షిరిడి సాయి క్రియేషన్స్ బ్యానర్ పై మాస్టర్ సాయి చరణ్, సాయి త్రిశాంక్ నిర్మాణ సారధ్యం లో తెరకెక్కుతున్న చిత్రం ' తెలంగాణ విజయం ' బిపిన్ దర్శక నిర్మాత. శ్రీ హర్ష, సాయిత్రిశాంక్, క్రాంతిలతోపాటు బాబూ మోహన్, ప్రొఫెసర్ కోదండరాం, ప్రముఖ న్యాయవాది టి. రంగారావు కీలక పాత్రలు పోషిస్తున్నారు. పిన్నింటి జానకీ రావు, ప్రీతి నిగంలపై కీలక పాటను సారధి స్టుడియోలో చిత్రీకరిస్తున్నారు. ఈ సంధర్బంగా దర్షక నిర్మాత బిపిన్ మాట్లాడుతూ...
60 ఏళ్ళ తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేరింది. ఇది తెలంగాణ ప్రజల విజయం. వెయ్యి మంది విధ్యార్ధులు ఆత్మబలిదానాల త్యాగమే ఈ తెలంగాణ. ఇక పది జిల్లాలతో కూడిన తెలంగాణ, హైదరాబాద్పదేళ్ళపాటు ఉమ్మడి రాజధాని, దేశంలో 29వ రాష్ట్రం, తెలంగాణ అమరవీరుల తల్లిదండ్రులకు నెలకు పదివేలు ఫించను, అయిదెకరాల భూమి, వారి కుటుంబంలో ఒక్కరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలి అన్న ప్రధానాంశాలతో ఈ చిత్రం తెరకెక్కింది. ప్రస్తుతం ' చుక్కలాంటి చుక్కలో..లక్షలాంటి చుక్కల్లో...' అనే పాటను ప్రీతి నిగం. పిన్నింటి జానకి రామారావులపై చిత్రీకరిస్తున్నాం. మరో ప్రక్క నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. త్వరలో పాటల్ని విడుదల చేసి,జూలై రెండో వారంలో సినిమాను ప్రేక్షకుల ముందుకి తీసుకొస్తాం. అని తెలిపారు.
సాయి చరణ్, సాయి త్రిశాంక్, బాబుమోహన్, గౌతమ్రాజు, నర్శిమ్ హరాజు, బిపిన్, వహీద, కల్పన, రోజా, వినోద్, అశోక్ కుమార్, గుండు హనుమంత రావు, తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సమర్పణ : శ్రీమతి రమ్య, సహ నిర్మాత : బిల్లా ప్రభాకర రావు. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : పిన్నింటి జానకి రామారావు, ఎడిటర్ : వి.నాగిరెడ్డి,డి ఓ పి : మధు, ఏ నాయుడు, కథ-మాటలు-పాటలుసంగీతందర్శకత్వం : బిపిన్.
|