హిప్నాటిజమ్ - కర్లపాలెం హనుమంతరావు

హిప్నాటిజమ్

 

'హిప్నాటిజమ్' అంటే నిఘంటువుల్లో చెప్పే 'యోగ నిద్ర' కాదు . ఇది మామూలు నిద్రగా కనిపించినా ' హిప్నాటిస్ట్ ' కల్పించిన మాయా స్వప్నం . ఈ నిద్రావస్థలో హిప్నాటై జ్ అయిన మనిషి కర్ణావయం మినహా తతిమ్మా అంగాలన్నీ నిద్రావస్థలో ఉంటాయి . ఆ చెవి కూడా హిప్నాటిస్ట్ ఆదేశాల మేరకే పని చేస్తుంది తప్ప మిగతా ప్రపంచాన్ని పట్టించుకోదు.

హిప్నాటిస్ట్ అధీనంలో మాత్రమే ఉండే ఆ హిప్నాటైజ్డ్ సబ్‌జెక్ట్ ఉప్పునీళ్లను పానకంలాగా, గుండు సూదిని బెండు ముక్కలాగా భావించమని హిప్నాటిస్ట్ ఆదేశిస్తే ఆ తరహాలోనే ప్రవర్తిస్తుంది !

చెప్పిందల్లా చేస్తుంది కదా అని సబ్జక్ట్(హిప్నొటైజ్ అయిన వ్యక్తి ) చేత అతని సహజ మనోవృత్తికి విరుద్ధమైన అనైతిక కార్యం హిప్నోటిస్ట్ కూడా చేయించలేడు. మానవతి అయిన స్త్రీని నగ్నంగా నిలబడమని ఆదేశిస్తే ( ఆర్డర్ ) నిద్రావస్థ నుంచి బైటికి వచ్చేస్తుంది. ఆ విధంగా పరిమితులు లేని హిప్నాటిజమ్ గనక నిజంగా ఉంటే సినిమాల్లో చూపించనట్లు అమాయకుడ్ని హిప్నా టైజ్ చేసి గిట్టనివాడిని చంపించేయవచ్చుగా!

హిప్నో టైజ్ అయిన వ్యక్తికి తాను ఆ స్థితిలో చేసిన పన్లేవీ సాధారణ స్థితిలో గుర్తుకురావు . అట్లా గుర్తుకు తెప్పించాలంటే మళ్లా సబ్జెక్ట్ ను అదే హిప్నాటైజ్డ్‌ స్థాయికి తీసుకు వెళ్లాలి.

హిప్నాటైజ్ చేయబడిన వ్యక్తి ఆ స్థితిలో తన కందిన ఆదేశాలను హిప్నాటిజమ్ స్థితి నుంచి బైటికి వచ్చిం తరువాతా హిప్నాటిస్ట్ చెప్పినప్పుడు పాటిస్తాడు. హిప్నాటిజమ్ చేయబడిని అమ్మాయిని ఆ స్థితిలో 'నేను చిన్నగా దగ్గినప్పుడు ఒక గ్లాసెడు మంచినీళ్లు తెచ్చి ఇస్తావు! ' అని హిప్నోటిస్ట్ ఆదేశించి తిరిగి ఆ అమ్మాయిని హిప్నాటిజమ్ స్థితి నుంచి బైటికి తెచ్చి దగ్గినపుడు ( హిప్నోటిస్ట్ మాత్రమే ) నిజంగానే ఆమె మంచినీళ్లు తెచ్చి ఇస్తుంది. ఇట్లా ఎందుకు తెచ్చి ఇచ్చావని అడిగితే ' తెలీదు. . అనిపించింది .. తెచ్చాను ' అని బదులిస్తుంది . మళ్లీ మునుపటి హిప్నాటిజమ్ స్థాయికి తీసుకెళ్లి సమాధానం రాబట్టవచ్చు. ఈ ప్రక్రియను హిప్నాటిజమ్ లో UD conscious Motive అంటారు .

హిప్నాటిజమ్ లో కూడా పరిమితులు కద్దు . జనాభాలో కేవలం 5 శాతం వరకే హిప్నాటిజమ్ ప్రక్రియకు లొంగేది. చిన్న వాళ్లను హిప్నాటైజ్ చెయ్యడం కష్టం. ఆడా మగా, చిన్నా పెద్దా( యుక్త వయసు నుంచి ) , అక్షరాస్యుడు నిరక్షరాస్యుడు అనే తేడా లేకుండా అందర్నీ సమానంగా హిప్నాటైజ్ చేయచ్చు . సబ్ జెక్ట్ కు హిప్నోటిస్ట్ మీద నమ్మకాన్ని బట్టి హిప్నాటిజమ్ తీవ్రత మారుతుంది. జంతువుల మీదా పసిపిల్లల మీదా చేయవచ్చు కానీ, దానికి ప్రత్యేకమైన నైపుణ్యం కావాలంటుంది మనోవిజ్ఞాన శాస్త్రం.

మసక వెలుతురున్న ప్రశాంతమైన గదిలో రిలాక్స్ డ్ పొజిషన్ లో ఉన్న సబ్జెక్ట్ మొహం మీద .. ముఖ్యంగా కళ్ల మీద కాంతివంతమైన వస్తువును ఫోకస్ చేస్తూ.. మంద్ర స్వరంతో హిప్నోటిస్ట్ ' నీ కంటి రెప్పలు బరువుగా ఉన్నాయి. . ఇంకా బరువవుతున్నాయి. . ఇంకా బరువవుతున్నాయి. . అంటూ పదే పదే ఆదేశాలిస్తో ' నువ్వు నిద్ర పోతున్నావు . . నిద్రపోతూ ఉన్నవు .. నిద్ర పొతున్నావు .. నిద్రపోయావు.. ఇప్పుడు నీకు ప్రశాంతంగా ఉంది. హాయిగా ఉంది. . చాలా హాయిగా ఉంది. నామాటలు వింటున్నావు, నా మాటలు మాత్రమే వింటున్నావు.. అంటూ తన మాటలు మాత్రమే వినే నిద్రావస్థలోకి తీసుకు వెల్లడంతో హిప్నాటిజమ్ ప్రారంభించడం సర్వత్రా ప్రచారంలో ఉన్న విధానం. ఈ ప్రక్రియ సాగే సమయంలో హిప్నోటిస్ట్ ఆదేశాలు నిరంతరం చెవిలో పడుతున్నప్పుడే సబ్జెక్ట్ అతని సజెషన్స్ తదనంతర దశల్లో పాటించడం జరిగేది.

హిస్టీరియాలాంటి రోగాలకు , కొన్ని రకాల శస్త్రచికిత్సలకు హిప్నోటిజమ్ ను కూడా ఒక చికిత్సా విధానం కింద వాడవచ్చు . కానీ నైపుణ్యం అవసరం. ప్రయోగం ఏ మాత్రం వికటించినా మొదటికే మోసం రావచ్చు.


హిప్నాటిజమ్ ప్రక్రియ ఎప్పడ్నుంచి మొదలయిందో చెప్పడం కష్టం. దయ్యం పట్టడం, దేవుడు వంటి మీదకు రావడం లాంటివి హిప్నాటిజమ్ ప్రక్రియ భాగాలే .

ఆకాశంలోని నక్షత్రాలు, గ్రహాలకు మల్లే అయస్కాంతాలకూ మనుషుల మానసిక ప్రవృత్తుల మీద ప్రభావం చూపించే సత్తా ఉన్నట్లు నమ్మిన మెస్మర్ (1734–1816 ) అనే మహాశయుడు పేరిస్ లో కొన్ని చిన్న పాటి రుగ్మతలకు విరుగుడుగా వాటిని ఉపయోగించేవాడు. క్రమంగా అయస్కాంతాలేవీ లేకుండానే ఆ తరహా ప్రయోగాలు చేయడంతో 'ఆనిమల్ మాగ్న టిషన్' గా ప్రచారంలోకొచ్చిందా ప్రక్రియ. మానసిక రుగ్మతలకు ఈ ప్రక్రియ కూడా శాస్త్రీయంగా సమర్ధనీయమేనని వాన్ హెల్ మాన్డ్ (Van Helmont 1577-1644) చేసిన ప్రకటనను పరిశీలించే నిమిత్తం
పేరిస్ ప్రభుత్వం ఒక శాస్త్రజ్ఞులబృందాన్ని నియమించడం, ఆ సందర్భంలో 'ఆనిమల్ మాగ్నటిషన్ ' పనిచేసే విధానం తాలాకు మూలం నిరూపించాలని మెస్మర్ ని కోరడం జరిగింది. ఆ ప్రక్రియ ప్రకృతి పరంగా తనకు సిద్ధించిన శక్తిగా భావిస్తూ వచ్చిన మెస్మర్
ప్రభుత్వం బహుమతిగా ప్రకటించిన 20000 ఫ్రాంకులని కూడా తిరస్క రించాడు . దాంతో మెస్మర్ ఒక మాయలమారి మంత్రగాడుగా ముద్రపడి సామాజిక నిరాదరణకు గురయ్యాడు చివరకు .

1842 లోవార్డు అనే వైద్యుడు ఇంగ్లండులో ఈ విధానం ద్యారా ఓ రోగి కాలును హిప్నటిక్ స్థితిలో దిగ్విజయంగా తీసివేయడం, జేమ్స్ ఎస్టెయిలి ( 1808-1859) అనే మరో వైద్యుడు ఆ తరువాత కలకత్తాలో ఈ పద్ధతిలోనే సుమారు మూడు వందల చిల్లర ఆపరేషనులు విజయవంతం చేయడంతో హిప్నోటిజమ్ ప్రక్రియ శాస్త్రీయత సమాజామోదం పొందినట్లయింది .

కానీ అదే సమయంలో షాక్ లేకుండా చేసే ఈధర్, క్లోరోఫారమ్ లాంటి రసాయన ఔాషధాల ఆవిష్కరణలు హిప్నాటిజమ్ ప్రాధాన్యతను తగ్గించేశాయి.

హిప్నోటిస్ట్ ఇచ్చే సజెషన్స్ ( ఆదేశాలు ) మీద సబ్‌జెక్ట్ కు ఉండే నమ్మిక ఆధారంగా ఈ ప్రక్రియ సాగుతుందని .. దీనిని 'హిప్నాటిజమ్' అనాలని నిర్ధారించిన శాస్త్రజ్ఞుడు జేము బ్రెయిడ్ (1795 1860) .

ఫ్రాయిడ్ (Freud 1856 – 1939), బ్రూయర్ (Breuer) అనేవాళ్లు - చార్కాట్, బెంతామ్ ల దగ్గర నేర్చుకున్న ఈ ప్రక్రియతో 1895 దాకా ఉమ్మడిగా మనోవ్యాధులను గుర్తించి నయంచేసేవాళ్లు . కానీ, ఈ ప్రక్రియ ద్వారా నయం చేసిన మనోవ్యాధులు తిరగబెట్టడమే కాకుండా , రోగులు వైద్యులను ప్రేమించడం లాంటి సైడ్ ఎఫెక్ట్స్ కారణంగా బ్రూయర్ 1895 లో దీనిని ఫ్రాయిడ్ కే వదిలేశాడు.

తరువాత ఫ్రాయిడ్ రోగిలో హిప్నాటిస్ట్ పట్ల నమ్మకం స్థిరపడే ' ఫ్రీ అసోషిమేషన్ ( ఒక పదాన్ని చెప్పి, దానికి తగ్గట్లు తోచిన మరికొన్ని పదాలకు రోగి చేత చెపించడం ) పద్ధతితో పాటు
కలలను విశ్లేషించే (Dream Ana lysis) విధానాన్ని కూడా కలిపేసి రోగి మనసులో (Unconscious) దాగిన భావోద్వేగాలను తెలుసుకునే కొత్త విధానంతో చికిత్స చేయడం ఆరంభించాడు. ఈ చికిత్సలోని రోగిని కూడా భాగస్వామిగా మార్చే విధానం చక్కగా పనిచేయడంతో మనోశాస్త్రజ్ఞులు హిప్నోటిజమ్ ప్రక్రియను పక్కన పెట్టేశారు .

చివరకు హిప్నాటిజమ్ కేవలం ఒక పరిమితిలో నడిపించే
'వినోద ప్రదర్శన ' గా మాత్రమే మిగలిపోయింది !


- కర్లపాలెం హనుమంతరావు
e-mail: karlapalwm2010@gmail.com