భారతీయులు మరచిపోయిన దేశభక్తుడు - ambadipudi syamasundar rao

భారతీయులు మరచిపోయిన దేశభక్తుడు

చాలా మంది భారతీయులకు,అంటే ఆగస్టు 22 లో మెక్సికో లో మన లోక్ సభ స్పీకర్ ఓమ్ బిర్లా గారు పాండురంగ సదాశివ్ ఖంఖొజి విగ్రహాన్ని ఆవిష్కారించే దాకా ఈ పేరు తెలియదు. ఇంతకీ అయన ఎవరు? అనే ప్రశ్న చాలామంది మనస్సులో మెదులుతుంది అయన భారతీయ మేధావి వ్యవసాయ శాస్త్రవేత్త విజ్ఞుడైన రాజకీయవేత్త, విప్లవకారుడు మరియు గద్దర్ పార్టీ వ్యవస్థాపక సభ్యుడు అన్నిటికన్నా ముఖ్యముగా భారతీయులు మరచిపోయిన ప్రముఖ దేశభక్తుడు.ఈయన నవంబర్ 7,1884 లో వార్ధా లో ఒక మరాఠీ దేశస్థ ఋగ్వేద కుటుంబములో జన్మించాడు ఖంఖొజి బాల్యాన్ని వార్ధాలో గడిపి ప్రాధమిక మాధ్యమిక విద్య పూర్తిచేసుకొని పై చదువులకు నాగాపూర్ చేరాడు. నాగపూరులో ఉండగానే అయన బాలగంగాధర తిలక్ జాతీయోద్యము పట్ల ఆకర్షించబడ్డాడు.కానీ 1900 ప్రారంభములో భారత దేశాన్ని వదలి విదేశాలకు వెళ్లి అమెరికాలో స్థిరపడ్డాడు. అక్కడ వాషింగ్ టన్ స్టేట్ కాలేజీలో ఎన్రోల్ అయి 1913 నాటికి ఆ కాలేజీ నుండి పట్టభద్రుడైనాడు.
ఖంఖొజి యొక్క జాతీయోద్యమ కార్యక్రమము విదేశాల్లో 1908 నుండి మొదలయింది ఆయన పండిట్ కాన్షి రామ్ తో కలసి పోర్ట్ ల్యాండ్ లో ఇండియన్ ఇండిపెండెన్స్ లీగ్ ను ప్రారంభించాడు. అయన పనులు ఆయనను అమెరికాలోని ఇతర జాతీయోద్యమ నాయకులకు దగ్గర చేశాయి. అటువంటి నాయకులలో తారక్ నాధ్ దాస్వంటి వారు ఉన్నారు ఈ కార్యక్రమాలు అన్ని మొదటి ప్రపంచయుద్ధానికి ముందు జరిగినవే,ఖంఖొజి పసిఫిక్ కోస్ట్ హిందూస్తాన్ అసోషియేషన్ వ్యవస్థాపక సభ్యుల్లో ఒకడు ఆ తరువాత గద్దర్ పార్టీని కూడా స్థాపించాడు ఆ కాలములో అయన ఆ పార్టీలో చాలా ప్రముఖ వ్యక్తిగా మెలిగాడు 1911 లో అయన లాలా హరి దయాల్ ను కలిసాడు ఒకానొక సందర్భములో అయన వెస్ట్ కోస్ట్ మిలిటరీ అకాడమీలో ఎన్రోల్ అయినాడు.
మొదటి ప్రపంచ యుద్ద సమయములో అయన పాత్ర:-మొదటి ప్రపంచ యుద్ధము ద్వారా ఖంఖొజి చాలా నిశితముగా హిందూ జర్మన్ కుట్రలో భాగముగా ఉన్నాడు అయన యుద్ధము సమయములో యూరోప్ ను సందర్శించాడు ఆ తరువాత మెసపటోనియా ఇతర సభ్యులతో సందర్శించాడు 1915 వేసవిలో లో అయన రహస్యముగా ఇండియన్ ఎక్స్పీడీషనరీ ఫోర్స్ ట్రూపులలో పనిచేసాడు ఆ విధముగా జాతీయోద్యమ సాహిత్యాన్ని ప్రచారము చేస్తూ విప్లవానికి సహాయపడేవాడు.యుద్ధము జరిగేటప్పుడు ఖంఖొజి టర్కీ గుండా పర్షియాకు ,బెలూచిస్తాన్ వరకు ఆనేక ముస్లిం మారు వేషాల్లో ప్రయాణిస్తూ గద్దర్ పార్టీ సిద్ధాంతాలను ప్రచారము చేసేవాడు ఈయన ఇరాన్ బెలూచిస్తాన్ సరిహద్దుల్లో తిరుగుబాట్లకు ప్రయత్నము చేసాడు అదే సమయములో మహేంద్ర ప్రతాప్ బ్రిటిష్ ఇండియా వైపు దండయాత్ర ప్రయత్నము చేసాడు ఈ యుద్ధము చివరలో ఇతర బెర్లిన్ కమిటీ సభ్యుల లాగానే ఖంఖొజి కూడా కమ్యునిజం వైపు మారాడు. అయన వీరేంద్రనాధ్ చటోపాధ్యాయ, ఎమ్ పి టి ఆచార్య, ఎమ్ ఎన్ రాయ్ వంటి మొదటి తరము భారతీయ కమ్యూనిస్టు నాయకులతో పాటు సోవియట్ యూనియన్ లో ఉన్నాడు 1921 లో మాస్కో లో ఖంఖొజి లెనిన్ ను కూడా కలిసాడు ఈ విధమైన జాతీయ ఉద్యమములలో పాల్గొనటం వలన ఆయనను ప్రమాదకర వ్యక్తిగా భావించి భారతదేశములో అయన ప్రవేశాన్ని అప్పటి బ్రిటిష్ ప్రభుత్వము నిషేదించింది
ఖంఖొజి విద్యాపరమైన కెరీర్ విషయానికి వస్తే ఈయన 1920 లో మెక్సికో వచ్చినేషనల్ స్కూల్ అఫ్ అగ్రికల్చర్ లో బాటని మరియు క్రాప్ బ్రీడింగ్ డిపార్ట్ మెంట్ లో ప్రొఫెసర్ గా చేరాడు 1936లో ఈయన జీన్ అలెగ్జాండ్రెన్ సిండిక్ అనే బెల్జీయన్ వనితను వివాహమాడాడువీరికి ఇద్దరు కూతుళ్లు అయన మెక్సికన్ మొక్కజొన్న బ్రీడింగ్ ప్రోగ్రాం కు నాయకత్వము వహించాడు ఈయనను మెక్సికన్ ప్రభుత్వము వ్యవసాయ శాఖకు డైరక్టర్ గా నియమించింది.మెక్సికో లోని పబ్లిక్ ఎడ్యుకేషన్ సెక్రటేరియట్ లో డీగో రివెరె అనే చిత్రకారుడు గీసిన అవర్ బ్రేడ్ అనే ఒక పెయింటింగ్ జ్ఞాపక చిహ్నముగా ఉంటుంది ఆ పటము ఇంచుమించు లియోనార్డో డావిన్సి గీసిన లాస్ట్ సప్పర్ చిత్రాన్ని పోలి ఉంటుంది ఈ చిత్రములో ఖంఖొజి టేబుల్ ముందు కూర్చుని ఒక బ్రేడ్ ను పెద్ద కత్తితో కోస్తూ ఉంటాడు ఒక రైతు ఒక సిపాయి ఆయనకు ఇరువైపులా ఉంటారు వీరి చుట్టూ వివిధ దేశాల ప్రజలు కూర్చుని ఉంటారు 1947 లో ఖంఖొజి మరియు జీన్ భారత దేశము తిరిగి వచ్చారు మొదట్లో అయన వీసా అప్లికేషన్ భారత ప్రభుత్వమూ చే తిరస్కరింపబడింది కానీ తరువాత ఆమోదింపబడింది అయన నాగపూర్ లో సెటిల్ అయి రాజకీయలను ఎంచుకున్నాడు ఖంఖొజి 22 జనవరి 1967 లో మరణించారు.
.

మరిన్ని వ్యాసాలు

నయనాల నీలాలలో నిదుర.
నయనాల నీలాలలో నిదుర.
- డా. బెల్లంకొండ నాగేశ్వరరావు.
Kaashi Prayana Kathalu - Anthima Pariksha
కాశీ ప్రయాణ కథలు - అంతిమ పరిక్ష
- డా. బెల్లంకొండ నాగేశ్వరరావు
పల్నాటి యుధ్ధం.
పల్నాటి యుధ్ధం.
- డా. బెల్లంకొండ నాగేశ్వరరావు
కాటమ రాజు కథ.
కాటమ రాజు కథ.
- డా. బెల్లంకొండ నాగేశ్వరరావు
Bhuvi nundi diviki
భువినుండి దివికి
- తాళ్ళూరి చంద్రశేఖర్
లాక్డౌన్ స్మృతులు
లాక్డౌన్ స్మృతులు
- మండా. సూర్యనారాయణ
Kashi Prayana Kathalu - ethuku pi ethu
కాశీ ప్రయాణ కథలు - ఎత్తుకు పైఎత్తు
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు