పవన్ కళ్యాణ్ .. ఈ పేరు చెబితే అతని అభిమానులు పవనిజంతో ఊగిపోతారు. పవన్ వ్యక్తిత్వమే ఆయనకంటూ ప్రత్యేకమైన అభిమానుల్ని సంపాదించిపెట్టింది. పవన్ కళ్యాణ్ అందరిలా ఎప్పుడంటే అప్పుడు మీడియా ముందుకు రారు. ఎవరేమనుకున్నా లెక్క చేయరు. స్పందించాలని ఆయన తనంతట తానుగా అనుకున్నప్పుడే స్పందిస్తారు. ఎవర్నయినా ఆయన కలవాలన్నా అంతే, ఆయన్ను ఎవరైనా కలవాలన్నా అంతే.
పవన్ వ్యక్తిత్వాన్ని మెచ్చి, ఆయన్ను కలవాలనుకున్నవారికి అంత ఈజీగా ఆయన అపాయింట్ మెంట్ దొరకదు. అసలు పవన్ మేనేజర్ ఎవరు? అని వాకబు చేయడమే కష్టం. పవన్ తో సినిమాలు చేసిన నిర్మాతలు, దర్శకుల వద్దకు వెళితే కొంతవరకు పని జరుగుతుంది. సినిమాల కోసం అయినా, సేవా కార్యక్రమాల నిమిత్తం అయినా పవన్ ని కలవడం చాలా కష్టంగా వుంటోంది చాలామందికి.
సినిమా పరిశ్రమలో పవన్ చాలా తక్కువమందితో అత్యంత సన్నిహితంగా వుంటారు గనుక, వారిని పట్టుకుని పవన్ వద్దకు వెళ్ళాలని ప్రయత్నిస్తుంటారు. అలా ప్రయత్నించేవారిలోనూ చాలా తక్కువమందికే ఆయన దర్శనం దొరుకుతుంది. సినిమా చేయడం, ఆ తర్వాత తనకిష్టమైన రీతిలో వ్యక్తిగత జీవితాన్ని ఎంజాయ్ చేయడం పవన్ కి అలవాటు. మామూలు వ్యవసాయదారుడిలా పవన్ సినిమా పూర్తయ్యాక మారిపోతారని పవన్ కి అత్యంత సన్నిహితుడైన త్రివిక్రమ్ అంటారు. అది నిజం కూడా.
|