నాదస్వరం . - డా.బెల్లంకొండ నాగేశ్వరరావు.

నాదస్వరం .
నాదస్వరం.
మంచి సంగీతంతో కూడిన పాటవింటే అనిర్వచనమైన ఆనందానుభూతితో మనసు విహాంగమై అంబరాన్ని చుంబిస్తుంది.మనిషి తన ఆనందంకోసం కళలను సృష్టించుకున్నాడు అనడంలో సందేహమే లేదు.
అన్ని మంచిశకునములే (శ్రీకృష్ణార్జున యుధ్ధం చిత్రం) లో అనే పాట సన్నాయి నాదం వీనులవిందేకదా! నేనేల పాడెద దేవా (మురిపించేమువ్వలు ) చిత్రంలోని పాట ఓ తన్మయానందమే !
కర్ణాటక సంగీతంలో విశేష స్థానం కలిగిన నాదస్వరం అనే ఈ వాద్యం అత్యంత మంగళ ప్రథమైనదిగా భావిస్తారు. దేవాలయాల్లోనూ మత, సామాజికపరమైన కార్యక్రమాల్లోనూ తప్పనిసరిగా ఉండవలసిన వాద్యం ఈ నాదస్వరం. కచేరీలలో విరివిగా ఉపయోగించు వాద్యం కూడా ఇది. దక్షిణభారతంలో కర్నాటక సంగీతానికి పొడవైన సన్నాయిని వాడితే ఉత్తర భారతంలో హిందుస్తానీ సంగీతానికి పొట్టిదైన 'షెహనాయ్ని' వాడుతారు. పురాణాల నుండి ఈ వాద్యముని వాయించడానికి ప్రత్యేఖమైన తెగ ఉన్నది వారిని నాద బ్రాహ్మణులు, మంగళాకారులు అని సంబోధించేవారు. అందుకే మంగళవారు వాయించే వాద్యము కనుక "నాదస్వరమును, తవిల్(డోలు)ను" మంగళ వాద్యములుగా పరిగనిస్తారు. నాదస్వరాన్నే "సన్నాయి" అని తెలుగు ప్రజలు పిలుస్తారు. వేణువులాంటి సన్నని గొట్టం ఆకారాన్ని సంస్కృత భాషలో “నాడి” అంటారు. నాయీ అనే పార్శీ పదానికి ఈ నాడి మూలం కావచ్చు. షెహ్ (గాలి ఊదటం-breathing), "నాయి(లేక)నాయీ" అనే పదాల కలయికగా షెహనాయి ఏర్పడింది. ఈ "నాయి (లేక) నాయీ" పదం తెలుగు నేలమీద ఎంతగా స్థిరపడిందంటే, సన్నాయి వాయించే సామాజిక వర్గాన్ని నాయి బ్రాహ్మణులుగా వ్యవహరింప చేసి, వారికి ఒక సామాజిక గౌరవాన్ని సంతరింప చేసింది సన్నాయి.
 
నాదస్వరం - దీనికి రెండు పీకలుంటాయి. రెండు ప్రత్యేకమైన భాగాలుండి క్రిందవైపు పెద్ద ఉదరం బిగించిన పొడవాటి గొట్టంలా ఉంటుంది. దీని పార్శ్వభాగమున ఎనిమిది వేళ్ళ రంద్రాలు ఉండి నాలుగు గాలి బయటకు పోయే రంధ్రాలూ ఉంటాయి. దీనికి పైన బిగించిన కొయ్యంతో చేసిన డబుల్ రీడ్ నుండి ద్వని జనిస్తుంది.
పురాణాల నుండి సంగీతం వాయిద్యాలను వాయించడానికి ప్రత్యేక తెగ ఉంది వారినే నాదబ్రాహ్మణులు (నాదం అనగ శబ్ధం) అంటారు విరినే నాయిబ్రాహ్మణులు, మంగళ బ్రాహ్మణ అని అంటారు. నాదస్వరము, డోలుని మంగళ వాయిద్యాములు అని అంటారు ఎందుకనగా "మంగళ" వారు వాయించే వాయిద్యాములు కనుకా డోలు, నాదస్వరముని మంగళ వాయిద్యాములు అని అంటారు..
దాలిపర్తి పిచ్చహరిపండిత్, సూర్యనారాయణపండిత్ సోదరులు 1918
సిరిపురం పాపన్న పండిత్ 1875
కాకుమాను రామచంద్రయ్య పండిత్ 1880
నూతలపాటి శ్రీరాములు పండిత్ 1890
దోమాడ చిట్టబ్బాయి మల్లాం 1933
చింతలచెర్వు వెంకటేశ్వర్లు పండిత్ దంపతులు
రావులకొల్లు సోమయ్య పంతులు గారు సంగీత పండితులు
మార్టూరు వెంకటేశ్వర్లు పండిత్, హైమావతి పండిత్ దంపతులు.
కందుకూరి గోపి పండిత్ సింగరాయ కొండ బింగినపల్లి వాస్తవులు
నాదబ్రహ్మ పండితారాజుల విశ్వనాధం పంతులు - తిరుపతికి చేందిన సంగీత ఉపాధ్యాయులు.
ఆంధ్రరత్న కె.వెంకటగిరి శ్రీనివాసులు - నాదస్వర విధ్వంసులు, కంచికామకోటి ఆస్థాన విధ్వంసులు.
ఓ.రవికుమార్ - నాదస్వర విధ్వంసులు, శ్రీకాలహస్తి, కంచి కామకోటి ఆస్థాన విధ్వంసులు
శ్రీ పైడి స్వామి గారు రేపల్లెకి చేందిన నాదస్వర విధ్వంసులు, ప్రముఖ గాయని S.జానకి గారికి సంగీతము నేర్పిన గురువు.
చెరుకూరి శ్రీశైలం గారు, బాపట్లకి చేందిన నాదస్వర విధ్వంసులు.
శ్రీ ఇనగంటి సుబ్బన్న 1875
శ్రీ సుబ్బారాయుడు
శ్రీ వీరాస్వామి
శ్రీ పైడిస్వామి
శ్రీ చేబ్రోలు తిరుపతి
శ్రీ పలకూరు ప్రకాశం
శ్రీ గుంటూరు సుబ్రహ్మణ్యం
శ్రీ దుగ్గిరాల శివయ్య
మారుతున్నా కాలం ప్రకారం వెరే మతం వాళ్ళు కుడా నాదస్వర వాయిధ్యాన్ని నేర్చుకున్నారు వారిలో దూదేకుల ముస్లింలు ఒకరు..
షేక్ నబీసాహెబ్ సాతులూరు 1825
షేక్ చిననసర్ది పెదనసర్దీ సోదరులు చిలకలూరిపేట 1830
షేక్ పెదహుసేన్ చినహుసేన్ దాదాసాహెబ్ గాలిబ్ సాహెబ్ సోదరులు చిలకలూరిపేట 1850
షేక్ పెదమౌలా చినమౌలా నసర్దిసాహెబ్ సోదరులు అమ్మనబ్రోలు 1890
షేక్ చినపీరు పెదపీరుసాహెబ్ సోదరులు చిలకలూరిపేట 1904
నసర్దిసాహెబ్ ఆదంసాహెబ్ సోదరులు చిలకలూరిపేట 1915
వల్లూరు ఆదంసాహెబ్ వల్లూరు 1850
కొమ్మూరు పెంటుసాహెబ్ 1890
కొమ్మూరు సిలార్ సాహెబ్ 1928
రాచవారిపాలెం కాసింసాహెబ్ 1850
దొప్పలపూడి ఆదంసాహెబ్ 1885
ఆదిపూడి రంతుల్లా 1910
నందిగామ ఉద్దండుసాహెబ్ 1925
ముండ్లపాడు హసాన్ సాహెబ్ నందిగామ
షేక్ మహబూబ్ సుభాని కాలేషాబీ దంపతులు 1955
త్రోవగుంట హసాన్ సాహెబ్ 1915 (చినమౌలా గురువుగారు)
కస్మూరు మస్తాను
పద్మశ్రీ షేక్ చిన మౌలానా కరవది 5.12.1924
వల్లూరిపాలెంలెం మస్తాను 1925
పందలపాడు సైదులు 1926
షేక్ హుసేన్ తంగెడ1943
షేక్ మీరాసాహెబ్ సన్నాయి సైదమ్మ దంపతులు మిడమలూరు ఒంగోలు
కనపర్తి సోదరులు - కనపర్తి మస్తాన్ సాహెబ్, కనపర్తి హుసేన్ సాహెబ్
షేక్ మహబూబ్ సుభానీ , కాలేషాబీ ,ఫిరోజ్ బాబు
తమిళ నాదస్వర విద్వాంసులు.
టి.ఎన్.రాజరత్నం పిళ్ళై
తిరువేంగడు సుబ్రహ్మణ్య పిళ్ళై
కారైక్కుడి అరుణాచలం
శేషంపట్టి టి.శివలింగం
నామగిరిపేట్టై కృష్ణన్
మనసు పాడింది సన్నాయి పాట… (పుణ్యవతి)
కోకిలమ్మ పెళ్ళికి కోనంతా పందిరి, చిగురాకులు తోరణాలు చిరుగాలి సన్నాయి (అడవిరాముడు.)
సన్నాయి గురించి సినిమాలు.
సన్నాయి అప్పన్న
దేవరకొండ వీరయ్య
.సూత్రధారులు.
వంటి పలు చిత్రాలు వచ్చాయి.
డా. బెల్లంకొండ నాగేశ్వరరావు.