అడల్ట్ సినిమాలు మానేసి, హిందీ సినిమాల్ని నమ్ముకున్న ఒకప్పటి నీలి చిత్రాల తార సన్నీలియోన్, ఆర్థికంగా పటిష్టస్థాయికి చేరుకుందని అంటున్నారు బాలీవుడ్ సినీ వర్గాలవారు. ఒక్కో సినిమాకీ ఆమె రెమ్యునరేషన్ అలా అలా పెరిగిపోవడమే దానికి కారణమట. ఏ సినిమా చేసినా, ఆ సినిమాలో సన్నీలియోన్ అందాలే ప్రధాన ఆకర్షణ కావడంతో, తక్కువ ఖర్చుతో సినిమా నిర్మించి, నిర్మాత కాసుల పంట పండిరచుకుంటున్నాడు. ఇక్కడ ఆశ్చర్యమేమంటే సినిమకయ్యే ఖర్చుకన్నా సన్నీలియోన్‌కి ఇచ్చుకునే రెమ్యునరేషనే ఎక్కువవుతుందట.
హీరోయిన్‌గా చేస్తున్న సినిమాలకన్నా, ఆమె ఐటమ్ సాంగ్స్‌పై ప్రత్యేకంగా దృష్టి మరల్చింది. అలా ఒక్కో పాటకీ కోటి రూపాయలకు పైనే సన్నీలియోన్ డిమాండ్ చేస్తున్నా, ఆమెకు అవకాశాలైతే తగ్గట్లేదు. ‘హేట్ స్టోరీ`2’ సినిమా కోసం కోటిన్నర వరకూ ఇచ్చారట. ‘కోటిన్నర అయినా తక్కువే.. ఆమె వల్ల సినిమాకి వచ్చే ఆదాయం అంతలా వుంటుంది’ అని బాలీవుడ్ మీడియా కోడై కూస్తోంది.
ఎంత రెమ్యునరేషన్ ఇస్తే బావుంటుందో నిర్మాత నిర్ణయిస్తారు, చెయ్యాలో వద్దో నేను నిర్ణయం తీసుకుంటాను. ఇక్కడ డబ్బుకు ప్రాధాన్యత లేదననుగానీ, అదే ముఖ్యమైనది కాదని చెప్పింది సన్నీలియోన్. సినిమాకి లాభాలు వస్తున్నప్పుడు నేను ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకున్నా తప్పు కాదని నిర్మొహమాటంగా సన్నీలియోన్ తన అభిప్రాయం వెల్లడిరచింది.
|