కలైడోస్కోప్: దేశ విదేశ ప్రసిద్ధ రచనల పరిచయం - నేత్రకంటి శ్రీనివాస యోగానంద రావు

kaleidoscope telugu book

'కెలైడొస్కోప్':దేశ విదేశ ప్రసిద్ధ రచనల పరిచయం పుస్తకం'ప్రస్తుతం వస్తున్న నవలలు, కధా సంకలనానికి భిన్న మైనది. కారణం ఈ పుస్తకం లో ఉన్న 96 కధలు రచయిత్రి రాసినట్లు "కొన్ని రచనలు-అవార్డులు, ప్రైజులు గెలుచుకున్నవి,మరికొన్ని ప్రైజులకోసం షార్ట్/లాంగ్ లిస్ట్ అయినవి.మిగిలిన వి కేవలం కాలక్షేపం కోసం మాత్రమే చదివే వయినా,ఎక్కువ జనాదరణ పొందినవి."ఆ కారణంగా భారతీయాంగ్ల నవలల పరిచయం మాత్రమే కాకుండా ఇతర దేశాలలో వెలువడిన ఇతరభాషల ఇంగ్లీష్ అనువాదాలు, యూరోపియన్/అరబిక్/ఉర్దూ భాషాంతరీకరణలు తెలుగులో చదవే సదావాకాశం, ఆనందం కలుగుతుంది. ముఖ్యంగా సరశమైన,వ్యవాహారిక తెలుగు లో. అంతేకాకుండా రచయత్రి తనకు ఈ రచనలు పరిచయం చేసిన భిన్నమైన సంస్కృతులు,ఆచార వ్యవహారాలు, జీవన శైలులు మనకు బాగా విడమరిచి చెప్పారు. ఈ పుస్తకానికి ఇచ్చిన టైటిల్ ఎంతో అర్థవంతగా ఉంది. ఇంగ్లీష్ పుస్తకాలు కొనుగోలు చేయలేని పక్షంలో ఇటువంటి అనువాద సాహిత్యం తెలుగు సాహిత్య ప్రియులు తప్పని సరిగా కొనుగోలు చేయవచ్చును.

మరిన్ని వ్యాసాలు

తంజావూరు బృహదీశ్వర ఆలయ ప్రధాన శిల్పి గౌరవము
తంజావూరు బృహదీశ్వర ఆలయ ప్రధాన శిల్పి గౌరవము
- కుందుర్తి నాగబ్రహ్మచార్యులు
మంగళగిరి  గాలిగోపురం మార్కాపురం  గాలిగోపురములు
మంగళగిరి గాలిగోపురం మార్కాపురం గాలిగోపురములు
- కుందుర్తి నాగబ్రహ్మచార్యులు
దాసరి సుబ్రహ్మణ్యం.
దాసరి సుబ్రహ్మణ్యం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
విశ్వకర్మ ఎవరు?
విశ్వకర్మ ఎవరు?
- కుందుర్తి నాగబ్రహ్మచార్యులు