హీరోయిన్ అమలాపాల్, తమిళ దర్శకుడు విజయ్ పెళ్ళి చేసుకున్నారు. కొన్నాళ్ళ నుంచి వీరి ప్రేమ ప్రయాణం కొనసాగుతోంది. ‘పెళ్ళి చేసుకుందాం’ అనే నిర్ణయానికి రాగానే ఇరువురూ తమ తల్లిదండ్రుల్ని ఒప్పించారు. విజయ్ తమిళనాడుకు చెందిన హిందూ వ్యక్తి. సంప్రదాయ హిందూ కుటుంబంలో పుట్టిన విజయ్, ఆ సంప్రదాయం ప్రకారమే అమలాపాల్‌ని పెళ్లాడాలనుకున్నాడు. కానీ, అమలాపాల్ క్రిస్టియన్. దాంతో వీరి వివాహం ఎలా జరుగుతుందోనని అంతా ఆశ్చర్యంగా ఎదురుచూశారు.
సస్పెన్స్ లేదు. ఎంగేజ్‌మెంట్ క్రిస్టియన్ సంప్రదాయంలో చేసుకుందాం, పెళ్ళి హిందూ సంప్రదాయం ప్రకారం చేసుకుందాం అని విజయ్, అమలాపాల్ ఓ అవగాహనకు వచ్చారు. తమ ఉద్దేశ్యాన్ని పెద్దలకు వివరించారు. పెద్ద మనసుతో పెద్దలు అమల ` విజయ్‌ల పెళ్ళికి అంగీకరించారు. అలా ఇద్దరూ ఆదర్శ వివాహంతో ఒక్కటయ్యారు.
‘నాన్న’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది అమలాపాల్. తమిళ సినిమాకి తెలుగు రీమేక్ అయినా, ఆ సినిమాలో అమలాపాల్‌ని చూసినవారెవరూ ఆమెను అంత తేలిగ్గా మర్చిపోలేరు. ఆ తర్వాత ‘బెజవాడ’, ‘నాయక్’ సినిమాల్లో నటించింది అమలాపాల్. ఈ రెండూ స్ట్రెయిట్ తెలుగు సినిమాలు. ‘నాయక్’ పెద్ద హిట్ కాగా, అల్లు అర్జున్‌తో నటించిన ‘ఇద్దరమ్మాయిలతో’ సినిమా ఆశించిన విజయం ఇవ్వలేదు అమలాపాల్‌కి.
పెళ్ళి కారణంగా సినిమాల్ని వదిలేసుకోవాల్సి వచ్చినా, ‘సరైన సమయంలో పెళ్ళి చేసుకున్న’ందుకు హ్యాపీగా వుందంటోంది అమలాపాల్.
|