నవలా సమీక్ష పోటీలు - చేతన వంశీ

నవలా సమీక్ష పోటీలు

ఎడిటర్ గారికి నమస్కారం, నేను చేతన వంశీ. రచయితని. ఇటీవల విడుదలై చక్కటి జనాదరణ పొందిన మా కోటిన్నొక్కడు నవల పేరు వినే ఉంటారు. మొన్ననే "నాగ భైరవ సాహిత్య పీఠం, ఒంగోలు వారు నిర్వహించిన నవలల పోటీల్లో మన నవల విజేతగా నిలిచి ద్వితీయ బహుమతిని కూడా పొందింది. ఈ "కోటిన్నొక్కడు" ఆద్యంతమూ హాస్యభరితంగా సాగే ఒక అద్భుతమైన Comedy & Motivational నవల.. ఇది ప్రధానంగా మన బాల్యానికి, మనం చిన్నప్పుడు పెరిగిన స్వేచ్ఛా, సంతోషకరమైన వాతావరణానికి సంబంధించిన కథ కాబట్టి ఈ కథ చదువుతున్నంతసేపూ ప్రతీ ఒక్కరికీ తమ చిన్ననాటి మిత్రులూ, ఆటలూ, పాటలూ, తాము చదువుకున్న బడి, తమకు విద్యాబుద్ధులు నేర్పిన ఉపాధ్యాయులు, వారు పుట్టిపెరిగిన ఊరు, ఇల్లూ వాకిలీ... అన్నీ కళ్లముందు కనిపించి పాఠకులు వందకి వంద శాతం తమ చిన్నప్పటి రోజులని, తమ బాల్యoలోని ఆనందాన్ని తిరిగి అనుభూతి చెందుతారనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఇది ముఖ్యంగా విద్యార్థులు , ఉపాధ్యాయులకు సంబంధించిన కథ కావడం వలన ఈ ఏడాది ఉపాధ్యాయ దినోత్సవాన్ని (సెప్టెంబర్ 5, 2021) సందర్భంగా మన పుస్తకం గురించిన సమీక్ష పోటీలు నిర్వహించాలని అనుకుంటున్నాము. కావున మా ఈ సమీక్ష పోటీలకు సంబంధించిన ప్రకటనను మన పత్రికలో ప్రకటించి తోడ్పడ మనవి. కృతజ్ఞతలు ఎడిటర్ గారు. ఇట్లు, మీ చేతన వంశీ. 7660875546 ------------------- ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా కోటిన్నొక్కడు పుస్తకంపై సమీక్ష పోటీలు-2021 మన కోటిన్నొక్కడు నవల విడుదలైన మొదటి 6 నెలల్లోనే 600 పైచిలుకు కాపీలు అమ్ముడైన శుభ సందర్భంగా, *కోటిన్నొక్కడు పుస్తకంపై సమీక్ష పోటీలు* నిర్వహించి, 6గురు విజేతలను ఎంపికచేసి అక్షరాల 6000 రూపాయల బహుమతులను వారికి అందజేస్తున్నాము. మీరు సమీక్ష రాయడానికి ఎలాంటి నియమ నిబంధనలు లేవు. మీకు నచ్చినన్ని పదాలతో, నచ్చినన్ని పేజీల్లో మన కోటిన్నొక్కడు నవల గురించి సమీక్షను రాసి మాకు పంపించవచ్చు. మీ సమీక్షను మీరు నలుగురితో పంచుకోవడం మాకు నూటికి నూరు శాతం సమ్మతం. అందుకే మీకు నచ్చిన దగ్గర *మీ సమీక్షను అచ్చువేసుకునే హక్కు మీకుంది*. అలాగే మీరు మాకు పంపిన సమీక్షలను నలుగురితో పంచుకునే హక్కు మాకూ కూడా ఉంటుంది. అనగా, మీరు మాకు పంపిన సమీక్షలను మేము మా సామాజిక మాధ్యమాల్లో, వాట్సప్/టెలిగ్రాం గ్రూపుల్లో లేదా ఆన్లైన్/ఆఫ్లైన్ పత్రికల్లో, పుస్తక రూపంలో ప్రచురించుకునే హక్కు మీకూ, మాకూ, మనందరికీ ఉందన్నమాట. విజేతలను నిర్ణయించేది, బహుమతుల మొత్తాన్ని పెంచేది/తగ్గించేది/రద్దుచేసేది.. తుది నిర్ణయం పోటీ నిర్వాహకులదే... మరింకేం.. ఇంటిల్లిపాదీ ఆనందంగా చదువుకోగలిగిన మన అత్యద్భుత Comedy & Motivational నవల 'కోటిన్నొక్కడు'ను మీరు చదివి ఆనందించడంతో పాటూ, ఎంచక్కా సమీక్ష(లు) కూడా రాసి బహుచక్కటి బహుమతులనూ అందుకోండి. మొదటి బహుమతి: 3000 రూపాయలు (₹ 1500 చొప్పున ఇద్దరికీ) రెండవ బహుమతి: 2000 రూపాయలు (₹ 1000 చొప్పున ఇద్దరికీ) మూడవ బహుమతి: 1000 రూపాయలు(₹ 500 చొప్పున ఇద్దరికీ) (మొత్తం 6గురు విజేతలకు 6000 రూపాయల బహుమతులు) మీ సమీక్షలు మాకు పంపవలసిన మెయిల్ ఐడి: [email protected] లేదా మా వాట్సప్ నంబరు *7660875546* కు కూడా మీ సమీక్షలు పంపవచ్చు. మీ సమీక్షలు మాకు పంపవలసిన చివరి తేదీ: 31.08.2021. విజేతలను ఉపాధ్యాయ దినోత్సవం (05.09.2021) రోజు ప్రకటించి, అదేరోజు బహుమతులు అందించడం జరుగుతుంది. (కోటిన్నొక్కడు పుస్తకాలు అమెజాన్ లో లభ్యం, అలాగే మా ఈమెయిల్ & వాట్సప్ నంబరు 7660875546 లో సంప్రదించి కూడా పుస్తకాలు పొందవచ్చును)

మరిన్ని వ్యాసాలు

Kaashi Prayana Kathalu - Surya Vamsham
కాశీ ప్రయాణ కథలు - సూర్య వంశం
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
గణేషుని కల్యాణం
గణేషుని కల్యాణం
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు.
Clay Ganesh
మట్టి వినాయకుడు
- పడాల హరీష్ కుమార్
Kuldara Mystery
కుల్ధారా మిస్టరీ
- డా:సి.హెచ్.ప్రతాప్
Kashi Prayana Kathalu - Phalitham leni Mantram
కాశీ ప్రయాణ కథలు - ఫలితం లేని మంత్రం
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు