హిట్టు కొట్టిన హీరోయిన్ ని తమ సినిమాలో పెట్టుకుంటే, అదనపు ఆకర్షణ అవుతుందనీ, సెంటిమెంట్ వర్కవుట్ అవుతుందనీ భావిస్తుంటారు. కాంబినేషన్లు అలాగే వర్కవుట్ అవుతుంటాయి. దర్శకుడు, నిర్మాత, హీరో.. ఇలా హీరోయిన్ల ఎంపిక విషయంలో ఎవరి సెంటిమెంట్లు వారివి.
ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కుతున్న ‘రభస’ (టైటిల్ మారుతుందని కూడా అంటున్నారు) సినిమాలో సమంత, ప్రణీత హీరోయిన్లుగా బుక్కయ్యారు. వీరిద్దరూ ఇటీవలే వచ్చిన సూపర్ హిట్ సినిమా ‘అత్తారింటికి దారేది’లో నటించారు. ఆ సినిమా పెద్ద విజయాన్ని అందుకోవడంతో ‘రభస’కి సెంటిమెంట్ ప్రకారంగా కలిసొస్తుందని దర్శక నిర్మాతలూ అనుకుంటున్నారట.
సమంత ఇదివరకు ఎన్టీఆర్ తో ‘బృందావనం’, ‘రామయ్యా వస్తావయ్యా’ సినిమాల్లో నటించింది. వీటిల్లో ‘బృందావనం’ హిట్ . ‘రామయ్యా వస్తావయ్యా’ నిరాశపర్చింది. ప్రణీతకి ‘అత్తారింటికి దారేది’ సినిమాతో క్రేజ్ పెరిగింది. ఆమెకు ‘రభస’లో అవకాశం గోల్డెన్ ఛాన్స్ అనే అనుకోవాలి.
|