మోక్షప్రదాయని చిదంబరం. - డా.బెల్లంకొండ నాగేశ్వరరావు.

మోక్షప్రదాయని చిదంబరం.

చిదంబరం(మన ఆలయాలు.1.)
చిదంబరం దేవాలయం పరమశివుడికి అంకితమైన హిందూ దేవాలయం. భారతదేశంలోని దక్షిణ రాష్ట్రమైన తమిళనాడు యొక్క మధ్యస్థ తూర్పు భాగంలోని, కడలూర్ జిల్లాలోని కారైకల్ ‌కి ఉత్తరంగా 60 కిలో మీటర్ల దూరంలో,, పాండిచ్చేరికి దక్షిణంగా 78 కిలో మీటర్ల దూరంలో ఉన్న ఆలయనగరమైన చిదంబరం నడిబొడ్డున ఈ ఆలయం నెలకొని ఉంది. తమిళ సంగం సాహిత్య రచనల ప్రకారం, సనాతన విశ్వకర్మ ల యొక్క వంశస్థుడైన విదువేల్విడుగు పెరుమ్తకన్, ఈ ఆలయం యొక్క పునః సృష్టికి ప్రధాన రూపశిల్పి. ప్రాచీన, పూర్వమధ్యస్థ కాలంలో, ప్రత్యేకించి పల్లవ, చోళ రాజుల కాలంలో, ఈ ఆలయంలో పలు నూతన రూపకల్పనలు జరిగాయి.

హిందూమత సాహిత్యం ప్రకారం, చిదంబరం అనేది శివుని యొక్క ఐదు పవిత్రమైన ఆలయాల్లో ఒకటి. పంచ భూతాలకి ఒక్కొక్క ఆలయం నిర్మించబడంది. చిదంబరం ఆకాశతత్త్వానికీ, తిరువనైకవల్ జంబుకేశ్వర జలతత్త్వానికీ, కంచి ఏకాంబరేశ్వరభూమితత్త్వానికీ,
తిరువణ్ణామలై అరుణాచలేశ్వర అగ్నితత్త్వానికీ, కాళహస్తీశ్వర స్వామి వాయుతత్త్వానికీ నిదర్శనాలు.
చిత్ =మనసు,అంబరం = అకాశం .మనసు ఆకాశంలా నిర్మలంగా ఉండాలి అన్నదే చిదంబర రహస్యం.పరమశివుడు శివతాండవంచేస్తూ నటరాజస్వామిగా వెలసిన ఈఆలయం నలభై ఎకరాల సముదాయంలో నిర్మించబడింది.ఈఆలయపు గర్బగుడిగోడలోబంగారురేకుపైన యంత్రంతో బిగింపబడిఉంటుంది.దీని ఎదురుగా తెరవేసిఉంటుంది. ఆక్కడకు వచ్చినభక్తులు తెరతొలగించిచూస్తారు,అక్కడ శూన్యమే కనిపిస్తుంది.అదే చిదంబరరహస్యం.ఈఆలయంలోని నందీశ్వరుడు భారతదేశంలోని నందులలోకెల్ల పెద్దది.శివగంగ వేయిస్ధంబాల మండపంకు పడమరగా 'సువర్ణకోనేరు' ఉంది.
స్ధలపురాణం: వనవిహారం చేస్తున్న శివుని మోహనరూపం చూసి మునిపత్నులు మోహంచెందారట,అందుకు కోపించిన మునులు స్వామి వారిపై పాములను పంపగా వాటిని ఆభరణాలుగా స్వామిధరించాడు,పులినిపంపగా దానిచర్మాన్ని వస్త్రంగా ధరించాడు.మునులు తమ సర్వశక్తులు ఒడ్డి 'ముయలకన్'అనే రాక్షసుని పంపగా స్వామి నటరాజుగా ఆనందతాండవంచేస్తూ ఆరాక్షసుని తనపాదంకింద తొక్కిపడ్డాడట.ఆస్ధలంలో'తిరుమూలతనేశ్వర్'ఆలయం ఉంటుంది.దీనికి దక్షణంగా శివుడు నృత్యభంగిమలో కనిపించే స్వామిని'పొన్నాంబళం'అంటారు.ఇక్కడ స్వామికి'భుజంగత్రాస'అని అమ్మవారికి'శివకామి' అని పేరు.ఈఆలయాన్ని పంచ సభలక్షేత్రంగా పేర్కొంటారు.జ్ఞానసభ,కనకసభ,దేవసభ,నృత్యసభ,రాజసభ అనే సభలలో జ్ఞానఅభలో..స్వామికొలువైన గర్బాలయం.రెండవదైన కనకసభ గర్బగుడిచుట్టుఉన్నప్రాకారం.దీనిలోఉన్న 64 స్ధంబాలు 64 కళలకుప్రతీకగా చెపుతారు.దీనిపైకప్పుపై 21,600 బంగారు పెంకులు వేయడంవలన స్వర్ణసభగా ప్రఖ్యాతిపొందింది.రెండవ ప్రాకరం దేవసభలో ఉత్సవసమయాలలో నటరాజస్వామి,శివకామసుందరితో దేవతలకు దర్శనం ఇచ్చేలా కొలువుతీరతారు.ఈప్రాకారంలోనే నృత్యసభఉంది.స్వామి కాళికాదేవితో నృత్యం చేస్తుండగా కర్ణాభరణం జారి నేలపై పడిందట స్వామినృత్యంచేస్తూనే కాలితో ఆభరణాని అలంకరించుకుని ఊర్ధ్వ తాండవవిన్యాసం జరిపినప్రదేశమే నృత్యసభ.మూడవప్రాకారంలోని రాజసభలో,రాజవీధిలో సతీసమేతంగా ఊరేగింపువచ్చిన స్వామి అలసట తీరేందుకు ఆరాత్రి అక్కడ కొలువై,మరుదినం ప్రయాణమై గర్బలయం చేరతాడు.ఈఆలయం మానవ నిర్మితంకాదని మూడువేమంది శివగణాణాలు కైలాసంనుండి తరలివచ్చి నిర్మించారని చెప్పుకుంటారు.వారిని'దీక్షితులు'అనిపిలుస్తారు.వారివంశస్తులే ఆలయనిర్వాహణ చేస్తున్నారు.ఎందరో సిధ్ధులు చిదంబరేశుని సేవించి ముక్తిపొందారు.వెలుగురేఖలు సోకకముందే తుమ్మెదలుకూడావాలని పుష్పలను స్వామికిసమర్పించడానికి పులిపాదాలనువరంగాపొంది,స్వామిసేవించి తరించాడు 'వ్యాఘ్రపాదుడు'స్వామి నృత్యాన్నితిలకించి,తరించాలన్నకోరికతో ఆత్రి,అనసూయల పుత్రుడిగా అవతరించిన'పతాంజలి'స్వామి అనుగ్రహానికి పాత్రుడు అయ్యాడు. భక్తుడు 'నందుని'చరిత్రమనందరికితెలిసిందే.తమిళనాడులో గొప్పశివభక్తులుగా చెప్పుకునే అరవైమూడుమందిభక్తులు ఉన్నారువీరిని'నయనార్లు'అంటారు.ఇందులో అప్పర్,సంబంధర్,మాణిక్యవాచికర్,సుందరర్ అనేభక్తులను అత్యంతగొప్పవారుగాభావిస్తారు. అన్నినృత్యరీతుల నటరాజస్వామి నృత్రభంగిమలే మూలం అంటారు.ఈఆలయంలోని శిల్పకళ అద్బుతంగా ఉంటుంది.
ఇక్కడకు ఎనిమిది మైళ్ళదూరంలో శీర్కాళి 'వైదీశ్వరన్'కోవెలఉంది.నాడీజోస్యానికి ఈఊరు ఎంతోపేరుపొందింది.
డా.బెల్లంకొండనాగేశ్వరరావు.

మరిన్ని వ్యాసాలు

కేదారనాధ్ .
కేదారనాధ్ .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు.
బదరీనాధ్ .
బదరీనాధ్ .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు.
గంగోత్రి.చార్ థామ్ యాత్ర
గంగోత్రి.చార్ థామ్ యాత్ర
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు.
యమునోత్రి.చార్ థామ్ యాత్రలొ తొలి ఆలయం.
యమునోత్రి
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు.