Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
love u jaggu

ఈ సంచికలో >> సినిమా >>

ప్రొడ్యూసర్‌ ఫ్రెండ్లీ మెగా హీరో

producer friendly with mega hero

మెగా ఫ్యామిలీకి సినీ పరిశ్రమలో ఓ ప్రత్యేకమైన గౌరవం వుంది. సినిమా నిర్మాణంలో నిర్మాతలను ఇబ్బంది పెట్టరనే పేరు వారికి వుంది. దానికి తగ్గట్టుగానే చిరంజీవి హీరోగా సినిమాల్లో నటించినన్నాళ్ళూ వ్యవహరించారు. పవన్‌కళ్యాణ్‌ కూడా అంతే. ఆ కోవలో రామ్‌చరణ్‌ కూడా ప్రొడ్యూసర్స్‌ ఫ్రెండ్లీ అనిపించుకున్నాడు.

రామ్‌చరణ్‌ నటిస్తున్న ‘గోవిందుడు అందరివాడు’ సినిమా కొన్ని కారణాల వల్ల షూటింగ్‌ గ్యాప్‌ వచ్చింది. తద్వారా నిర్మాతకు ఆర్థికంగా టెన్షన్‌ ఎదురైంది. తన అనారోగ్యం కారణంగా సినిమా ఆలస్యమవడంతో, నష్టాన్ని పూడ్చేందుకు తన రెమ్యునరేషన్‌లో కొంత కోత విధించుకోవాలని చరణ్‌ నిర్ణయించుకున్నాడట. చరణ్‌ నిర్ణయం పట్ల సంతోషం వ్యక్తం చేసినా, రెమ్యునరేషన్‌ కోతకి సిద్ధపడలేదట నిర్మాత బండ్ల గణేష్‌.

బాస్‌ (పవన్‌కళ్యాణ్‌), బిగ్‌ బాస్‌ (చిరంజీవి), స్మాల్‌ బాస్‌ (రామ్‌చరణ్‌).. అని మెగా హీరోల్ని సంబోదించే గణేష్‌, చరణ్‌ రెమ్యునరేషన్‌ని తగ్గించుకుంటానంటే ఎందుకు ఒప్పుకుంటాడు? ఈ ఎపిసోడ్‌లో ప్రొడ్యూసర్‌ ఫ్రెండ్లీ అన్న గుర్తింపు రామ్‌చరణ్‌కి దక్కిందంతే. కృష్ణవంశీ దర్శకత్వంలో ‘గోవిందుడు అందరివాడు’ చిత్రం రూపొందుతున్నది.

మరిన్ని సినిమా కబుర్లు
ramcharan T-shirt  with raakee savanth