సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన ‘సత్య`2’ చుట్టూ వివాదాలు కమ్ముకున్నాయి. ఈ సినిమాపై అక్కసుతో కొందరు, రామ్ గోపాల్ వర్మని బెదిరించేందుకు ప్రయత్నిస్తున్నారు. దాంతో ముంబైలోని వర్మ ఇంటికి పోలీసులు రక్షణ కల్పించారు. సినిమాలో ఏముందో తెలియకుండానే, వర్మకి బెదిరింపులంటే ఆశ్చర్యంగానే వుంది.
అయితే ట్రెయిలర్ చూసిన మాఫియాలోని ఓ వర్గం, తమకు నచ్చని అంశాలున్నాయన్న అక్కసుతో బెదిరింపులకు పాల్పడుతున్నారంట. దీనికి తోడు దుబాయ్ లో సినిమా షో వేశారు ఇప్పటికే. దానికి సంబంధించిన వివరాలు బయటకు వచ్చి, వర్మకి థ్రెట్ ఇంకా పెరిగిందట.
నవంబర్ 8న విడుదలవుతున్న ఈసినిమాకి ఈ బెదిరింపుల ఎపిసోడ్ పబ్లిసిటీ పరంగా బాగా కలిసొస్తోంది. వర్మకి ఇలాంటి బెదిరింపులు కొత్త కాదుగానీ, ‘సత్య`2’ విషయంలో వస్తున్న బెదిరింపుల్లో అర్థం లేదని కొందరు అభిప్రాయపడుతున్నారు. సినిమాలో ఏముందో, బెదిరింపులకు పాల్పడేంతగా వర్మ ఏం చూపించాడో నవంబర్ 8న తెలుస్తుంది.
|