మేష రాశి : (అశ్వని 4 పాదాలు ,భరణి 4 పాదాలు,కృత్తిక 1 వ పాదం )
వారం ఆరంభంలో నూతన ఆలోచనలు చేయుటకు అవకాశం ఉంది. కొంతమేర పనిఒత్తిడి పెరుగుటకు అవకాశం ఉంది. వ్యాపారపరమైన విషయాల్లో మిశ్రమ ఫలితాలు పొందుతారు. ముఖ్యమైన నిర్ణయాల్లో అనుభవజ్ఞుల సూచనల మేర ముందుకు వెళ్ళండి. విదేశీ ప్రయాణ ప్రయత్నాలు చేయువారికి అనుకూలమైన సమయం. బంధువులతో కలిసి విందులు అలాగే వినోదాల్లో పాల్గొంటారు. గతంలో మీకు రావల్సిన ధనం సమయానికి చేతికి అందుతుంది. ఎవరికన్నా మాట ఇచ్చే విషయంలో కాస్త జాగ్రత్త అవసరం.
వృషభ రాశి : (కృత్తిక 2,3, 4 పాదాలు ,రోహిణి 4 పాదాలు,మృగశిర 1, 2 పాదాలు)
వారం తీసుకొనే నిర్ణయాల విషయంలో స్పష్టత అవసరం. పెద్దలతో మీకున్న పరిచయం బలపడుతుంది. ఆరోగ్యం విషయంలో అలాగే భోజనం విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధను కలిగి ఉండుట సూచన. సంతానం విషయంలో నిర్ణయాలు తీసుకుంటారు. విదేశాల్లో ఉన్న మిత్రులతో మీ ఆలోచనలు పంచుకుంటారు. చిన్న చిన్న విషయాలలో ప్రత్యకమైన శ్రద్ధను కలిగి ఉంటారు అధికారుల నుండి ఆశించిన మేర సహకారం లభిస్తుంది. ముఖ్యమైన పనులకు శ్రీకారం చుడుతారు. ఆగిన పనులు ముందుకు సాగుతాయి.
మిథున రాశి : (మృగశిర 3,4 పాదాలు ,ఆరుద్ర 4 పాదాలు, పునర్వసు 1,2,3 పాదాలు)
వారం ప్రయాణాలు చేయుటకు అవకాశం ఉంది. తలపెట్టిన పనులను అనుకున్న సమయానికి పూర్తిచేస్తారు. వ్యాపారపరమైన విషయాల్లో బాగానే ఉంటుంది. నూతన వస్తువులను కొనుగోలు చేయుటకు ఆస్కారం ఉంది. విదేశాల్లో ఉన్న బంధువుల నుండి ముఖ్యమైన సమాచారం పొందుతారు. సోదరుల నుండి ఆశించిన మేర సహకారం లభ్సితుంది. విలువైన వస్తువులను కొనుగోలు చేస్తారు. గతంలో మీకు రావల్సిన ధనం కాస్త ఆలస్యంగా చేతికి అందుటకు అవకాశం ఉంది. విద్యార్థులకు యోగ కాలం.
కర్కాటక రాశి : (పునర్వసు 4 వ పాదం ,పుష్యమి 4 పాదాలు,ఆశ్లేష 4 పాదాలు)
వారం పెద్దలతో పరిచయాలకు అవకాశం ఉంది, మీ ఆలోచనలు వారితో పంచుకుంటారు. ఉద్యోగంలో ఆశించిన మేర సహకారం లభిస్తుంది, ప్రమోషన్ లేదా మంచి గుర్తింపు లభిస్తుంది. అనుకోని ఖర్చులకు అవకాశం ఉంది. ప్రయాణాలు వాయిదా పడే ఆస్కారం ఉంది. ఆరోగ్యం విషయంలో ఏమాత్రం అశ్రద్ధ పనికిరాదు. గతంలో మీకున్న పరిచయాలు ఉపయోగపడుతాయి. విలువైన వస్తువులను కొనుగోలు చేయుటకు ఆస్కారం ఉంది. మీ మాటతీరును కొంతమంది వ్యతిరేకించే అవకాశం ఉంది. సర్దుబాటు విధానం మంచిది.
సింహ రాశి : (మఖ 4 పాదాలు ,పుబ్బ (పూర్వఫల్గుణి) 4 పాదాలు, ఉత్తర 1 వ పాదం )
వారం ఉద్యోగంలో చేపట్టు పనుల విషయంలో స్పష్టత కలిగి ఉండుట సూచన. అనుకున్న సమయానికి పనులను పూర్తిచేసే అవకాశం ఉంది. వ్యాపారపరమైన విషయాల్లో మిశ్రమ ఫలితాలు లభిస్తాయి. చిన్న చిన్న విషయాలకే ఆందోళన చెందుటకు అవకాశం ఉంది. ఉన్నత విద్య ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఆరోగ్యం కుదుట పడుతుంది. మిత్రులనుండి వచ్చే సమాచారం మీకు సంతోషాన్ని కలిగిస్తుంది. బంధువులతో కలిసి శుభకార్యక్రమాల విషయంలో ఒక నిర్ణయం తీసుకుంటారు. చర్చాపరమైన విషయాల్లో పాల్గొంటారు.
కన్యా రాశి : (ఉత్తర 2,3, 4 పాదాలు ,హస్త 4 పాదాలు,చిత్త 1, 2 పాదాలు )
వారం ముఖ్యమైన విషయాలకు ప్రాధాన్యత ఇవ్వడం మంచిది. నూతన పరిచయాలకు అవకాశం ఉంది. పెద్దలతో మీకున్న పరిచయం బలపడుతుంది. వ్యాపార పరమైన విషయాల్లో మిశ్రమ ఫలితాలు పొందుతారు. సంతానం గురుంచి ఆందోళన పెరుగుటకు ఆస్కారం ఉంది. ముఖ్యమైన విషయాల్లో తడబాటు లేకుండా చేసుకోండి. నూతన ఉద్యోగప్రయత్నాలు ముందుకు సాగుతాయి. మీ మొండితనం కొన్ని కొన్ని విషయాల్లో రక్షగా ఉంటుంది. ఎవ్వరితోను వివాదాలకు ఆవకాశం ఇవ్వకండి. వేచిచూసే ధోరణి మేలు.
తులా రాశి : (చిత్త 3,4 పాదాలు ,స్వాతి 4 పాదాలు, విశాఖ 1,2,3 పాదాలు )
వారం ఆత్మీయులను కలుసుకునే ప్రయత్నంచేస్తారు. గతంలో చేపట్టిన పనులను పూర్తిచేయుటకు ప్రాధాన్యం ఇస్తారు. బంధువుల నుండి కొన్ని కీలకమైన విషయాలు తెలుస్తాయి. ప్రయాణాలు చేయునపుడు తగిన జాగ్రత్తలు తీసుకోండి. అధికారుల నుండి ఆశించిన మేర సహకారం లభిస్తుంది. వ్యాపార పరమైన విషయాల్లో మాత్రం తొందరపాటు నిర్ణయాలు పనికిరావు. కుటుంబంలో బాధ్యతలు పెరుగుటుకు ఆస్కారం కలదు. విలువైన వస్తువులను కొనుగోలు చేయుటకు ఆస్కారం ఉంది. చర్చల్లో నిదానం అవసరం.
.
వృశ్చిక రాశి : (విశాఖ 4 వ పాదం ,అనురాధ 4 పాదాలు,జ్యేష్ఠ 4 పాదాలు )
వారం మీరు అనుకోకుండా తీసుకొనే నిర్ణయాలు అనుకూలమైన ఫలితాలు ఇస్తాయి. చిన్ననాటి మిత్రులను కలుస్తారు, వారినుండి ముఖ్యమైన సమాచారం పొందుతారు. ప్రయాణాలు చేయునపుడు తగిన జాగ్రత్తలు తీసుకోండి. పెద్దలతో విభేదాలు రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోండి. విలువైన వస్తువులను కొనుగోలు చేసే ప్రయత్నం వాయిదా వేయుట మంచిది. వ్యాపారపరమైన విషయాల్లో మిశ్రమ ఫలితాలు పొందుతారు. ఉద్యోగంలో బాగానే ఉంటుంది, నలుగురితో కలిసి మీ పనులను పూర్తిచేసే అవకాశం ఉంది.
ధనస్సు రాశి : (మూల 4 పాదాలు ,పూర్వాషాఢ 4 పాదాలు,ఉత్తరాషాఢ 1 వ పాదం )
వారం పెద్దలనుండి వచ్చిన సూచనలను పరిగణలోకి తీసుకోండి. తొందరపాటు లేకుండా నిదానంగా ముందుకు వెళ్ళుట సూచన. రావాల్సిన ధనం విషయంలో ఒక స్పష్టత వస్తుంది. ప్రయాణాలు చేయునపుడు చిన్న చిన్న ఇబ్బందులు తప్పక పోవచ్చును. నూతన పరిచయాలు ఏర్పడుతాయి, వారితో మీ ఆలోచనలు పంచుకుంటారు. బంధువులను కలుస్తారు. ఆరోగ్యం విషయంలో ఏమాత్రం అశ్రద్ధ పనికిరాదు. ఆత్మీయుల నుండి వచ్చిన సూచనలు పరిగణలోకి తీసుకోవడం మంచిది.
మకర రాశి : (ఉత్తరాషాఢ 2,3, 4 పాదాలు ,శ్రవణం 4 పాదాలు,ధనిష్ఠ 1, 2 పాదాలు )
వారం బంధువులను కలుస్తారు, వారితో కలిసి సమయాన్ని సరదాగా గడుపుతారు. గతంలో మీకు బంధువులతో ఉన్న విభేదాలు తగ్గుటకు అవకాశం ఉంది. ముఖ్యమైన విషయాల్లో కాస్త సర్దుబాటు విధానం కలిగి ఉండుట సూచన. చిన్న చిన్న విషయాలను సైతం పరిగణలోకి తీసుకోండి. వ్యాపార పరమైన విషయాల్లో నూతన భాగస్వామ్య ఒప్పందాలకు అవకాశం ఉంది. స్త్రీ పరమైన విషయాల వలన ఇబ్బందులు ఎదుర్కొంటారు. విదేశీప్రయాణ ప్రయత్నాలు చేయువారికి కొద్దిగా ఇబ్బందులు తప్పక పోవచ్చును.
కుంభ రాశి : (ధనిష్ఠ 3,4 పాదాలు ,శతభిషం 4 పాదాలు, పూర్వాభాద్ర 1,2,3 పాదాలు )
వారం కుటుంబంలో కీలకమైన ఆలోచనలు చేస్తారు, మీ నిర్ణయాల విషయంలో కఠినంగా వ్యవహరిస్తారు. ప్రయాణాలు అనుకోకుండా వాయిదా పడుతాయి. వ్యాపార పరమైన విషయాల్లో మిశ్రమ ఫలితాలు పొందుతారు. బంధువుల నుండి వచ్చిన సూచనలను పాటించే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచన చేసి ముందుకు వెళ్ళండి. రావాల్సిన ధనం దఫాలుగా చేతికి అందుతుంది. ఖర్చులను తగ్గించుకొనే ప్రయత్నం చేయుట మంచిది. విలువైన వస్తువులను కొనుగోలు చేయాలనే ఆలోచన వాయిదా వేయండి.
మీన రాశి : (పూర్వాభాద్ర 4 వ పాదం ,ఉత్తరాభాద్ర 4 పాదాలు,రేవతి 4 పాదాలు )
వారం సంతానం విషయంలో నూతన ఆలోచనలు కలిగి ఉంటారు. కుటుంబపరమైన విషయాలకు సమయం ఇస్తారు. తలపెట్టిన పనులను కాస్త ఆలస్యంగా నైనా పూర్తిచేసే అవకాశం ఉంది. నూతన ఆలోచనలు కలిగి ఉంటారు. ఆరోగ్యం బాగాఉంటుంది. నూతన ఒప్పందాల కోసం చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి. మీ ఆత్మీయులను కలుస్తారు. వారితో మీ ఆలోచనలు పంచుకుంటారు. విదేశాల్లో ఉన్నవారు స్వదేశానికి తిరిగి వస్తారు. నూతన ఉద్యోగ ప్రయత్నాలు ముందుకు సాగుతాయి. కొంత ఇబ్బందులు తగ్గుతాయి.
డా. టి. శ్రీకాంత్
వాగ్దేవి జ్యోతిషాలయం
|