అరక్కోణం-మనఆలయాలు-5. - డా.బెల్లంకొండ నాగేశ్వరరావు.

అరక్కోణం-మనఆలయాలు-5.

నాటి ఆరుకోణం-నేటి అరక్కోణం.(మనఆలయాలు-5.)
ఆరుదిక్కుల్లో 'తిరువాలంగాడు-మణువూరు-తక్కోలం-కాంచీపురం-పారంజి-తిరుత్తిణి ప్రాంతాలలో ఈదివ్యక్షేత్రలు కలిగి ఉండటం విషేషం.
అరక్కోణం ప్రాచీన నామం "అరంతమిళ్ కుంద్రమ్‌". ఇది ఆరు కోణమ్‌ అనే తమిళ పదం నుండి పుట్టింది. ఈ పదానికి అర్థం ఆరు కోణాలు లేదా షడ్భుజి. ఈ పట్టణానికి ఆరువైపులా కాంచీపురం, తక్కోలం, మనావూర్, తిరువలంగాడు, తిరుత్తణి, పొన్నై, షోలింగర్ అనే ఆరు ముఖ్యమైన ప్రదేశాలు ఉండటం వల్ల ఈ పట్టణానికి ఈ పేరు వచ్చింది.
అరక్కోణం రైల్వే జంక్షను దేశంలోని పురాతన రైల్వేజంక్షన్లలో ఒకటి.
తిరువలంగాడు: భారతదేశంలోని 274శైవక్షేత్రాలలో ఇది ఒకటి. ఇది పట్టణానికి పదికిలోమీటర్లదూరంలో ఈశాన్యదిగువభాగంలో ఉంది. తమిళనాడులోని నటరాజస్వామి పంచసభలలో ఇది ఒకటి.శివుడు తాండవం చేస్తున్నప్పుడు స్వామి ఆభరణం అయిదుముక్కలై భూమిపై పడిందటఅవేపంచసభక్షేత్రాలని పురాణలద్వారా తెలుస్తుంది.వాటిలో ఈఆలయం 'వడారణ్యేశ్వర'ఆలయ రత్న సభగా పిలవబడుతుంది. ఇక్కడిమూలవిరాట్టు స్వయంభూ అని ప్రతీతి.
తలక్కోణం: దీని పూర్వనామం'తిరువూరల్'ఇది పట్టణానికి పదికిలోమీటర్లదూరంలో ఆగ్నేయానికి ఎగువున ఉంటుంది.ఇక్కడి ఆలయంలోని స్వామి పేరు'జలనాథీశ్వరుడు'దేవతల గురువు బృహస్పతి తమ్ముడు స్వామినిసేవించి ఇక్కడి నందీశ్వరుని నోటినుండి వచ్చే జలధారలో స్నానమాచరించి తన శరీర రుగ్మతను రూపుమాపు కున్నాడట.ఇక్కడి స్వామి పాదాలచెంత నిరంతరం జలంఊరుతుంది.
ఇక్కడి శివలింగం ఉత్తరాయణ కాలంలో ఎరుపు రంగు, దక్షణాయన కాలంలో తెలుపు రంగుకు మారడం విషేషం.
మణివూరు:పట్టణానికి పదహారు కిలోమీటర్లదూరంలో 'తిరునందీశ్వర' ఆలయం ఉంది.నటరాజస్వామి పంచసభలలో దీన్ని'జ్ఞానసభగా' పిలుస్తారు.శివుని వివాహాకోలంతో అగస్తేశ్వరముని ఇక్కడ దర్శనం ఇచ్చాడని,అందుకే ఈప్రాంతాన్ని మణువూరు అంటారు.(తమిళంలో 'మణం' అంటే వివాహం అని అర్ధం)అని స్ధలపురాణం ద్వారా తెలుస్తుంది.
పారంజి: ఆదిశంకరాచార్యులువారు స్వయంగా పూజలునిర్వహించిన ఆలయం ఇక్కడఉంది.ఇది అరక్కోణానికి పదహారు కిలోమీటర్లదూరంలో పశ్చిమ దిక్కునఉంది.ఇక్కడ స్వామివారిని అగస్త్యముని పూజించి వాగ్గేయం చేయడంతో దీన్ని'అగస్తీశ్వర'ఆలయంగా పిలుస్తారు.
తిరుత్తుణి: ఇదివ్యక్షేత్రం అరక్కోణానికి పదమూడుకిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడ కొలువైనది సుబ్రహ్మణ్య స్వామి. దీనిపూర్వనామం 'తిరుత్తణిగై'కాలక్రమంలో తిరుత్తుణిగామారింది.(సుబ్రహ్మణ్య స్వామి ఆరుక్షేత్రాలు గురించి తరువాత తెలుసుకుందాం)
కంచి: శ్రీలంకతోసహా మోత్తం 18 ప్రదేశాలలో శక్తిపీఠాలను అష్టాదశ శక్తిపీఠాలుగా వ్యవహరిస్తారు.కామాక్షిదేవి ఆలయం,'ఏకాంబరనాధ'
ఆలయం అరక్కోణానికిముఫైకిలోమీటర్లదూరంలోఉంది.(మరో వ్యాసంలో కంచి విషేషాలు తెలుసుకుందాం!)
అరక్కోణం పరిసరాలలో మరికొన్ని దివ్యక్షేత్రాలు:పట్టణానికి పశ్చమ దిక్కులో షోళింగర్ అనే ప్రాంతంలో'యాగ లక్ష్మినరసింహ'ఆలయం.దక్షణ దిక్కున కించీపురంలో 'వరదరాజ పెరుమాళ్ళు' ఆలయం,అష్టభుజ పెరుమాణ్: ఆలయాలు,తిరువూరగం,తిరుకారగం,తిరునీరాంగం,తిరుక్కార్వానం,లోని ఉలగాలంద పెరుమళ్ ఆలయాలు,పట్టణానికి తూర్పున తిరువళ్ళురులో 'వీరరాఘవస్వామి'ఆలయాలు ఉన్నాయి ఇవన్ని అరక్కోణంనుండి గంటసేపు ప్రయాణంలో ఉన్నాయి.తమళంలో తిరు అంటే 'శ్రీ'అని అర్ధం.
అరక్కోణంనుండినుండి బెంగళూరు, ముంబయి, గోవా, విజయవాడ, హైదరాబాద్,కోయంబత్తూరు, తిరుపతి, మంగళూరు, కొచ్చి, తిరువనంతపురం వంటి నగరాలకు రైలు సదుపాయం ఉంది.
డా.బెల్లంకొండ నాగేశ్వరరావు.