పలుభాషల హాస్యనటుడు నగెష్ . - డా.బెల్లంకొండ నాగేశ్వరరావు.

పలుభాషల హాస్యనటుడు నగెష్ .

పలు భాషల హాస్యనటుడు నగేష్ .
తమిళ కళారంగానికి వీరి అసలుపేరు గుండూరావు,చిత్రసీమలో నగేష్ గా పిలవబడ్డారు.వీరు హాస్యనటుడు, రంగస్థల నటుడు. పలు తమిళ, తెలుగు, మలయాళ చిత్రాలలో నటించాడు. తెలుగులో ఆయన ఆఖరి చిత్రం కమల్ హాసన్ నటించిన దశావతారం. నవ్విస్తూనే ఏడిపించే వారాయన. అందుకే ఆయన అభిమానులు ఆయన్ని దక్షిణాది చార్లీ చాప్లిన్ గా అభివర్ణిస్తుంటారు.
ఈయన అసలు పేరు గుండూరావు. 1933, సెప్టెంబర్ 27న కర్ణాటక రాష్ట్రం, తుమకూరు జిల్లా టిప్టూరు తాలూకాలో చెయ్యూరు అనే ప్రాంతానికి చెందిన ఒక సాంప్రదాయక బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు. ఈయన తల్లిదండ్రులు రుక్మిణమ్మ, కృష్ణారావు. చిన్నప్పుడే తాను ఏదో ఒక రంగంలో తన ప్రతిభనునిరూపించుకొన్నాకనే తిరిగి వస్తానని చెప్పి మద్రాసుకు వచ్చేశాడు. చెన్నైలో వెస్ట్ మాంబళంలో ఒక చిన్న సింగిల్ బెడ్ రూమ్ ఇంటిలో తమిళ రచయిత వాలి, తమిళ నటుడు శ్రీకాంత్ లతో కలిసి ఉన్నాడు. తరువాత కొద్ది కాలానికి భారతీయ రైల్వేలలో చిన్న ఉద్యోగాన్ని చేపట్టాడు. కానీ అది అంతగా సంతృప్తినివ్వకపోవడంతో దానిని వదిలేశాడు.
నాటకాలపై మక్కువతో తొలుత రంగస్థల నటుడిగా అవతారమెత్తాడు. నిర్మాత బాలాజీ నిర్మించిన నీర్ కుమిళి ఆయన నటించిన మొదటి చిత్రం. ఆయన నటించిన చివరి చిత్రం, కమల్ హాసన్ పది పాత్రలు పోషించిన దశావతారం. తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో సుమారు 1000 సినిమాలలో నటించిన ఘనత ఆయనది. నగేష్ నటజీవితాన్ని మలుపు తిప్పిన చిత్రం సర్వర్ సుందరం . ఇది 1964లో విడుదలైంది. ఇందులో ఆయనే కథానాయకుడు. కె.ఆర్. విజయ కథానాయిక.
నటించిన తెలుగు చిత్రాలు.
సర్వర్ సుందరం (1964) దేవత (1965) కన్నెపిల్ల (1966)
పెళ్ళి పందిరి (1966) నువ్వే (1967)పెళ్ళంటే భయం (1967)
అనుభవించు రాజా అనుభవించు (1968)పోస్టుమన్ రాజు (1968)
బస్తీలో భూతం (1968) ప్రేమ మనసులు (1969)కోటీశ్వరుడు (1970)
భయంకర గూఢచారి (1970)సికింద్రాబాద్ సి.ఐ.డి. (1971)
కలవారి కుటుంబం (1972)పాపం పసివాడు (1972) - విమాన చోదకుడుగా.సోగ్గాడు (1975)ఆడవాళ్లుఅపనిందలు (1976)ఉత్తమురాలు (1976)పూర్ణమ్మ కథ (1976)మనుషులంతా ఒక్కటే (1976) - గణపతి.సావాసగాళ్ళు (1977)ఇంద్రధనుస్సు (1978)కన్నవారిల్లు
(1978)దేవుడున్నాడు జాగ్రత్త (1978)ముగ్గురు మూర్ఖురాళ్ళు (1978)
ఒక చల్లని రాత్రి (1979)ఊర్వశీ నీవే నా ప్రేయసి (1979)
బొమ్మా బొరుసే జీవితం (1979)వేటగాడు (1979)ఒకనాటిరాత్రి (1980)
కొండవీటి సింహం (1981) గడసరి అత్త సొగసరి కోడలు (1981)
జస్టిస్ చౌదరి (1982)భామా రుక్మిణి (1983)శ్రీరంగనీతులు (1983)
వసంత గీతం (1984)కారు దిద్దిన కాపురం (1986)
ఇంద్రుడు చంద్రుడు (1989)విచిత్ర సోదరులు (1989)
దళపతి (1992)బృందావనం (1992)మేడమ్ (1994)
శుభాకాంక్షలు (1997)తొలిప్రేమ (1998)తమ్ముడు (1999)
దశావతారం (2008)
తన హాస్యంతో ప్రేక్షక లోకాన్ని నవ్వించిన నగేష్ జీవితంలో పలు కష్టాలను అనుభవించాడు. నటుడిగా స్థిరపడిన తర్వాత తను సంపాదనను రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టారు. ఒక థియేటర్ కూడా నిర్మించాడు. ఎమ్జీఆర్ తో అభిప్రాయ భేదాలు వచ్చాక నగేష్ కి ఇబ్బందులు మొదలయ్యాయని తమిళ చిత్ర వర్గాలు అంటుంటాయి. సరిగ్గా అప్పుడే వ్యాపారం కూడా దెబ్బతిన్నది. అయితే మళ్ళీ ఎమ్జీఆర్ తో కలిశాక కెరీర్ పరంగా నిలదొక్కుకున్నాడు. ఎప్పుడూ కష్టాల్ని బయటకు చెప్పుకునేవాడు కాదు. నేను ఓ ఖరీదైన కారు కొన్నాను. అందులో మా అమ్మ రుక్మిణమ్మను ఎక్కించుకుని తిప్పాను. అలా తిప్పుతుండగానే ఆమె తుదిశ్వాస విడిచింది. ఆ క్షణాలే నన్ను ఎక్కువగా బాధ పెట్టాయి అంటాడు నగేష్.
75 ఏళ్ళు జీవించిన నగేష్ కు ఇద్దరు కుమారులు. ఒకరు ఆనంద్ బాబు మరొకరు రమేష్ బాబు. వీరిలో ఆనంద్ బాబు నటుడు. ఆయన భార్య 2006లో చనిపోయింది.. అస్వస్థత కారణంగా ఆయన చెన్నైలోని తన స్వగృహంలో 2009, జనవరి 31 శనివారం రోజు ఉదయం 11 గంటలకు కన్నుమూశాడు.