పోప్ ఆఫ్ ఇండియన్ జర్నలిజం - Syamasundar Ambadipudi

పోప్ ఆఫ్ ఇండియన్ జర్నలిజం
పోప్ ఆఫ్ ఇండియన్ జర్నలిజంగా పేరుపొందిన అసాధారణ ప్రతిభా శాలి ప్రసిద్ధ స్వాతంత్ర పోరాటంలో తన రచనాలతో , వ్యాసాలతో,ప్రదర్శించిన ధైర్య సాహసహాలతో ప్రజాజీవితములో అత్యున్నత శిఖరాలు అధిరోహించిన వ్యక్తి చింతామణి,ఉదారవాద రాజకీయ నాయకుదిగా పేరు బద్ధ "చిర్రావూరు యజ్ఞేశ్వర చింతామణి" గారు 1880, ఏప్రిల్ 10న విజయనగరంలో జన్మించారు ఆంధ్రుల ప్రతిభను, రాజకీయ పరిజ్ఞానాన్ని భారతదేశమంతటా చాటిన వ్యక్తి చింతామణి ఈయన తండ్రి చిర్రావూరు రామసోమయాజులు, వేదపండితుడు, విజయనగరం సంస్థానంలో మహారాజా విజయరామ గజపతిరాజుకు రాజగురువు.చింతామణి అనారోగ్యం వల్ల, మాతృవియోగం వల్ల ఎఫ్.ఏ పరీక్షలో ఉత్తీర్ణుడు కాలేకపోవడంతో ఈయనను చికిత్సకై విశాఖపట్నానికి పంపించారు.చింతామణి విశాఖలో స్థానిక రాజకీయ వ్యక్తులతో తిరగటం ప్రారంభించాడు ఈయన విశ్వవిద్యాలయాలనుండి పట్టాలు పొందలేక పోయాడు గానీ అసమానమైన ఆంగ్లభాషా పాండిత్యాన్ని సంపాదించాడు. ఆ వైదుష్యం అంతా స్వయంకృషి వల్ల లభించిందే. ఉపన్యాస శక్తిని పెంపొందించుకోదలచి అనేక సభలకు పోయి ఉపన్యాసాలను ఇచ్చేవాడు. ఇతని ఉపన్యాసాలు విని శ్రోతలు ముగ్ధులయ్యేవారు.
మొదటి నుండి పత్రికా రంగము పట్ల ఆసక్తి చూపేవాడు చిన్న వయస్సులోనే అనేక ఆంగ్ల పత్రికలకు వ్యాసాలు వ్రాసేవాడు.మొదట్లో తెలుగు హార్స్ అనే పత్రికకు సంపాదకుడిగా ఉన్నాడు. ఈయన వ్రాసే వ్యాసాలు వైజాగ్ స్పెక్టేటర్ అనే పత్రికలో అచ్చు అవటం ప్రారంభమయింది. ఆ తరువాత 18 ఏళ్లకే ఆ పత్రికకు సంపాద కత్వము వహించాడు అప్పట్లో సంపాదకుడిగా అయన జీతము 30 రూపాయలు. ఆ తరువాత చింతామణి ఆ పత్రికను 300 రూపాయలకు కొని ఆ పత్రికను విజయనగరం తెచ్చాడు. విజయనగరం నుండి ప్రచురణ ప్రారంభమయిన కొద్దీ రోజులకే ఆ పత్రిక పేరు ఇండియన్ హెరాల్డ్ గా మార్చాడు. "నేను ఆ పత్రికకు కేవలము సంపాదకుడినే కాదు,ఫార్మన్, ప్రూఫ్ రీడర్, విలేఖరి, యజమాని అన్ని నేనే " అని చింతామణి అనే వారు.పత్రిక బాగా ప్రాచుర్యము పొందినా ఆర్ధిక ఇబ్బందుల వల్ల రెండేళ్లలో మూసివేయవలసి వచ్చింది. ఇటువంటి కష్టకాలములోనే చింతామణి భార్యను కోల్పోయాడు తన దురదృష్టాన్ని అనారోగ్యాన్ని లెక్క చేయకుండా చింతామణి తన మకామును మద్రాసుకు మార్చి కొంతకాలము యునైటెడ్ ఇండియా అనే వార పత్రికలోనూ, ఆ తరువాత సుబ్రమణ్యము అయ్యరు సంపాదకత్వములో నడుస్తున్న మద్రాస్ స్టాండర్డ్ అనే దినపత్రికలో ఒక ఏడాది పనిచేశాడు. 1903 లో నాగేంద్రనాధ్ గుప్తా ప్రారంభించిన ఇండియన్ పీపుల్ అనే పత్రికకు సంపాదకుడిగా అలాహాబాద్ చేరుకున్నాడు
1909 అక్టోబరులో మదన్ మోహన్ మాలవ్యా, తేజ్ బహదూర్ సప్రూ వంటి మితవాద కాంగ్రెస్ నాయకులు "లీడర్" అనే ఆంగ్ల దినపత్రికను ప్రారంభించాడు అప్పుడు ఇండియన్ పీపుల్ పత్రికను లీడర్ పత్రికలో కలిపారు అప్పటినుండి లీడర్ పత్రికకు సంపాదకుడిగా ఉన్నాడు ఈయన
సంపాదకత్వములో ఈ పత్రిక దేశవ్యాప్తముగా ప్రసిద్ధి చెందింది చింతామణి నిష్పాక్షత మైన విమర్శలు చేస్తుండటం వల్ల ఆ రోజుల్లో అన్ని రాజకీయ పార్టీల వారు ఈ పత్రిక కోసము ఎదురు చూసేవారు. ఆ పత్రికలోని సంపాదకీయాలు ఆయనకు మంచి పేరు ప్రతిష్టలు తెచ్చి పెట్టాయి.1916 వరకు లీడర్ పత్రికకు సంపాదకుడిగా ఉండి మధ్య కొంత కాలము విరామము తరువాత 1927 నుండి మళ్లి లీడర్ పత్రిక సంపాదకత్వాన్ని చేపట్టాడు.
చిన్ననాటి నుంచి చింతామనికి రాజకీయాల మీద ఆసక్తి ఉండేది. 1900 సంవత్సరములో లాహోర్ లో జరిగిన అఖిల భారత జాతీయ కాంగ్రెస్ మహాసభలకు 20 ఏళ్ల వయస్సులో అప్పు చేసి మరీ హాజరు అయినాడు.హాజరు అవటమే కాకుండా అక్కడ అనేక విషయాలపై గంభీరమైన ఉపన్యాసాలు ఇచ్చాడు ఆ ఉపన్యాసాలకు సురేంద్రనాధ్ బెనర్జీ వంటి కాంగ్రెస్ నాయకుల ప్రశంసలు లభించాయి.అప్పట్లో హిందూ పత్రిక ఆ ఉపన్యాసాలను ప్రశింసించింది కూడ 1916లోను మళ్ళా 1927 లోను ఉమ్మడి మద్రాసు రాష్ట్ర శాసన మండలి సభ్యుడిగా ఎన్నికైనాడు 1921- 23 మధ్య అంటే రెండేళ్లపాటు అప్పటి యునైటెడ్ ప్రావిన్స్ (నేటి ఉత్తర ప్రదేశ్)కు విద్య, పరిశ్రమల శాఖా మంత్రిగా పని చేసాడు. 1930 - 31 లో లండన్ లో జరిగిన మొదటి రౌండ్ టేబుల్ సమావేశానికి ప్రతినిధిగా హాజరు అయినాడు.1939 లో బ్రిటిష్ ప్రభుత్వము నుండి సర్ బిరుదు అందుకున్నాడు. బెనారస్ హిందూ విశ్వవిద్యాలయము గౌరవ డాక్టరేట్ మరియు అలాహాబాద్ విశ్వవిద్యాలయము డి.లిట్ గౌరవ పట్టాను ఇచ్చాయి.భారత రాజకీయాల గురించి చింతామణి వ్రాసిన ఆంగ్ల పుస్తకము నేటికీ ప్రామాణిక గ్రంధముగా పరిగణింపబడుతుంది. వార్తా పత్రికలూ నడపటములో తన ప్రజ్ఞాపాటవాలతో విశేష కీర్తి గడించాడు. అయితే ఇంతటి విశేష ప్రతిభ సంపన్నుడైన ప్రత్యేక ఆంధ్ర ఏర్పాటుకు సుముఖత వ్యక్తము చేయలేదని సమకాలీన నాయకుల విమర్శలకు గురి అయినాడు,ఏది ఏమైనప్పటికి పత్రిక రంగములో బాగా రాణించిన చింతామణి గారు జులై ఇకటి 1941 లో తన 62వ యేట .స్వర్గస్తులైనారు.
 

మరిన్ని వ్యాసాలు