నాటి గాయక నటులు. - డా.బెల్లంకొండ నాగేశ్వరరావు

నాటి గాయక నటులు.

 

నాటి నట గాయకుడు.పువ్వుల సూరిబాబు.

దేశ,కాల,నైసర్గిక పరిస్ధితులనుబట్టి స్ధానిక ఆచారవ్యవహరాలకు అనుకూలంగా కళలు ఆవిర్బవించాయి. సంస్కృతంలో కలాశబ్ధం తద్భావ రూపం కళ లయతికలాఅని వ్యుత్పత్తి.వృధ్ధి చెందుతుంది కనుక అదికళ. అంటే చంద్రునిలో పదహరో భాగమని,శిల్పమని అర్దాలు.

"శిశుర్వేత్తి పశుర్వేత్తి వేత్తి గానరసంపణిః ".గానం చెప్పారు మనపెద్దలు. మనకీర్తనలలో వినిపించేది శబ్దము,అర్దము,భావము,రాగాలాపనలో ఓకొక్కరు ఒక్కోవిధంగా పాడిని వాటిఉద్యేశం ,ప్రజలను రంజిపజేయడమే ,అసలు మనలలిత కళల ప్రయోజనం విశ్వశ్రేయస్సే.పూర్వంవేద కాలంలో "ఉదాత్త" "అనుదాత్త" "స్వరిత" అనేమూడుస్వరాలేఉండేవట, కాలక్రమంలోఅవిసప్తశ్వరాలుగామారాయి .యివి జనపదాలనుండి మౌఖికంగాను కకళాకారులు పలురూపాలలో ప్రజలవద్దకు చేర్చారు. అలారంగస్ధలం యిందులో ప్రముఖపాత్రవహించింది.

1880లో తొలిసారిగా నాటకంలో అంతర్నాటకం ప్రవేశపెట్టి "నందకరాజ్యము"అనేనాటకం వావిలాల వాసుదేవశాస్త్రి రచించారు.అదేసంవత్సరం తొలిసారిగాప్రదర్శన యిచ్చిన ప్రహసనంరూపంలో "బ్రహ్మవివాహం"రచించిన తొలి ప్రహసనకర్త కందుకూరి వీరేశలింగం పంతులుగారు. తెలుగు నాటకరంగానికి ఎందరో మహనీయులు తమవంతు సేవలు అందించారు. అటువంటికళామూర్తులలో ఒకరైన పువ్వుల సూరిబాబు గుడివాడ తాలూకా బోమ్మలురులో 1915 పిబ్రవరి 22 న జన్మించారు. అప్పటికే బొమ్మలూరులో లింగం అంజయ్యగారు సీతారామాంజనేయ నాటక సమాజాన్ని స్ధాపించి ప్రదర్మనలు యిస్తుండేవారు, ఆరుసంవత్సరాలవయసులో సూరిబాబు తొలిసారిగా "బొబ్బిలి"నాటకం లో చినరంగారావు పాత్రలో నటించారు,అదిచూసిన సూరిబాబు తండ్రి బుల్లి సుబ్బయ్య తల్లిశ్రీహరి ఆనందంతో ప్రోత్సహించా రు.మేనమామ సంగీత శిక్షణపొంది గుడివాడవాస్తవ్యులు డి.వి.యల్ .నరసింహరావు,

పి.చంద్రమౌళి,కానూరిహేమాంబరదాసు వంటిమిత్రులతో గద్వాల్ లోని నాటకసమాజంలోచేరి రామదాసులో రఘరాముడిగా,కృష్ణలీలలలో బాలకృష్ణుడిగా నటించారు. అప్పుడు గుంటూరులో దంటువెంకట కృష్ణయ్యగారు "బాలమిత్రసభ"పేరున చిన్నపిల్లల నాటక సమాజం నడుపుతున్నారు ,అందులో చేరిన సూరిబాబు కొప్పరపు సుబ్బారావుగారివద్ద సంగీత శిక్షణపొందుతూ నారదుడు ,కుచేలుడు,వసుదేవుడు,కంసుడు వంటి పాత్రలుధరిస్తూ మంచిపేరు పొందారు.అనంతరం కూరుకూరి సుబ్బారావుగారి నాటకసమాజంలోచేరి "భక్తవిజయం"" "మాయమధుసూధన"వంటి నాటకాల్లోనటించారు. అలాఎంతో నాటకరంగ అనుభవం గడించి తనయింటిలోని వేయికాసుల బంగారంఅమ్మి వచ్చిన పదమూడువేలరూపాయలతో1931లో బాలకృష్ణ నాటకసమాజంస్ధాపించి ఆర్దికంగా నష్టపోయారు.1936లో తెనాలిచేరి సత్యనారాయణ నాట్యమండలిలో చేరి పలునాటకాలు ప్రదర్శించారు.

తొలిసారాగా 1954లో కన్నాంబ భర్త కె.బి.నాగభూషణం నిర్మించిన "సతిసక్కుబాయి" చిత్రంలో నటించి మంచిగాయకుడిగా గుర్తింపు పొందారు, అలా" శ్రీకృష్ణతులాభారం"(1955)స"తీసావిత్రి" (1957) "శ్రీరామాంజనేయయుధ్ధం"(1958)శ్రీకృష్ణలీలలు" ( 1959) "శ్రీవెంకటేశ్వరమహత్యం" (1960)ఉషపరిణయం(1961) వంటి పౌరాణికచిత్రాలతోపాటు "మాలపిల్ల" వంటి పలుసాంఘీక చిత్రాలలో రత్నాలవంటి పాటలు ముత్యాలవంటి పద్యాల కు తెలుగు ప్రజలు నీరాజనాలు అందించారు.

1944 లోరాజేశ్వరి నివివాహం వివాహంచేసుకుని "రాజరాజేశ్వరి నాట్యమండలి" స్ధాపించి కొప్పరపు వారిచే"తారాశశంకం" నాటకాన్ని రాయించి తను దర్శకత్వం వహిస్తూ ఇరవైనాలుగేళ్ళపాటు నిర్విరామంగా వేలప్రదర్శనలు ఇచ్చారు. తీరిక సమయాల్లో యస్ .వి.రంగారావు. పద్మనాభం. తిలకం.సంధ్య.యస్ .వరలక్ష్మి వంటి వారు సూరిబాబుతోకలసి నటించేవారు.

ఈనాటకసమాజం"భూకైలాస్ " "కురుక్షేత్రం" "విప్రనారాయణ" "తులాభారం" వంటినాటకాలను దేశంఅంతటా ప్రదర్శించారు. "కళావిశారదా" "గానగంధర్వ" బిరుదులు పొందిన సూరిబాబు కంఠం ఫర్లాంగుదూరం వినిపించేది,వీరికి ముగ్గురు కుమార్తెలు ,నటి హేమలత వీరిసోదరి అనిఅంటారు.1946లో మైసూరుమహరాజా దర్బారులో ఘనంగా సత్కారంపొందారు,1957 మార్చిమాసం తెనాలిలో టి.ఆర్ .రామకృష్ణరాజుగారి అధ్యక్షతన సూరిబాబుగారికి "గజారోహణం" "గండపెండేరం" "కనకాభిషేకం ,మొదలగుఘనసన్మానాలుజరిగాయి. డా.సర్వేపల్లి రాధాకృష్ణగారు వీరి "విప్రనారాయణ" నాటకం చూసి వీరిచే భగవద్గీత శ్లోకాలు పాడించుకుని రికార్డింగ్ చేయించుకున్నారు. ప్రుద్విరాజ్ కపూర్ వంటివారిమన్ననలు పొందిన ఇంతటి కళామూర్తి 1968 పిబ్రవరి 12న విజయవాడలో కళామతల్లిఒడిలో శాశ్విత నిద్రపోయారు.