కరోనా బ్యాచ్ - Sankar VNM

కరోనా బ్యాచ్

కోటి కలల కొత్త జాబ్, కొట్టగానే , కలయ తిరిగా campus అంతా
దోస్తీ గాడికి దవతిచ్చ , పబ్ లో చిందులేసా
ఇంటికొచ్చి పంచిపెట్టా కాజా, అమ్మతో అన్నారు నీ కొడుకు రాజా.

వచ్చింది కరోనా , తెచ్చింది హైరానా ,
స్కూలు బంధు , కాలేజీలు బంద్, ఆఫీస్ బంద్, హాస్పిటల్ బంద్,
ఊరు బంద్, వీధి బంద్, ఇంటి ముందు ఊసులు బంద్,
ఇంటి ఎనక ఆటలు బంద్, లవర్ తో రైడులు బంద్,
ఇంటిలోన ఒంటి బతుకు , రాజు అన్న నోరూ , పాపం అన్న ఊరు

కళ్ల ముందు ఎగిరిపోయే కాల్ లెటర్ మాట …
రేపంటూ మాపంటూ hr లా రెండేళ్ల ఆట
మొదటికొచ్చిన ఉద్యోగ వేట, కష్టపడి కొట్టానో చోట
కళ్ళముందు కదిలింది కలర్ ఫుల్ తోట, గుండెల్లో తినుమరు ఆట ,
దొరికింది ఆఫీస్ లో జాగా, వేసాను టీం లో పాగా
పక్క టిము పోరగాడు అక్కసు గా అన్నాడు , కరోనా బ్యాచ్ అని

ఉసూరుమంది హుషారంతా... ఊపు మీద వున్నా నేను వీక్ ఐపోయా ,
కరోనా వచ్చింది కాలమాగి పోయింది, గాయం నాకు చేసింది
మ్యాచ్ కానీ మాటలతో బ్యాచ్ పేరు పెట్టారు , కరోనా బ్యాచ్ అని
కళ్ళలోన చిన్న చూపు మాటలోని కుళ్ళు జోకు,
కోడ్ అంటే కరోనా వార్డు కాదంటూ ఒకడు ,
సోషల్ నెట్వర్క్ లో డిస్టెన్స్ అంటూ ఇంకొకడు కరోనా బ్యాచ్ అంటూ గేలి చేసి గాలి తీసి గోల గోల చేశారు .