గుండె చప్పుడు - మినీ కవితలు - కొట్టె సుధాకర్ రెడ్డి

Gunde Chappudu

కవిత పొట్టిదా పొడుగుదా కాదు తను చెప్పదలుచుకున్నది సూటిగా చమత్కారంగా చదువుతుంటే చదవాలనే జిజ్ఞాస కల్పించడం కవిత యొక్క ముఖ్య ఉద్దేశం కవి యొక్క భావుకత సృజనాత్మకత సమకాలిక పరిస్థితులపై అవగాహన సామాజిక పరిస్థితులపై ఆలోచన ప్రస్ఫుటించే విధంగా రాయటంలో ఒక పంక్తి నిడివా ఇంకా ఎక్కువ నా అనేది అప్రస్తుతం తన భావం చదువరులలో వారి మస్తిష్కంలో ఎంతవరకు భావవ్యాప్తి చేయడంలో సఫలీకృతులైనరనేది ముఖ్యం శ్రీ మెట్టు మురళీదర్ గారు తన మినీ కవితల సంపుటి #గుండెచప్పుడు ద్వారా పాఠకుల మనసును కొల్లగొట్టారు అనేది విశ్వశింపగల నిజం.

తన భాష ప్రాస నచ్చలేదని ఎవరో బాధపడతారని వెరువక సూటిగా భావ ప్రకటనను చేయగల చమత్కారి మన మెట్టు మురళీధర్ గారు మినీ కవితలతోనే విస్పోటం సృష్టిం చారు సూటిగా సూక్ష్మంగా చెప్పగల నేర్పరి చదువరులకు కనువిప్పు కలిగేలా రాయడం వీరి గొప్పతనం. మహానుభావుడు అనిపించుకునే కన్నా మానవత్వ విలువలు పెంచుకోవడం గొప్ప అన్నారు సమాజం బ్రష్టు పడుతుందని ఊరికే గగ్గోలు పెట్టకుండా సరిచూపే మార్గాలని అన్వేషించాలన్నారు అవినీతిలో కూరుకుపోయినన రాజకీయాయకులను ప్రజాక్షేత్రంలో దండలు వేసి దండాలు పెట్టి ఊరేగించడం పందికి సెంటుతోస్నానంం చేసినట్లని వ్యంగ్యంగా ఉటంకించారు.

చెత్తలో దొరికిన చిత్ర రధమని ఆనాడు శ్రీ శ్రీ అన్నట్లు చెత్త నుండి కూడా విద్యుత్తు తీయగలిగినప్పుడు మంచి మనసున్న వ్యక్తులకు విలువ లేదు ఎందుకని ప్రశ్నించారు. కూతురు కోడలు ఇద్దరూ ఒకటేననే దృష్టి కోణాన్ని ఆవిష్కరించారు. ఇంటర్నెట్ ఇంద్రజాలాన్ని పద్ధతి ప్రకారం వాడుకోమన్నారు పాపాలు మోసాలు చేసి ఏడుకొండలెక్కి దక్షిణగా కొంత సొమ్ము హుండీలో వేసినంత మాత్రాన పాపాలు సమసి పోతాయా అని ప్రశ్నించారు అత్యాచారం చేయబడి సగం చచ్చిన కళేబరాన్ని పదేపదే ప్రదర్శించి మిగతా సగం మనం చంపడం ఎందుకు మారాలి ఎలక్ట్రానిక్ మీడియా అని నర్మగర్భంగా చెప్పారు.

సిఆర్పిసి సెక్షన్లోని వ్యత్యాసాలను ఎత్తిి చూపారు సీరియల్ అంటే సి...రియలా లేక సీ...రి...య... ల్ లాంటి సాగదింపా అని చమత్కరించారు.అస్మదీయుల కోసం ఔటర్ రింగ్ రోడ్డు పాములా అష్టవంకరలు తిరుగుతుంటే చూసి ప్రశ్నించారు. జానెడు మూరెడు బట్టలేసుకొని చిందులేసే నెరజానలను జాలిగా ప్రస్తావించారు. అమ్మ ఒడిని స్వర్గంతో పోల్చుతూ అఘాయిత్యాలు ఎక్కువైతే అపర కాళికై విరుచుకుపడుతారని హెచ్చరించారు తల్లి ఆమె చెల్లి ఆమె భార్య ఆమె కూతురు ఆమె తర్వాతే ఎవరైనా అని ఆమె యొక్క గొప్పదనాన్ని ప్రశంసించారు తెలంగాణ కవి కాలన్నను తెలంగాణ జాతిపిత జయశంకరుడుని ప్రస్తావిస్తూ వారిలోని తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని అభినందనలతో ముంచెత్తారు నేటి చదువులు విద్యతో కాకుండా కాసులతో నడిపిస్తున్నారని టాలెంట్ స్కూల్లో ఫీజుల మోతను ఎండ కట్టారు. ఎల్లో జర్నలిజాన్ని వదిలిపెట్టలేదు సా సాంప్రదాయ బద్దంగా ఆడవలసిన హోలీని బురదతో కుళ్ళు పడ్డ కోడిగుడ్లతో కుళ్ళుబడ్డ కోడిగుడ్లతో బ్రష్టు పట్టినయ్యకుండా ఆడమని ఉద్బోధించారు నోటా ఓట్ల కొన్న ప్రాధాన్యతను ప్రశ్నిస్తూనే నాలుగు సంవత్సరాలు దోచుకుని ఐదవ సంవత్సరం ఐదు శాతం పంచిపెట్టి గద్దెనెక్కే ఊరేగే ప్రజా నాయకులకు ప్రజలను ఉద్ధరించి..పాలిస్తే పల్లకిలో ఊరేగిస్తారని నిర్ధేశించారు...

ఇంతటి చమత్కారులైన పొట్టోకవితల గట్టి కవి గారిని పరిచయం చేసిన శ్రీ కెల్విప్రసాద్ గారికి అభివాదాలు చేసుకుంటూ... ఇద్దరు మహోన్నత సాహితీసౌరభాల తో చెంత చేరి ఫోటో దిగడం నాకు మహాగర్వకారణం అని తెలియజేస్తూ శ్రీ మెట్టు మురళీధర్ గారికి మరియు డాక్టర్ కెల్వి ప్రసాదు గారికి వినమ్రపూర్వక అభివాదాలు తెలియచేసుకుంటున్నాను.

మరిన్ని వ్యాసాలు

రామాయణంలో కొన్ని పాత్రలు.
రామాయణంలో కొన్ని పాత్రలు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
వీర శైవ మతం.
వీర శైవ మతం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
రామాయణానికి ముందు.
రామాయణానికి ముందు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Poorva janma krutam paapam
పూర్వజన్మ కృతం పాపం
- సి.హెచ్.ప్రతాప్
బిల్వపత్రం ప్రాశస్త్యం
బిల్వపత్రం ప్రాశస్త్యం
- సి.హెచ్.ప్రతాప్
సీనియర్ శ్రీరంజని.
సీనియర్ శ్రీరంజని.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు