బృహదీశ్వర ఆలయం-మనఆలయాలు-3. - డా.బెల్లంకొండ నాగేశ్వరరావు.

బృహదీశ్వర ఆలయం-మనఆలయాలు-3.

బృహదీశ్వరరాలయం.(మన ఆలయాలు-3.)
అంతరించిపోతున్న జానపద కళారూపాలను పరిరక్షించడానికి గతంలో తిరుచునాపల్లి(తిరుచ్చి) లో 'పల్లెకళల పండుగ' రెండురోజులు నిర్వహించారు. అందులో యాభైకిపైగా అపురూప కళలు ప్రదర్శింపబడినవి.ఆవేదిక నిర్వాహకుడిగా నేను అక్కడ ఉన్నప్పుడు తంజావూరులోని భృహదీశ్వర ఆలయం చూడటం జరిగింది ఆవివరాలు మీకోసం.......చెన్నయ్ నుండి 310 కి.మీ.,తంజావూరు పట్టణంలో ఈఆలయంఉంది.
తంజావూరును పాలిక రాజరాజ చోళుడు(క్రీ.శ.985 నుండి1013 )పాలన చేసిన ఈయన చర్మవ్యాధితో బాధపడుతుండగా వీరి గురువుగారైన 'హరదత్తుడు'ఆలయనిర్మాణం జరిపి గతజన్మపాపఫలితం రూపుమాపుకొమ్మని సలహ ఇవ్వడంతో ఈదివ్యక్షేత్రాన్ని నిర్మించాడు.
ఈయన తరువాత మొదటి రాజేంద్రచోళుడు రాజధానిని 'గంగైకొండ చోళపురానికి మార్చాడు.పదకొండవ శతాబ్ధంనుండి పదహారవ శతాబ్ధంవరకు తంజావూరు చరిత్రమరుగునపడింది.మొదట విజయనగర చక్రవర్తులకు సామంతులుగాఉండి దరిమిలా స్వాతంత్ర్యరాజులుగా పాలించిన నాయకవంశంవారు ,పదహారవశతాబ్ధంమొదట్లో తంజావూరు ను రాజధానిగా చేసుకొని నూటఇరవై సంవత్సరాలు పాలన చేసారు. అనంతరం 1676 లో మరాఠవంశంవారు నూటఎనభై ఏళ్ళు పాలించారు.అనంతరం మెఘల్,ప్రెంచ్,ఆంగ్లేయులు తంజావూరును పాలించారు.రాజరాజ చోళుడు తన పాలనలో ఉత్తర భారతదేశంనుండి ఏనుగులచేత గంగ నీటిని మోయించుకువచ్చి రామేశ్వరంలోని రామలింగేశ్వరస్వామికి అభిషేకం చేయించాడట.అందుకు ఈయనను గంగైకొండ రాజరాజచోళన్ అంటారు. యునెస్కోవారిచే గుర్తింపుపొందిన ఆలయం ఇది.పదమూడు అంతస్తులు ఉన్నఈ ఆలయం 216 అడుగుల ఎత్తు ఉంది. 80 టన్నుల బరువున్న నల్లరాతితో శిఖరాగ్రాన్ని నిర్మించారు. దీనిని ఆలయం శిఖరానికి ఎలా చేర్చారో ఊహించండి.గర్బగుడిలోని శివలింగం ఏకశిలా నిర్మితం. ఈఆలయప్రాకారం 793 అడుగులు, వెడల్పు 393 అడుగులు. ఈఆలయం పెద్దకోటలో ఉంది. ఆలయం ముందుభాగాన నల్లరాతితో నందీశ్వరుని విగ్రహం ఎతైన వేదికపై ఉంది.ఈవిగ్రహం 19 1/2అడుగుల పొడవు, 8 1/2 అడుగులవెడల్పు,12 అడుగుల ఎత్తు,25 టన్నుల బరువు ఉంటుంది.ఈనందిని దాటి ముందుకువెళితే ఆలయం ప్రారంభం అవుతుంది.ఆరుఅడుగుల ఎత్తు ఉండే పునాదిపై నిర్మితమైయింది.గర్బాలయం పదిహేను అడుగుల పునాదిపై ఉంటుంది. ప్రవేశద్వారంనుండి గర్బాలయంవరకు అతిపెద్ద విశాలమైన మంటపాలు ఉన్నాయి. అవి వాద్యమంటపము, నాట్యమంటపము, స్థాపనామంటము, మహామంటపము అద్బుత శిలా సంపదతో మనలను కదలనివ్వవు. గర్బలయంలోని లింగం పదహరు అడుగుల ఎత్తు, ఇరవై ఒక్క అడుగుల కైవారం కలిగిఉంటుంది.ఇక్కడ అమ్మవారిపేరు'పెదనాయకి'ఆలయ ఉత్తరభాగాన 'శివగంగ'అనే ఉద్యానవనం ఉంది.ఈఆలయ గోపురంపై 108 భరతనాట్య భంగికము కడురమ్యంగా చెక్కబడినవి.ఈఆలయంలో ఆగ్నేయమూల రెండు విఘ్నేశ్వర విగ్రహాలు ఉన్నవి వాటిని మీటితే ఒకటి రాతిమోత,మరోకటి కంచుమోతవినిపిస్తుంది. దక్షణ ద్వారం వెలుపల నేలపై 'అ'అనే అక్షరం కనిపిస్తుంది.ఈఆయంలో 252 శివలింగా కనిపిస్తాయి.ఈఆలయం వెనక కుమారస్వామి ఆలయం పూర్తి నల్ల చలువరాతితో నిర్మించబడినది.
మరాఠా వీరుడు శివాజితమ్ముడు ఇక్కడ పరిపాలన చేస్తున్న రోజుల్లో ఈ ప్రాంతంలో ప్లేగు వ్యాధివంటిది సంభవించినదట.అప్పుడు రాజగురువుల సూచనమేరకు గ్రామదేవత అయిన 'మారియమ్మ' జాతర జరిపించడంతో ఆవ్యాధి తగ్గిపోయిందట.ఈ ఆలయం సమీపంలో 'సరస్వతి గ్రంధాలయం' ఉంది.ఇందులో అనేక ప్రాచీన రాతప్రతులు భద్రపరిచారు.తాటిఆకులపై, ఇతర ఆకులపై,లోహలరేకులపై,మోత్తం 33,433 6,426 అచ్చువేసిన గ్రంధాలయాలుఉన్నాయి.భారతీయభాషలతోపాటు లాటిన్,గ్రీకు,రోమన్ భాషాగ్రంధాలుఉన్నాయి.ఇక్కడికి కొద్దిదూరంలో 'మ్యూజియమ్'కూడా చూడతగినది. అద్బుత శిలాసంపదతో అలరారే ఈదేవాలం ఒకరోజులో చూడటం అసాధ్యం.
డా.బెల్లంకొండ నాగేశ్వరరావు.చెన్నయ్.