సినిమా పాటల గురించి ప్రస్తావన వస్తే మ్యూజిక్ డైరెక్ట్ గురించి ఎక్కువగా మాట్లాడుకుంటుంటాం. సాహిత్యం గురించి మాట్లాడుకోవడానికి, అది తెలిసినవారు తగ్గిపోతున్నారు మరి. వాయిద్యాల హోరులో లిరిక్స్ కి విలువ లేకుండా పోతోందని బాధపడే పాటల రచయితలు చాలామందే ఉన్నారు.
అలాంటివారిని సంతోషపరిచే మాట ఒకటి అన్నాడు సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్. పాటకి లిరిసిస్ట్ హీరో అని దేవిశ్రీప్రసాద్ ‘భాయ్’ పాటల పండుగ అనగా ఆడియో విడుదల వేడుకలో అభిప్రాయపడ్డాడు. ఎంతమంది సంగీత దర్శకులు, పాటల రచయితల్ని గౌరవిస్తున్నారు? అని ఆవేదన చెందేవారికి ఇదో తియ్యని మాట.
దేవిశ్రీప్రసాద్ కూడా ఈ మధ్య పాటలు రాస్తున్నాడు గనుక, పాటలు రాయడంలో కష్టం తెలిసి, లిరిసిస్ట్ ని హీరోగా భావించాడని అర్థం చేసుకోవచ్చు. దేవిశ్రీప్రసాద్ మాటలు విని, పాటల రచయితలంతా ఆయన్ను మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నారు.
|