‘నాయక్’ సినిమాలో ‘లైలా ఓ లైలా..’ పాటలో రామ్‌చరణ్ ధరించిన టీషర్ట్ గుర్తుంది కదా. ఆ వైట్ టీషర్ట్ మీద ‘ఆర్’ అనే లెటర్ వుంటుంది. ‘ఆర్’ అంటే రామ్ చరణ్.. అంటూ అభిమానులు ఆ తరహా టీ షర్ట్స్‌లో బాగా కన్పించారు ‘నాయక్’ సినిమా టైమ్‌లో. ఇటీవలే బాలీవుడ్ సెక్సీ తార రాఖీసావంత్ కూడా అలాంటి టీషర్ట్‌తోనే కన్పించింది. ఇక్కడ ఆర్ అంటే రాఖీ సావంత్ అన్నమాట.
రాజకీయాల్లోకి వెళ్ళి ఓటమి చవిచూసిన రాఖీసావంత్, మళ్ళీ తెరపై అవకాశాల కోసం ప్రయత్నిస్తోంది. ఇదివరకటిలా వివాదాలతో పబ్లిసిటీ పొందడం, తద్వారా అవకాశాలు దక్కించుకోవడం కాకుండా, ‘మారిన మనిషి’ అన్పించుకుని అవకాశాలు పొందాలని అనుకుంటోందట రాఖీసావంత్. మంచి ఆలోచనే ఇది.
సినిమాలు సరే, రాజకీయాలు వదిలేసినట్టేనా? అనడిగితే, సమయమొచ్చినప్పుడు రాజకీయాల్లోకి మళ్ళీ వెళతా.. అని చెప్పింది రాఖీసావంత్. నేనేం మాట్లాడినా దాన్ని వివాదం చేస్తారే తప్ప, వివాదం కోసం నేనేమీ మాట్లాడను అని చెప్పే రాఖీసావంత్, తెలుగు సినిమాల్లో కూడా ఐటమ్ సాంగ్స్ చేసింది. ఇప్పుడు ఐటమ్ సాంగ్స్ చేయడానికి బహుశా ఆమె వయసు ఇబ్బందికరంగా మారుతుందేమో అన్న భావన ఒకటుంది.
|