కావలిసిన పదార్ధాలు: దొండకాయలు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, నూనె, కారం, ఉప్పు, అల్లంవెల్లుల్లి ముద్ద, పసుపు, చింతపండు రసం ( చిక్కగా ), మసాలా పొడి
తయారుచేసే విధానం: ముందుగా బాణలిలో నూనె పోసి అది కాగాకా ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి ముద్ద వేసి బాగా వేగనివ్వాలి తరువాత సన్నగా తరిగిన దొండకాయలను వేసి బాగా కలిపి 2 నిముషాలు మూతపెట్టాలి. తరువాత పసుపు , కారం,ఉప్పు వేసి కలిపి చిక్కటి చింతపండు రసాన్ని పోసి 10 నిముషాలు మూతవుంచాలి. చివరగా మసాలాపొడిని వేసి కలపాలి. అంతేనండీ....! వేడి వేడి దొండకాయ మసాలా కూర రెడీ...
|