కథవెనుక కథ. - డాక్టర్ కె ఎల్ వి ప్రసాద్

కథవెనుక కథ. కథ వెనుక కథ అస్త్రం ఇది నా మొదటి కథ .బాపు బొమ్మకు కథ రాయడం ,అది 'స్వాతి ..వారపత్రిక 'వారికి నచ్చి ప్రచురించడం ,నా అదృష్టం !ఇది నేను మహబూబాబాద్ ,ప్రభుత్వ ఆసుపత్రిలొ (౧౯౮౨_౧౯౯౪)దంత వైద్యుడిగా పని చేస్తున్న రోజులు .అప్పటికి దంతవైద్య విజ్ఞానానికి సంభందించిన వ్యాసాలు అనేక పత్రికలకు రాసి ఉన్నాను.ఒక ప్రాంతీయ పత్రికకు ,వారం ..వారం ..రాస్తున్నాను . ఈ నేపద్యంలో ,అప్పుడు ఆంధ్రా బాంకు లొ మేనేజర్ గా పని చేస్తున్న ,శ్రీ తోట సాంబ శివ రావు ,చనువు కొద్దీ ,కాస్త ,సెటైర్ గా "ఎప్పుడూ ..ఆ వ్యాసాలేనా ...కథలు రాయొచ్చు కదా !"అన్నారు .అప్పటికే , నేను కథలు రాయడానికి ప్రయత్నం చేసి సాథ్యం కాక ,ఆ ..ఆలోచనను ,తాత్కాలి .. కం గా ,పక్కన పెట్టాను .(కథ /నవల ,రచయిత ,స్వర్గీయ శ్రీ కె .కె.మీనన్ నాకు పెద్దన్నయ్య )సాంబ శివరావు గారి మాట ,నాలో ని కథా రచయితను మేల్కొలిపినట్టు అయింది.ఆ ...వారం స్వాతి పత్రికలొని బాపు బొమ్మకు 'అస్త్రం ' పేరుతో కథ రాసి పంపిస్తే ,మరుసటి వారం స్వాతి లో వచ్చింది,సాంబశివరావు గారిని అశ్చర్య పరిచింది ! ఈ కథ చదివిన స్వర్గీయ శ్రీ పి.వి.రమణ శ్రీ పేర్వారం జగన్నాధం గారు ,నన్ను కథలు రాయమని ప్రోత్సహించారు .వారి ఆశీర్వాద ఫలితమే ,నేను రచించిన ... ౧)కె.ఎల్వీ .కథలు 2)అస్త్రం ...చిన్న కథలు త్రీ)హగ్ మీ క్విక్ ...కథలు ఇదండీ నా మొదటి కథ వెనుక కథ !! __డాక్టర్ కె.ఎల్.వి.ప్రసాద్ హనంకొండ.