వరదరాజ స్వామి ఆలయం. - డా.బెల్లంకొండ నాగేశ్వరరావు.

వరదరాజ స్వామి ఆలయం.

వదరాజ స్వామి.(విష్ణుకంచి)
తమిళనాడు రాష్ట్రంలో కాంచిపురం జిల్లాల్లా,విష్ణుకంచి ప్రాంతంలో "కరగిరి" అనే ఎత్తయిన గుట్టపైన శ్రీవరదరాజస్వామి ఆలయంఉంది.108 వైష్ణవ దివ్యక్షేతత్రాలలో ఇది ఒకటి.ఇరవై మూడు ఎకరాల సముదాయంలో ఈఆలయంఉంది.ఇక్కడ బంగారు,వెండి బల్లులు ఉన్నాయి.ఆపక్కనే సూర్య,చంద్రులు ఉన్నారు.ణఅద్బుత శిలాసంపదకు నిలయమైన ఈ ఆలయం ఆవరణ ముందుభాగాన పుష్కరణి,ఆపక్కనే కల్యాణమండపం ఉన్నాయి.ఈఆలయం క్రీ.శ.1053లో చొళరాజులు నిర్మించారు.ఇక్కడ ఆరువందలకుపైగా శాశనాలు ఆలయ చరిత్రను విశదీకరిస్తున్నాయి.ఇక్కడి మంటపాలను శ్రీకృష్ణదేవరాయలు నిర్మించారు.మూడవ కర్ణాటక యుధ్ధంలో ఆనాటిబ్రిటీష్ అధికారి'రాబర్ట్ క్లైవ్'స్వామివారికి సమర్పించిన పచ్చలహారం నేటికి అలంకరరింపజేస్తారు.ఆలయానికి పశ్చిమభాగాన 96అడుగులతో 7అంతస్తులుగా ఉన్న గాలిగోపురం ఉంటుంది.ఉత్తరంవైపు వందకాళ్ళమండపం ఉంటుంది.దీనికి నాలుగుమూలల రాతిగొలుసులు వేళ్ళాడుతుంటాయి.ఈఆలయం రెండు అంతస్తులుగా ఉంటుంది.పైఅంతస్తు గర్బాలయంలో స్వామి చతుర్బుజుడై పశ్చిమముఖంగా కొలువు తీరిఉంటారు.ఈఆలయంలో ఎన్నో ఉప ఆలయిలు ఉన్నాయి.'ఆనంసరోవరం' ఉంది.'బంగారుతామరతటాకం'ఆనందసరోవరం మధ్యలోని మంటపంలో నీటిలోపల అత్తిచెక్కతో చేయబడిన అత్తిదేవతామూర్తి విగ్రహం ఉన్నది.1979 లో స్వామిని వెలుపలకుతీసారు,మరలా 2019 స్వామిని దర్శించుకునే అవకాశం కలిగించారు.
అర్ధశాస్త్రం సృష్ణికర్త కౌటిల్యుడి జన్మస్ధలం ఇక్కడేఅంటారు.

డా.బెల్లంకొండ నాగేశ్వరరావు.9884429899.