స్వర్గీయ ఇ.వి.వి. సత్య నారాయణ 58వ జయంతి సందర్భంగా ఆయన పేరు మీద ' .ఇ.వి.వి.చారిటబుల్ ట్రస్ట్ ' ను ప్రారంభించారు ఆయన కుమారులు ఆర్యన్ రాజేష్, అల్లరి నరేష్.
జూన్ 10న ప్రారంభమైన అల్లరి నరేష్ తాజా చిత్రం ' బందిపోటు ' ప్రారంభోత్సవ వేడుకలో ఈ విషయాన్ని వెల్లడించారు. అనాధలను, శరణార్థులను ఆదుకోవడమే ముఖ్య లక్ష్యంగా ఇ.వి.వి.చారిటబుల్ ట్రస్ట్ పని చేస్తుందని వారు తెలిపారు. ఈ సందర్భంగా ఆర్యన్ రాజేష్ 'నాన్నగారు ఉన్నప్పుడు ఎవరు సాయం కోరి వచ్చినా తనకు కుదిరినంతలో తప్పకుండా సాయపడేవారు.ఆయన లేకపోయినప్పటికీ.. ఆయన సిద్ధాంతాలను కాపాడే విధంగా ఇ.వి.వి.చారిటబుల్ ట్రస్ట్ నిరాటంకంగా పని చేసేందుకు అవసరమైన నిధులని సమకూర్చుతున్నాం. ' అన్నారు.
|