అరుణాచలం. - డా.బెల్లంకొండ నాగేశ్వరరావు.

అరుణాచలం.

అరుణాచలం.

లేదా "అన్నామలై".అని ఈక్షేత్రాన్ని పిలుస్తారు.ఇక్కడస్వామివారు'అరుణాచలేశ్వరుడు' 'అమ్మవారు అరుణాచలేశ్వరి'లేక 'ఉన్నామలై అమ్మన్' ఈదివ్యక్షేత్రాన్ని 'తిరువన్నామలై' అనికూడా అంటారు. ఆలయంచుట్టు పెద్ద ప్రాంగణం ఉంటుంది. ఆలయశిల్ప చాతుర్యం నయనానందంకలిగిస్తుంది.ఆలయం ముందు భాగాన ముఖమంటపంలో నందీశ్వరుని అద్బుత నగిషీతో చెక్కారు.కార్తిక పౌర్ణమిరోజున ఈఆలయంలో గొప్ప ఉత్సవం జరుగుతుంది.కొండపైన ఖడ్గపుష్కరిణి ఉంది. ఇక్కడి కొండపై అఖండ జ్యోతి దర్శనానాకి ఆరోజు లక్షల్లో భక్తులువస్తారు. ఈఅఖండజ్యోతికి వేసే వత్తి అరకిలోమీటర్ పొడవు ఉంటుంది.వేయి కిలోలనేతి లోవేసి జ్యోతి ప్రజ్వలనచేస్తారు. ఆరోజు ఊరంతా దీపావళిలా ప్రమిదలు వెలిగిస్తారు. రెండువందలఅడుగుల ఎత్తున పదకొండు అంతస్తుల గాలిగోపురం ఉంటుంది.నాలుగుదిక్కులా నాలుగు గాలిగోపురాలు ఉంటాయి.1560 లో శ్రీకృష్ణదేవరాయలవారు వీటిలో ఓగాలిగోపురం నిర్మింపచేసాడట. ఈఆలయం పాతిక ఎకరాల విస్ధీర్ణతలో తోమ్మిది గోపురాలు,ఏడు ప్రాకారాలతో 217అడుగుల రాజగోపురం అద్బుతంగా ఉంటుంది.ఇక్కడ దక్షణామూర్తి,నటరాజస్వామీ లతోపాటు మరెక్కడలేని 'మరకతలింగం'ఆలయప్రాంగణంలో చూడవచ్చు. తమిళనాడు రాష్ట్రములోఉంది.అరుణాచలం పంచభూతలింగ క్షేత్రాలలో ఒకటి. దక్షిణభారతంలో వెలసిన పంచలింగ క్షేత్రములలో అగ్నిభూతమునకిది ప్రతీక. అరుణాచలము అనగా అరుణ - ఎర్రని, అచలము - కొండ. ఎర్రని కొండ అని తాత్పర్యము. అ-రుణ అంటే పాపములను పరిహరించునది అని అర్ధము. తమిళంలో " తిరువణ్ణామలై " అంటారు. తిరు అనగా శ్రీ, అణ్ణామలై అనగా పెద్దకొండ అని విశ్లేషణ. ఇది చాలా గొప్ప పుణ్యక్షేత్రము. స్మరణ మాత్రము చేతనే ముక్తినొసగే క్షేత్రము. కాశీ, చిదంబరము, తిరువారూరుల కంటే మిన్నయని భక్తులు విశ్వసిస్తారు.
అరుణాచలం వేద, పురాణాలలో కొనియాడబడ్డ క్షేత్రము. అరుణాచలేశ్వర దేవాలయం శివాజ్ఞచేత విశ్వకర్మచే నిర్మింపబడిందనీ, దాని చుట్టూ అరుణమనే పురము నిర్మింపబడినదనీ పురాణములు తెలుపుతున్నాయి. అక్కడ జరుగవలసిన పూజావిధానమంతా గౌతమ మహర్షి శివాజ్ఞచేతఏర్పాటుచేశారనిస్కాందపురాణాంతర్గతమైన
అరుణాచలమహాత్మ్యం తెలుపుతున్నది. ఈ కొండ శివుడని పురాణములు తెల్పుచుండటము చేత ఈ కొండకు తూర్పున గల అరుణాచలేశ్వరాల యము కంటే ఈ కొండకే ఎక్కువ ప్రాధాన్యమీయబడుతున్నది. ఇది జ్యోతిర్లింగమని చెప్పుకొనబడుతున్నది. ఇది తేజోలింగము గనుక అగ్ని క్షేత్రమంటారు.
ఈ అరుణాచలం పరమేశ్వరుని జ్యోతిర్లంగ స్వరూపం కావటంవలన దీనిని చుట్టూ ప్రదక్షిణం చేయటం సాక్ష్తాత్తు శివునికి ప్రదక్షిణము అని భక్తుల విశ్వాసం. రమణ మహర్షి దీని ప్రాముఖ్యాన్ని పదేపదే ఉద్ఘోషించి ఉన్నారు, పాదచారులై శివస్మరణగావిస్తూ ప్రదక్షిణ చేసేవారికి మహాపుణ్యం సిద్ధిస్తుందని మహాత్ముల వచనం. అందుచేత నిత్యమూ, అన్నివేళలా ఎంతోమంది గిరిప్రదక్షిణం చేస్తూ ఉంటారు. గిరిపైన గల మహౌషధీ ప్రభావం వల్ల శరీరమునకు, శివస్మరణవల్ల మనస్సుకూ, శివానుగ్రహం వల్ల ఆధ్యాత్మిక జీవనానికి స్వస్ధత చేకూరుతుందని భక్తుల నమ్మకం. గిరిప్రదక్షణం చాలా వరకు తారు రోడ్డు పైనే జరుగుతుంది. ఈ మధ్య కాలంలో గిరిప్రదక్షణం చేయడానికి వీలుగా రోడ్డు పక్కన కాలిబాట కూడా వేసారు. ఎక్కువ మంది ఉదయం సూర్యతాపాన్ని తట్టుకోవడం కష్టం కనుక రాత్రి పూట లేదా తెల్లవారుజామున చేస్తారు. రమణాశ్రమానికి 2 కి.మీ. దూరం వెళ్ళిన తరువాత కుడివైపుకు తిరిగి రోడ్డుకి మధ్యలో వినాయకుడి గుడి వస్తుంది . అక్కడ నుండి కొండను చూస్తే నందిలాగా కనిపిస్తుంది.

గిరిప్రదక్షణం 14 కి.మి దూరం ఉంటుంది.ఉదయం పూట గిరిప్రదక్షణం చేయడం చాలా కష్టం. 9 లోపు ముగించడం మంచిది .గిరి ప్రదక్షణం పౌర్ణమి రోజు ఎక్కువ మంది చేస్తారు.గిరిప్రదక్షణంలో "నేర్(ఎదురుగా) శివాలయం" అని ఉంది దానికర్ధం శిఖరానికి ఎదురుగా ఉన్న శివాలయం అని.
నిత్యానంద స్వామి అశ్రమం పక్కనే భక్త కన్నప్ప ఆలయం ఉంటుంది. గిరిప్రదక్షణం ప్రతిరోజూ చేస్తారు .
రమణాశ్రమం అరుణాచలేశ్వరాలయమునకు 2 కి.మీల దూరంలో ఉంటుంది. అరుణాచలం వెళ్ళిన వాళ్ళు రమణా శ్రమాన్ని సందర్శిస్తూంటారు. అక్కడ స్థానికులకంటే విదేశీయులే ఎక్కువగా కనిపిస్తారు. సాయంత్రం సమయంలో రమణాశ్రమంలో చెసే ప్రార్థన చాల బాగుంటుంది.రమణాశ్రమం లో రమణుల సమాధిని మనం చూడవచ్చు . రమణాశ్రమం లో కోతులు ఎక్కువగ మనకు కనిపిస్తాయి . నెమళ్ళు కూడా స్వేచ్ఛగా తిరుగుతూంటాయి. రమణాశ్రమంలో ఇంకా లక్ష్మి (ఆవు) సమాధి, కాకి సమాధి, శునకం యొక్క సమాధిని కూడా చూడవచ్చు . ఇవన్నీ వరుసగా ఉంటాయి. అక్కడ గ్రంథాలాయంలో మనకు రమణుల గురించిన పుస్తకాలు లభిస్తాయి. మీరు ఆశ్రమంలో ఉండాలంటే మీరు ముందుగానే వసతి కోసం బుక్ చేసుకోవాల్సి ఉంటుంది.
రమణాశ్రమం కంటే ముందే మనకు శేషాద్రి స్వామి అశ్రమం కనిపిస్తుంది. శేషాద్రి స్వామి సమాధి కూడా అక్కడే ఉంది. ఇక్కడ కూడా ఉండటానికి రూంలు ఉన్నాయి. మీరు ముందుగానే రూం లను బుక్ చేసుకోవాల్సి ఉంటుంది.
డా.బెల్లంకొండ నాగేశ్వరరావు.