అత్తా-కోడలు - బాలసుబ్రహ్మణ్యం మోదుగ

Attaa kodalu

అత్తా-కోడలు, బంధుత్వానికి వున్న ప్రాముఖ్యత ఒక సారి మననం చేసుకొందాము. వీరు లేకపోతే కార్టూన్ అనేది పుట్టివుండదని నా అభిప్రాయం. మధ్య ఒక యువ కార్టూనిస్ట్ అత్త, కోడలు, అప్పడాలకర్ర ఇవన్నీ పాతచింతకాయ తొక్కు అని వ్యాఖ్యానించారు.

అత్త-కోడలు మధ్య సఖ్యత కాని, సమరం కాని ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా నడుస్తూవస్తోంది-యుగాలతరబడి. మన పురాణాలలో కూడా అవకాశం వచ్చిన చోటల్లా కవులు బంధుత్వం మీద వ్యాఖ్యానిస్తూనే వచ్చారు.

మగవాడు ఇంటికి కర్త, సంపాదనాపరుడు. అతనిని మనం ఒక ఆస్థిగా భావిస్తే, ఆస్థి మీద హక్కు కోసం పోరాడే వ్యక్తులే అత్త మరియు కోడలు. పోరాటం నడిచినంత కాలము, అతను ఉమ్మడి ఆస్తిగానే చలామణి అవుతుంటాడు.

తల్లి తన కుమారుడి యోగక్షేమాల గురించి ఆలోచిస్తూ ఉంటుంది. వృద్ధాప్యం వచ్చిన తల్లితండ్రులను ఆదరిస్తున్నాడా లేదా అనికూడా గమనిస్తూ ఉంటుంది. విషయాలలో కోడలు అడ్డు వస్తే అత్త సహించలేదు. కోడలు తన భర్తతో మాట్లాడటం ఎక్కువగా వినడానికి ప్రయత్నించే వ్యక్తి అత్త గారు మాత్రమే. విషయం కోడలి కి కూడా బాగ తెలుసు. కోడలి రుసరుస, కొడుకు మాడిన ముఖం అత్త గారు ఎప్పుడూ గమనిస్తూనే ఉంటుంది. అది కూడా వారి మధ్య గొడవలకి ఒక కారణం.

ఆస్తి అనేది రాబోయే అవసరాలకు తప్పకుండా అవసరం. అభివృద్ధి చెందే కుటుంబంలో ఆస్తి అవసరం గురించి భర్తకంటే భార్యే ఎక్కువ ఆలోచిస్తుంది. అందుకని కోడలు తన అత్తగారి నుంచి తమకు ఎంత ఆస్తి వస్తుందనే అంచనాలో ఉంటుంది. తన భర్త సంపాదనలో అత్తగారు ఎంత వృధా చేస్తున్నారు అను తపన పడుతుంటుంది. తన సంపాదన వివరాలు పూర్తిగా భార్యకు చెప్పే భర్తలు చాల తక్కువ మంది ఉంటారు. తనకు భర్త తెలిపిన రాబడి ఖర్చుల్లో అత్త గారి ఖర్చు ఎక్కువ అనిపించితే సహజంగానే కోడలు అత్తపైన కినుక వహిస్తుంది. తరువాత తన భర్త అన్నదమ్ములకి అక్కచెల్లెళ్లకి పెట్టే ఖర్చులు, తమకు అత్తగారి నుంచి రాబోయే ఆస్తులు లెక్కలు వేస్తుంది. ఆస్తుల లెక్కలు ఎవరికి ఎలా చెప్పాలో అలా చెప్పగలిగిన నాడు భర్త పాత్ర సఫలీకృతం అవుతుంది.

ఈ అత్త-కోడలు-కొడుకు అనే త్రిభుజం ఎప్పటికీ ఉంటూనే ఉంటుంది. కాని ప్రతి రెండు భుజాల మధ్య కోణాలు మారుతూ ఉంటాయి. వారి మంచితనం, అర్ధం చేసుకునే తత్వం మీద భుజాల మధ్య కోణం మారుతుంది. ఆ కోణం అరవై డిగ్రీలు మూడు చోట్లా వుంటేనే త్రిభుజం అందంగా ఉంటుంది, సంసారం చక్కగా ఉంటుంది. వీరిలో ఏ ఒక్కరూ తమ స్వార్ధం కోసం పోరాడరు. బయటి వారికి ఒక పోరాటంలా కనిపించే చక్కని బంధు ప్రేమ అది.

మరిన్ని వ్యాసాలు

రామాయణంలో కొన్ని పాత్రలు.
రామాయణంలో కొన్ని పాత్రలు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
వీర శైవ మతం.
వీర శైవ మతం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
రామాయణానికి ముందు.
రామాయణానికి ముందు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Poorva janma krutam paapam
పూర్వజన్మ కృతం పాపం
- సి.హెచ్.ప్రతాప్
బిల్వపత్రం ప్రాశస్త్యం
బిల్వపత్రం ప్రాశస్త్యం
- సి.హెచ్.ప్రతాప్
సీనియర్ శ్రీరంజని.
సీనియర్ శ్రీరంజని.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు