------. - డా.బెల్లంకొండ నాగేశ్వరరావు.

------.

చిత్రగుప్తుని ఆలయం-కంచి.

చిత్రగుప్తుడు హిందూ పురాణాల ప్రకారం మనుషుల పాప పుణ్యాల చిట్టా రాసేవాడు. యమధర్మ రాజు ఆస్థానంలో ఉంటాడు. మనుషులు చనిపోయిన తరువాత వారికి స్వర్గమో, నరకమో ఈయన తేలుస్తాడు. చిత్రగుప్తుడు భారత్ లోనూ, నేపాల్ లోనూ కాయస్థులకు ఆరాధ్య దేవుడు. ఈయన బ్రహ్మ పుత్రుడు కాబట్టి హిందూ పురాణాలలో ఈయనకు ప్రత్యేకమైన స్థానం ఉంది.
వివిధ పురాణాల ప్రకారం బ్రహ్మకు అనేకమంది సంతానం ఉన్నారు. వారిలో వశిష్టుడు, నారదుడు, అత్రి ముని లాంటి వారు మానస పుత్రులు. మరికొంత మంది బ్రహ్మ శరీరం నుండి ఉద్భవించిన వారు. చిత్రగుప్తుడి జననం చాలా రకాలుగా వర్ణించబడి ఉన్నా ఆయన బ్రహ్మ శరీరం నుంచి ఉద్భవించాడు అనేది ఈ కథనాలన్నింటిలో కనిపించే ఉమ్మడి సారాంశం.
బాగా ప్రాచుర్యం చెందిన కథ ప్రకారం బ్రహ్మ మరణించిన వారి లోకాన్ని యముడికి అప్పగించాడు. యముడు తన దగ్గరికి వచ్చే అనేక ఆత్మలను నియంత్రించ లేక అప్పుడప్పుడూ వారిని స్వర్గానికి లేదా నరకానికి పంపించడంలో పొరపాట్లు జరిగేవి. బ్రహ్మ యముడిని ఈ పొరపాట్లు సవరించుకోమని హెచ్చరిస్తాడు కానీ ఒక్కో జీవి ఎత్తే ఎనభై నాలుగు జన్మల వలన తనకు నిర్వహించడం కష్టంగా ఉందని తెలియజేస్తాడు. దాంతో బ్రహ్మ ఆ సమస్యను పరిష్కరించడానికి కొన్ని వేల సంవత్సరాల పాటు తపస్సు చేశాడు. ఆఖరున కళ్ళు తెరిచి చూసే సరికితనకు ఎదురుగాఒకవ్యక్తి కలం, కాగితం పట్టుకుని కనిపించాడు.
చిత్రగుప్తుడు బ్రహ్మ శరీరం నుంచి ఉద్భవించాడు కాబట్టి ఆయనకు జన్మించిన వారసులను కాయస్థులు అని వ్యవహరిస్తారు.
మొదటగా బ్రహ్మ మనసులో ఆలోచనగా మొదలై (చిత్ర), మిగతా దేవతలకు తెలియకుండా (గుప్తంగా) సృష్టించబడ్డాడు కాబట్టి అతని పేరు చిత్రగుప్తుడు అయ్యింది.
హైదరాబాద్ లోని ఫలక్ నామా, కందికల్ గేటు దగ్గర 250 సంవత్సరాలు చరిత్ర కలిగిన చిత్రగుప్త మహదేవ దేవాలయం ఉంది.

కంచిలో.....దాదాపు వంద సంవత్సరాల క్రితం ఈఆలయం నిర్మింపబడింది.ఆలయంలో మూలవిరాట్టు ఒకచేతిలో పుస్తకం,మరోచేతిలో ఘంటం (కలం)పట్టుకుని మనకు దర్శనంఇస్తాడు.స్ధలపురాణం:ఒకసారి యముడు బ్రహ్మవద్దకువెళ్ళి పాపులకు శిఖవిధించే క్రమంలో తనకు సహకరించగలిగే సమర్ధవంతమైన గణికుడిని ప్రసాదించమనికోరాడు.మరోపురాణకథలో ఇంద్రధనస్సురూపంలో ఉన్న 'నీలాదేవి'నిసూర్యుడు అర్ధంగిగాస్వీకరించాడు.వారికి జన్మించినబాలునికి'చిత్రపుత్రుడు'అనేనామకరణంచేసారు.అతడే చిత్రగుప్తుడుగా ప్రసిధ్ధుడు ఐయ్యాడు.చిత్రగుప్తునికి ముగ్గురు బ్రహ్మల కుమార్తెలైన ముగ్గురితోవివాహంజరిగింది.శివాంశంతోజన్మించిన దేవశిల్పి మయబ్రహ్మ కుమార్తె'ప్రభావతి',మనుబ్రహ్మ కుమార్తె 'నీలావతి',విశ్వబ్రహ్మ కుమార్తె'కర్ణికాదేవి'వీరు. పంచలోహాలతో రూపొందించబడిన శ్రీకర్ణికాదేవి సమేతంగా చిత్రగుప్తుని ఉత్సవవిగ్రహం కంచిలోమనకు దర్శనమిస్తుంది.1910లో ఈఆలయంలో జరిపినతవ్వకాలలో ఈవిగ్రహం లభించింది.పౌర్ణమి రోజు భక్తులు ఎక్కువస్తారు.
డా.బెల్లంకొండ నాగేశ్వరరావు.