ఏకాంబరేశ్వరుడు.శివకంచి. - డా.బెల్లంకొండ నాగేశ్వరరావు.

ఏకాంబరేశ్వరుడు.శివకంచి.

శ్రీ ఏకాంబరేశ్వర ఆలయం.శివకంచి.
కంచిపట్టణానికి ఉత్తరంగా ఈఆలయంఉంది.ఏకాంబరేశ్వరుడు అంటే మామిడిచెట్టుకింద వెలసిన స్వామిఅనిఅర్ధం.ఈఆలయానికి నలుదిశలా గాలిగోపురాలు ఉంటాయి.1008లింగాలు,వేయిస్ధంబాల కళామండపం. పంచభూతాల్లో ఒకటి ఈదివ్యక్షేత్రం.దీనిని' పృథ్వీలింగం' అంటారు.
తిరువైణ్ణెక్కల్ లోని జంబుకేశ్వరఆలయంలో'జలలింగం'చిదంబరం నటరాజస్వామి ఆలయంలో'ఆకాశలింగం' తిరువన్ణామలై అరుగాచలేశ్వర ఆలయంలోని'అగ్నిలింగం'శ్రీకాళహస్తిలోని 'వాయులింగం' మనకు దర్శనమిస్తాయి.ఇక్కడి స్ధలపురాణం : ఆదిదంపతులు పాచికలు ఆడుతుండగా మహదేవుడు ఓడిపోగా,పార్వతిదేవి గేలిచేస్తూ పకపకనవ్విందట.కోపించిన ఆదిదేవుడు కురూపివికమ్మని శపించాడట. శాపవిమోచన దేవివేడుకోగా,శాపవిమోచన మార్గం ఉపదేశించాడట. భూలోకంలో ఓకేఓకపండుకాచే మామిడిచెట్టు కింద మట్టితో చేసిన శివలింగాన్ని పూజింపసాగిందట.పార్వతిదేవి భక్తిని పరిక్షింపదలచిన శంకరుడు తన జటాఝూటంనుండి గంగను నేలపైవదిలాడట, పరవళ్ళుతొక్కుతూ వస్తున్న గంగనుచూసిన పార్వతి శివలింగాన్ని కరిగిపోకుండా కౌగిలించుకుందట.ఆమెభక్తిమెచ్చి కురూపిగా ఉన్న పార్వతిదేవిని అతిసుందరమైన కనులు ఉన్న అందగత్తెగా మార్చాడట. ఆకర్షణీయమైన కనులు ఉండటంచేత దేవి'కామాక్షి'గా పేరుపొందింది. పార్వతిదేవికోరికమేరకు శివుడు అదేమామిడిచెట్టుకింది వెలసినందున 'ఏకామ్రనాథుడు'అనేపేరువచ్చింది.అక్కడి శివలింగానికి నూనె తోనే అభిషేకంచేస్తారు.పక్కనే ఉన్న రాతిలింగాలకు జలాభిషేకం జరుగుతుంది. ఇక్కడ ఆదిదంపతులు కుమారస్వామిని ఒడిలో పెట్టుకుని వదువరులుగా భక్తులకు దర్శనం ఇస్తారు.ఇక్కడ తిరునిలథింగల్ తుండం అనే శ్రీమహా విష్ణువు ఆలయం ఉంది.ఇది108 వైష్ణవ దివ్యక్షేత్రాలలో ఒకటైన వైష్ణవదేవాలయం.
డా.బెల్లంకొండ నాగేశ్వరరావు.

 

మరిన్ని వ్యాసాలు