సినిమా టైటిల్స్ వెనుక కథ విచిత్రంగానే వుంటుంది. కొన్ని అనుకోకుండా పేలతాయి, ఇంకొన్ని ప్లాన్ చేసుకున్నా తుస్సుమంటాయి. చివరి నిమిషంలో టైటిల్స్ మారిన సందర్భాలూ చాలానే చెప్పుకోవచ్చు. మీడియాలో వచ్చిన గాసిప్స్ నిజమైన సందర్భాలకైతే లెక్కే ఉండదు.
మంచు విష్ణు హీరోగా వచ్చిన ‘దూసుకెళ్తా’ టైటిల్ వెనుకా పెద్ద కథే ఉంది. టైటిల్ సాంగ్ రాయమని పాటల రచయిత రామజోగయ్యని చిత్ర దర్శక నిర్మాతలు అడగ్గా, టైటిల్ ఏంటి? అన్న ప్రశ్న ఆయన మదిలో మెదిలింది. ‘దూసుకెళ్తా..’ అనే టైటిల్ ని ఊహించుకుని పాట రాస్తే, అదే టైటిల్ అయిపోయింది.
ఈ సినిమా చెప్పుకోదగ్గ విజయాన్నే సొంతం చేసుకుందనే సంతోషం వ్యక్తం చేస్తున్నాడు హీరో విష్ణు. తన కెరీర్ లోనే వసూళ్ళ పరంగా బిగ్గెస్ట్ హిట్ అని విష్ణు ఇప్పటికే చెప్పాడు కూడా. పాటల రచయిత పెట్టిన టైటిల్ తో సినిమా హిట్టయ్యిందంటే ఆ క్రెడిట్ లో కొంత భాగం పాటల రచయితకీ దక్కుతుంది కదా.
|