రెండవ ప్రపంచ యుద్ధం _రహస్యాలు/విశేషాలు 5th - శ్యామకుమార్ చాగల్

Second World War - 5th part

రెండవ ప్రపంచ యుద్ధం _ రహస్యాలు /విశేషాలు

ప్రకృతి మించి బలమైన శక్తి ఏది లేదంటానికి జర్మనీ ఓటమి ఓకే పెద్ద నిదర్శనం. అదేలాగో చూడండి.

హిట్లర్ చేసిన అతి పెద్ద తప్పు రష్యా మీద దండ యాత్ర చేయటం. కమ్యూనిజం మీద హిట్లర్ కున్న విపరీతమైన ద్వేషమే దానికి మూలం. ఆపరేషన్ బార్బరోసా అని పేరు పెట్టి రష్యా లో దాదాపుగా ముఖ్య పట్టణాలైన లేనిన్గ్రాడ్ , స్టాలిన్గ్రాడ్ వరకు అప్రతిహతంగా విజయం సాధించి మాస్కో అంతిమ లక్ష్యం గ దూసుకెళ్లాడు.

యుద్ధ రంగం లో రష్యా సైనికులు అత్యంత దేశభక్తీ తో ప్రతిఘటించారు. అయితే ఇక్కడ ఎవరికీ కనపడని సైనికులు కొందరు రష్యా లో వెనకనుండి యుద్ధం చేశారు.! వాళ్ళు, రష్యన్ యువతులు!! జర్మన్ సైన్యం రష్యాను ఆక్రమించుకుంటూ వస్తున్న కొలదీ, ఎన్నో వేల పరిశ్రమల యంత్ర సామాగ్రిని విడగొట్టి ,దాదాపుగా పదిహేను లక్షల ట్రక్ ల లో జర్మన్ సైన్యం కు అందనంత దూరంగా ,వెనక మంచు కొండల్లోకి ,అడవుల్లోకి ,రాతి కొండ ప్రాంతాల్లోకి తరలించారు. ఆ పరిశ్రమ లలో స్త్రీలు కొన్ని లక్షల మంది పని చేసి, ఆ యుద్ధ సమయం లో కూడా పారిశ్రామిక ఉత్పత్తి 140 శాతం పెంచారు. అన్ని లోహ పరిశ్రమలను యుద్ధ సామగ్రి తయారు చేయటానికి వినియోగించారు. ఇందులో రష్యన్ స్త్రీల పాత్ర అమోఘమైనది.

దాదాపుగా పది లక్షల రష్యా సైన్యం జర్మన్ కు బందీలుగా అయ్యింది. కొన్ని సమయాల్లో రష్యా సైన్యం దాటికి తట్టుకోలేక వెనక్కి పారిపోయిన సైనిక అధికారులను కాల్చి చంపించాడు హిట్లర్. పారిపోయిన లేదా లొంగి పోయిన సైనికుల ను శిక్షించటమే కాకుండా వారి కుటుంబ సభ్యులను కూడా కాల్చేస్తామని ప్రకటించాడు హిట్లర్.

మాస్కో దరిదాపుల్లోకి జెర్మనీ సైన్యం చేరుకున్న తర్వాత వారికి పకృతి శత్రువుగా మారిపోయింది. అప్పుడే శీతాకాలం మొదలయింది. రష్యా శీతాకాల వాతావరణాన్ని తట్టుకోవటం చాలా కష్టం.
ఆ చలికి తగిన సన్నద్ధత హిట్లర్ సైన్యం చేసుకోలేదు. చలికి తట్టుకోలేక కోటులోపల గడ్డి కూరుకుని పెట్టుకునెవారు. ముందుగా విపరీతమైన చలి మొదలయ్యింది. చలి సుమారుగా -10 నుండీ -20 డిగ్రీల వరకూ వెళ్ళింది. అంటే మన సియాచిన్ ప్రాంతం చలి అన్న మాట. రష్యన్ జాతికి దీని గురించి పుట్టుకతో తెలుసు. కాబట్టి వారు వాటిని తట్టుకునే శక్తి మాత్రమే కాక అన్ని విధాలా సన్నద్ధంగా వుంటారు.

ఆ చలి లో జర్మన్ సైనికుల బాధలు వర్ణనాతీతం. ఎన్నో వేల మంది ఆ చలి కారణంగా మరణించారు. కాళ్ళు వేళ్ళు మొద్దుబారిపోయి ఎన్నో లక్షల మంది అంగ వైకల్యం పొందారు. చలి లో వారి ట్యాంకులు, యుద్ధ వాహనాలలో డీజిల్ లాంటివి గడ్డ కట్టి ,నడవకుండా మొరాయించాయి. అయిదు వందల కిలో మీటర్లు రష్యా లోకి చొచ్చుకుని వచ్చిన జర్మన్ సైనికులకు వెనక నుండీ సహాయం వస్తుందని హిట్లర్ చెప్పిన మాటలు నిజం కాలేదు. రష్యా లోని స్టాలిన్ గ్రాడ్ , లేనిన్గ్రాడ్ పట్టణాలను ఆక్రమించినప్పటికీ వాటి మీద పట్టు దొరక లేదు. ఒక మాస్కో చేజిక్కితే రష్యా ను జయించినట్లే అని హిట్లర్ భావించాడు.

జర్మన్ సైన్యం మాస్కో దరిదాపుల్లోకి వస్తున్నప్పుడు మాస్కో ను వద లి ఇంకా లోపలి వెళ్లి పొమ్మని స్టాలిన్ ను అధికారులు హెచ్చరించారు. కానీ స్టాలిన్ వెళ్లకుండా అక్కడే వుండి తన సైన్యం మొత్తాన్ని నడిపించాడు.

ఇక రష్యా పని అయిపోయిందని అమెరికన్ పెర్సిడెంట్ రూసవేల్ట్, బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్ చేర్చిల్ నీరస పడ్డారు.

ఆపరేషన్ కోడ్ నేమ్ " టైఫూన్ " అనే పేరు తో మాస్కో మీద దాడి రెండవ అక్టోబర్ నాడు ఆరంభించారు. ఆ దారి లో జరిగిన యుద్ధం లో సుమారు ఆరు లక్షల రష్యన్ సైనికులు బందీలుగా దొరికి పోయారు.

మాస్కో లో కంగారు మొదలయ్యి , రహస్య పేపర్ లను కాల్చి వేయటం మొదలు పెట్టారు. ప్రభుత్వ కార్యాలయాలు అన్నీ వెనక్కి తరలించారు. కానీ స్టాలిన్ మాత్రం అక్కడే ఉంటానని నిర్ణయించుకున్నాడు.

సిక్స్త్ అక్టోబర్ నాడు రష్యన్ యొక్క అసలైన చలి మొదలయ్యింది. తెల్లవారేసరికి జర్మన్ ట్యాంకుల మీద పూర్తిగా మంచు కప్పేసి అవి కదల లేని పరిస్థితి కలిగింది.

ఒక రోజు వర్షం,మరొక రోజు మంచు కురవ సాగింది. రోడ్లన్నీ మంచు, బురదతో నిండి పోయి , ఆ బురద సైనికుల మోకాలు దాటి వచ్చింది. రష్యా లో ఈ వాతా వరణాన్ని" రోడ్స్ లేని సమయం" అంటారు . నిజానికి రష్యాలో సిమెంట్ లేదా డాంబర్ రోడ్స్ చాలా వరకు లేవు. అన్నీ మట్టి దారులే. అవి కాస్తా ఈ వర్షం, బురద తో కలిసి బంక లాగ మారి వాటిని జర్మన్ ట్యాంక్స్ కూడా దాట లేక అందులో కూరుకు పోయాయి.

(ఇంకా వుంది.. సశేషం)

మరిన్ని వ్యాసాలు

గేయ రచయిత మజ్రుసుల్తాన్ పూరి .
గేయ రచయిత మజ్రుసుల్తాన్ పూరి .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు.
Vrutthi- pravrutthi
వృత్తి .. ప్రవృతి
- తోట సాంబశివరావు
నౌషాద్ అలి .
నౌషాద్ అలి .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు.
నటుడు షమ్మికపూర్ .
నటుడు షమ్మికపూర్ .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు.
నటుడు రాజకపూర్ .
నటుడు రాజకపూర్ .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు.
నటుడు శశికపూర్ .
నటుడు శశికపూర్ .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు.