రెండవ ప్రపంచ యద్ధం-రహస్యాలు - శ్యామకుమార్ చాగల్

రెండవ ప్రపంచ యద్ధం-రహస్యాలు

ప్రపంచ యద్ధం ఎందుకు వచ్చింది ? దీనికి సమాధానం చాలా సంక్లిష్టమైంది. మొదటి ప్రపంచ యుద్ధం లో ఓడిపోయిన జర్మనీ మళ్ళీ యుద్ధం మొదలు పెట్టకుండా ఉండటానికి పెద్ద దేశాలైన బ్రిటన్, ఫ్రాన్స్ , అమెరికా వగైరాలు జర్మనీ దేశం మీద వివిధ రకాలైన ఆంక్షలు విధించాయి. దాని ఫలితంగా ఓటమి పాలైన జర్మనీ తదితరులు వారి వారి రక్షణ రంగం పైన పెట్టుబడులు పెట్టకుండా వున్నాయి. గెలిచిన వారికి ఓడిన వారు కొన్ని కోట్ల డబ్బు ఇవ్వాలిసి వచ్చింది. దేశ భూ భాగాల పైన కూడా జర్మనీ తమ హక్కును కోల్పోవాల్సి వచ్చింది.
ఓటమి పాలైన జర్మన్ దేశస్థులను తన వాక్చాతుర్యం పటిమ తో మాయ చేసి,కోల్పోయిన గౌరవాన్ని తిరిగి తెచ్చుకుందామని,అందరికంటే జెర్మన్లది గొప్ప జాతి అని చెప్పి రెండవ ప్రపంచ యుద్దానికి పురిగొల్పాడు హిట్లర్.

ముందుగా పక్కనే వున్న పోలాండ్ మీద మొదటి సెప్టెంబర్ 1939 రోజున యుద్ధం మొదలు పెట్టాడు. అక్కడనుండి
1945 వరకూ భీకర మైన జనహననాన్ని కొనసాగించాడు. అంచనాల ప్రకారం మొత్తం మీద ఐదు కోట్ల ప్రాణాలు గాలిలో కలిసి పోయాయి. ఎన్నో లక్షల ప్రజల ఆచూకీ తెలియ లేదు. చాలా రోజుల వరకూ వారు మరణించారో లేక బందీలుగా వున్నారో తెలియ రాలేదు. వారిలో వుండే ఈ లక్షణాలను కనిపెట్టిన హిట్లర్ వారి ని రెచ్చ గొట్టి ఆరు సంవత్సరాలు అరివీర భయంకరమై న యుద్ధం చేయించాడు.
ఇందులో సుమారుగా యాభై లక్షల జర్మన్ సైనికులు అసువులు బాసారు.
తనతో బాట ఇటలీ ను , జపాన్ ను కూడా తోడు తీసుకుని ఆఖరున అణుబాంబులు జపాన్ మీద పడే లా చేసాడు .
ఆ యుద్ధ సమయం లో హెట్లెర్ చేసిన కొన్ని తప్పిదాల తో ఓటమి పాలయ్యాడు.

ఫ్రాన్స్ లో డంకిర్క్ అనే సముద్ర తీరం లో జరిగిన యుద్ధ సన్నివేశం అత్యంత విస్మయకరం. బ్రిటిష్,ఫ్రాన్స్ సైన్యాన్ని
జర్మన్ సేన మొత్తంగా చుట్టుముట్టింది. నిస్సహాయ స్థితిలో సముద్ర తీరం లో నిలబడ్డ అయిదు లక్షల బ్రిటిష్ ,ఫ్రాన్స్ సైన్యం ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని కొన్ని రోజులు గడిపారు. మందు గుండు సామాగ్రితో సహా ,ఆహరం కొరత తో అల్లాడి పోయారు. పారిపోవటానికి సముద్రం అడ్డు. వాళ్ళను తీసుకెళ్ళటానికి అవతలినుండీ ఎటువంటి సహాయం అందలేదు. ఎటువంటి బోట్స్ , షిప్స్ రాలేదు.
ఆ సమయం లో హిట్లర్ ముందుకు సాగి వీళ్లందరినీ చంపటం లేదా బందీలుగా చేయటం చాలా సులువు. కానీ అలా హిట్లర్ చేయ లేదు. ఎందుకు చేయలేదన్నది చరిత్ర కారులు ఇప్పటికీ సరిగా చెప్పలేక పోయారు. ఆ తర్వాత కొద్ది కాలం లోనే చిన్న చిన్న పడవలలో , మెషిన్ బోటులలో , చేపల పడవలు ,అలా ఏది దొరికితే దాన్లో వారందరూ పారిపోయారు.

జర్మనీ వద్ద ప్రత్యేకమైన బలమైన నావికా దళం లేక పోవటం మూలాన ఆ సమయం లో సముద్రం లో పారిపోతున్న శత్రువులను ఏమీ చేయలేక పోయారు. వున్న కొద్దిపాటి నావికా దళం వేరే ప్రాంతాలలో పదాతి దళానికి బలం చేకూర్చటానికి సరిపోయింది. ముందు నుండీ కూడా జర్మనీ వద్ద నావికా దళానికి, వాయు సేనకు ముఖ్యమైన పాత్ర పదాతిదళాలకు బలం చేకూర్చటమే . విపరీతమైన పదాతి దళాన్ని {ఆర్మీ} తయారు చేసి భూపోరాటం లో భయంకర యుద్ధం చేయటమనే కళలో ఆరితేరాడు హిట్లర్. అతడిని తట్టుకోలేక దాదాపుగా అన్ని దేశాలు ఓటమి పాలు అయ్యాయి.

హిట్లర్ చేసిన తప్పు ఏమిటంటే బలమైన అమెరికా, రష్యా మీద ఆ తర్వాతి కాలం లో యుద్ధం ప్రకటించటమే. ఎందుకంటే వాటికి జర్మన్ సేనను తట్టుకుని నిలబడే అపారమైన పదాతి దళాలు ఉండేవి.
డంకిర్క్ మీద ఆక్రమణ చేయకుండా ఎందుకు శత్రువులను వదిలేసాడో ఇప్పటి కీ చరిత్ర కారులకు అందని విషయం

 

 

మరిన్ని వ్యాసాలు

రామాయణంలో కొన్ని పాత్రలు.
రామాయణంలో కొన్ని పాత్రలు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
వీర శైవ మతం.
వీర శైవ మతం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
రామాయణానికి ముందు.
రామాయణానికి ముందు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Poorva janma krutam paapam
పూర్వజన్మ కృతం పాపం
- సి.హెచ్.ప్రతాప్
బిల్వపత్రం ప్రాశస్త్యం
బిల్వపత్రం ప్రాశస్త్యం
- సి.హెచ్.ప్రతాప్
సీనియర్ శ్రీరంజని.
సీనియర్ శ్రీరంజని.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు