అందాల నటి జమున . - డా.బెల్లంకొండ నాగేశ్వరరావు

అందాల నటి జమున .

జమున 1936 ఆగష్టు 30న హంపీలో పుట్టింది. ఆమె తల్లితండ్రులు నిప్పని శ్రీనివాసరావు, కౌసల్యాదేవి. ఆయన ఒక వ్యాపారవేత్త. బాల్యం గడిచింది గుంటూరు జిల్లా దుగ్గిరాలలో. జమునకు ముందుగా నిర్ణయించిన పేరు జనాభాయి. జన్మ నక్షత్రం రీత్యా ఏదైనా నది పేరు ఉండాలని జ్యోతిష్కులు చెప్పడంతో మధ్యలో 'ము' అక్షరం చేర్చి జమునగా మార్చారు. ఉత్తరాదివారు యమునను జమునగా పిలవడంతో ఆమెకు ఆ పేరు ఉంచారు. సినిమా కోసం ప్రత్యేకంగా ఆమె పేరు మార్చలేదు. సినీనటుడు జగ్గయ్యదీ అదే గ్రామం కావడంతొ జమున కుటుంబానికి జగ్గయ్యతో కొంత పరిచయం ఉంది. సహజంగా బెరుకు అంటూ లేని జమున స్కూలులో చదివేకాలంలో నాటకాలపై ఆకర్షితురాలయ్యింది.

తెనాలి సమీపంలోని మండూరు గ్రామంలో 'ఖిల్జీ రాజ్య పతనం' అనే నాటిక ప్రదర్శన కోసం ప్రత్యేకంగా జగ్గయ్య జమున ఎంపిక చేసుకుని తీసుకువెళ్ళాడు. ఇదే నాటికలో మరో ప్రముఖ నటుడు గుమ్మడి వెంకటేశ్వరరావు కూడా నటించాడు. నాటకాలలో ఆమె ప్రతిభ నలుమూలలకూ పాకడం వల్ల సినిమా అవకాశాలు ఆమెను వెతుక్కుంటూ వచ్చాయి. బి.వి.రామానందం తీసిన పుట్టిల్లు ఆమె తొలిచిత్రం.

ఆ తరువాత అక్కినేని నాగేశ్వరరావు, జగ్గయ్య, నందమూరి తారక రామారావు తదితర నటుల సరసన నాయికగా నటించింది. ఎన్ని పాత్రలలో నటించినా ఆమెకు బాగా పేరు తెచ్చింది సత్యభామ పాత్రే. ఆ పాత్రలో ఇప్పటిటికీ ఆమెను తప్ప మరొకరిని ఊహించుకోలేము అన్నట్టుగా నటించిందీమె. వినాయకచవితి చిత్రంలో మొదటి సారి సత్యభామలో జమున కనిపిస్తుంది. ఆ తర్వాత శ్రీకృష్ణ తులాభారం చిత్రంలో కూడా అదే పాత్ర వేసింది. ఈ సినిమాలో సత్యభామ ఆహార్యం గురించి ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నారు. కమలాకర కామేశ్వరరావు దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలోని పాత్రే ఆమెకు పేరు తెచ్చింది. కళపై ఉన్న మక్కువతో నాటకాల్లో బుర్రకథ బ్రహ్మ నాజర్‌ దగ్గర శిక్షణ తీసుకోవటం తన నట జీవితానికి పట్టం కట్టిందన్నారు.

సినీతారలుగా ఉండి, రాజకీయాలలో ప్రవేశించి రాణించిన కథానాయికలలో ఆమె అగ్రస్థానంలో ఉంటారు. దివంగత ప్రధాని ఇందిరా గాంధీ అంటే ఉన్న అభిమానం, గౌరవం నన్ను రాజకీయాలలోకి లాక్కొచ్చాయి అని తన రాజకీయ జీవితం గురించి చెబుతుంది జమున. ఈమె తెలుగు సినిమాలే కాక తమిళం, హిందీ సినిమాలలో కూడా నటించింది. ఆమె నటించిన మిస్సమ్మ, ఇల్లరికం, ఇలవేల్పు, లేతమనసులు, గుండమ్మ కథ చిత్రాలు విజయవంతమయ్యి రజతొత్సవం జరుపుకున్నాయి.

జమున చిన్నతనం నుండే నాటకాలలో నటించేవారు. జమున తల్లి ఆమెకు శాస్త్రీయ సంగీతం, హార్మోనీయంలలో శిక్షణ ఇప్పించారు. మా భూమి నాటకంలో జమున ఒక పాత్ర పోషించగా, ఆమె అభినయం నచ్చి ఆమెకు పుట్టిల్లు (1953)లో నటిగా అవకాశం ఇచ్చారు. ఆ సినిమాతో సినిమాలలోకి తెరంగేట్రం చేశారామె.

తెలుగు, దక్షిణభారత భాషల్లో కలిపి ఆమె 198 సినిమాలు చేశారు. పలు హిందీ సినిమాలలో కూడా నటించారు. 1967లో ఆమె హిందీలో చేసిన మిలన్ సినిమా, 1964లో విడుదలైన మూగ మనసులు సినిమాలకు గాను ఉత్తమ సహాయ నటిగా ఫిలింఫేర్ అవార్డు లభించింది.

తెలుగు ఆర్టిస్ట్ అసోసియేషన్ అనే సంస్థ నెలకొల్పి 25సంవత్సరాలుగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారామె.

1980లలో కాంగ్రెస్ పార్టీలో చేరి రాజమండ్రి నియోజకవర్గం నుంచి 1989లో లోక్ సభకు ఎంపిగా ఎన్నికయ్యారు. ఆ తరువాత రాజకీయల నుండి తప్పుకున్నా, 1990వ దశకంలో భారతీయ జనతా పార్టీ తరఫున ప్రచారం చేశారు.

1965లో జూలూరి రమణరావును వివాహం చేసుకున్నారు జమున. ఆయన శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో జువాలజీ ప్రొఫెసర్ గా పనిచేశారు. 2014 నవంబరు 10లో గుండెపోటుతో మరణించారు ఆయన. వారి కుమారుడు వంశీకృష్ణ, కూతురు స్రవంతి. ప్రస్తుతం హైదరాబాద్ లో ఉంటున్నారు.

అవార్డులుసవరించు

1968: ఉత్తమ సహాయ నటిగా ఫిలింఫేర్ అవార్డు - మిలన్ 1964: ఉత్తమ సహాయ నటిగా ఫిలింఫేర్ అవార్డు - మూగ మనసులు 2008: ఎన్.టి.ఆర్ జాతీయ పురస్కారం 2021 సెప్టెంబర్ 17న హైదరాబాద్‌లోని జేఆర్‌సీ కన్వెన్షన్‌ హాలులో జరిగిన సాక్షి మీడియా 2019, 2020 ఎక్స్‌లెన్స్‌ అవార్డుల కార్యక్రమంలో జీవితసాఫల్య పురస్కారం అందుకుంది.

పాక్షిక సినిమా జాబితా.

తెలుగు. పుట్టిల్లు (1953) నిరుపేదలు (1954) బంగారు పాప (1954) వదినగారి గాజులు (1955) దొంగరాముడు (1955) సంతోషం (1955) చింతామణి (1956) చిరంజీవులు (1956) తెనాలి రామకృష్ణ (1956) భాగ్యరేఖ (1957) దొంగల్లో దొర (1957) వినాయక చవితి (1957) సతీ అనసూయ (1957) భూకైలాస్ (1958) పెళ్ళినాటి ప్రమాణాలు (1958) శ్రీకృష్ణ మాయ (1958) అప్పుచేసి పప్పుకూడు (1959) ఇల్లరికం (1959) వచ్చిన కోడలు నచ్చింది (1959) సిపాయి కూతురు (1959) కృష్ణ ప్రేమ (1961) మోహినీ రుక్మాంగద (1962) ఖడ్గవీరుడు (1962) ఈడూ జోడూ (1964) వీరసేనాపతి (1964) రాముడు భీముడు (1964) దొరికితే దొంగలు (1965) పల్నాటి యుద్ధం (1966) శ్రీకాకుళ ఆంధ్ర మహావిష్ణు కథ (1966) ఉండమ్మా బొట్టు పెడతా (1968) పెళ్ళిరోజు (1968) అత్తా ఓ కోడలే (1969) ఏకవీర (సినిమా) (1969) మట్టిలో మాణిక్యం (1971) పండంటి కాపురం (1972) మేన కోడలు (1972) నిండు కుటుంబం (1973) స్నేహ బంధం (1973) దీక్ష (1974) భూమి కోసం (1974) సంసారం (1975) మేమూ మనుషులమే (1975) - కుప్పి మొగుడా- పెళ్ళామా (1975) మంచి రోజు (1977) కురుక్షేత్రం (1977) కటకటాల రుద్రయ్య (1978) చిరంజీవి రాంబాబు (1978) సతీ సావిత్రి (1978) రాజపుత్ర రహస్యము (1978) శ్రీరామ పట్టాభిషేకం (1978) బంగారు కొడుకు (1982) జల్సారాయుడు (1983) రాజకీయ చదరంగం (1989) అన్నపూర్ణమ్మ గారి మనవడు (2021)

86 ఏళ్ల జమున వృద్యాప్త సంబంధిత వ్యాధులతో బాధపడుతూ 2023 జనవరి 27న హైదరాబాద్‌లోని స్వగృహంలో తుదిశ్వాస విడిచింది.

సేకరణ.

మరిన్ని వ్యాసాలు

చల్ల చల్లగా తియ్య తియ్యగా...
చల్ల చల్లగా తియ్య తియ్యగా...
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
మనసినీ కీర్తిశిఖరాలు -సాలూరి.
మనసినీ కీర్తిశిఖరాలు -సాలూరి.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
తాళపత్రాలు.
తాళపత్రాలు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
మన  అంచనా ఎందుకు తప్పుతుంది?
మన అంచనా ఎందుకు తప్పుతుంది?
- పిళ్లా కుమారస్వామి
జాతీయ విజ్ఞాన దినోత్సవం.
జాతీయ విజ్ఞాన దినోత్సవం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు