంట్ కాన్సెప్ట్ తో సినిమా రూపొందుతుందని, తప్పక విజయం సాధిస్తుందనే ధీమాతో చిత్ర దర్శక నిర్మాతలు ఉన్నారు. మిగతా విషయాలు ఎలా ఉన్నప్పటికీ, సినిమా ప్రమోషన్ లో ఉదయం పత్రిక పేరు వాడుకోవడం, ఉదయం అభిమాన పాఠకులకు
ఆనందంగా ఉంది.
|