తుమ్మినా, దగ్గినా దాన్ని సోషల్ నెట్‌వర్క్‌కి ఎక్కించేస్తోన్న రోజులివి. ఆ సోషల్ నెట్ వర్క్ మీద ఓ పాటొచ్చేసింది. ‘సోషల్ నెట్ వర్క్ అండీ బాబూ...’ అని సాగే ఈ పాట ‘లేడీస్ అండ్ జెంటిల్‌మెన్’ సినిమా కోసం రూపొందించారు. కుంచె రఘు సంగీతం అందించిన ఈ పాటకు గేయ రచయిత సిరాశ్రీ అందమైన పదాల్ని అందించారు. ‘గో తెలుగు డాట్ కామ్’ సమర్పణలో ఈ సినిమా నిర్మితమవుతుంది. తొలి పాట సినిమాపై క్రేజ్‌ని పెంచిందని పలువురు సినీ ప్రముఖులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ఇంటర్నెట్‌లో ఈ పాటను పెట్టగా, ఇరవై నాలుగ్గంటలు దాటకుండానే 50 వేల పై చిలుకు వ్యూస్ రావడం గొప్ప విషయం. ప్రముఖులు కూడా ఈ పాట గురించి గొప్పగా కామెంట్స్ పోస్ట్ చేస్తున్నారు. కదులుతున్న రైలులో ఈ పాటని షూట్ చేశారు. పి.బి. మంజునాథ్ చిత్ర దర్శకుడు. ‘స్నేహగీతం’ ఫేం దర్శకుడు మధుర శ్రీధర్ ఈ చిత్రానికి నిర్మాత.
పాట అద్భుతంగా వుందని తెలిసినా ఈ స్థాయి రెస్పాన్స్ ఊహించలేదని చిత్ర యూనిట్ సంతోషం వ్యక్తం చేస్తోంది. చైతన్య కృష్ణ, మహత్ రాఘవేంద్ర, అడివి శేష్, కమల్ కామరాజు, నికితా నారాయణ్, స్వాతి దీక్షిత్, జాస్మిన్ బాసిన్ ఈ చిత్రంలో ఇతర ప్రధాన తారాగణం.
|